'ప్రజల్లో విశ్వసనీయత కొల్పోయిన బాబు' | Chandra babu lost his faith in public, says Mla Bhumana Karunakar Reddy | Sakshi
Sakshi News home page

'ప్రజల్లో విశ్వసనీయత కొల్పోయిన బాబు'

Published Tue, Sep 17 2013 3:24 PM | Last Updated on Sat, Jul 28 2018 3:21 PM

'ప్రజల్లో విశ్వసనీయత కొల్పోయిన బాబు' - Sakshi

'ప్రజల్లో విశ్వసనీయత కొల్పోయిన బాబు'

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రజల్లో విశ్వసనీయతను కొల్పోయారని తిరుపతి ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. తిరుపతిలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రజాభిమానం పొందేందుకే పదేపదే బాబు తన ఆస్తుల వివరాలను ప్రటకిస్తున్నారని ఆయన ఆరోపించారు.

 

చిత్తూరు, నెల్లూరు, హైదరాబాద్ తదిరత ప్రాంతాల్లోనే కాకుండా విదేశాల్లో కూడా చంద్రబాబుకు ఆస్తులు ఉన్నాయన్నారు. ఆ ఆస్తులన్ని చంద్రబాబు బినామి పేర్లతో ఉన్నాయన్నారు. బాబుకు చిత్తశుద్ధి ఉంటే తన ఆస్తులపై సీబీఐ చేత దర్యాప్తు జరిపించి తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement