'బీకాంలో ఫిజిక్స్‌'పై చంద్రబాబు ఆరా..! | chandrababu meeting with krishna district tdp leaders | Sakshi
Sakshi News home page

'బీకాంలో ఫిజిక్స్‌'పై చంద్రబాబు ఆరా..!

Published Sat, Mar 11 2017 10:58 PM | Last Updated on Fri, Aug 10 2018 7:19 PM

'బీకాంలో ఫిజిక్స్‌'పై చంద్రబాబు ఆరా..! - Sakshi

'బీకాంలో ఫిజిక్స్‌'పై చంద్రబాబు ఆరా..!

విజయవాడ: కృష్ణా జిల్లా నేతలతో శనివారం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. ఒకరి నియోజకవర్గంలో మరో నేత అసలు జోక్యం చేసుకోవద్దని నేతలకు సూచించారు. బోండా ఉమామహేశ్వరరావు భూకబ్జా ఆరోపణలపై చంద్రబాబు వివరణ అడిగారని సమాచారం. ఈ సమావేశంలో అనంతపురం జిల్లా ధర్మవరం ఘటనను పార్టీ నేతలతో చంద్రబాబు ప్రస్తావించారు. కలిసి పనిచేయమంటే రాళ్ల దాడులు చేసుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి ఘటనలకు పాల్పడవద్దని జిల్లా నేతలకు సూచించారు.

ఈ భేటీలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. టీడీపీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌కు సంబంధించిన 'బీకాంలో ఫిజిక్స్' అంశం ప్రస్తావనకు రాగానే సీఎం చంద్రబాబు సహా టీడీపీ నేతలు ఒక్కసారిగా నవ్వేశారట. దీనిపై పార్టీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ను సీఎం వివరణ అడిగారు. తాను మీడియాకు చెప్పిందొకటని, అయితే వారు రాసిందొకటని తడుముకుంటూనే పార్టీ అధినేత చంద్రబాబుకు ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement