గుంటూరు: ప్రొద్దుటూరులో జరగాల్సిన ఎన్నికల తెలుగుదేశం పార్టీ నాయకుల కారణంగానే ఆగిపోయిందని వైఎస్‌ఆర్‌సీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. టీడీపీ నేతలు వరదరాజుల రెడ్డి, ఆదినారాయణ రెడ్డిలు కౌన్సిలర్లను బెదిరించారని అన్నారు. ఒకరు మినిట్స్ బుక్‌ను ఎత్తుకెళ్తే, ఇంకొకరు ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారని చెప్పారు. కౌన్సిలర్లు చంద్రబాబు, లోకేష్ ఫోన్ చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. ఓటమి అంటేనే టీడీపీ నేతలు భయపడుతున్నారని అన్నారు.