కర్నూలు , ఆలూరు: చిప్పగిరి మండల తహసీల్దార్ సూర్యనారాయణ ప్రసాద్‌పై ఆ మండలంలోని బెల్డోణ గ్రామానికి చెందిన దళిత మహిళలు సోమవారం దాడి చేశారు. ఆలూరులో వాసవీ కల్యాణ మండపం లో మీకోసం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరవుతున్నారని ఆ గ్రామానికి చెందిన దళితులు చేరుకున్నారు. అయితే ఈ సమావేశానికి తహసీల్దార్ కూడా హాజరయ్యారు. ఈ గ్రామంలో 1971లో దళితులకు సర్వే నంబర్ 146లో 4.66 సెంట్లను కాలనీకి కేటాయిం చారు. ప్రస్తుతం ఇదే సర్వే నెంబరులోని 85 సెంట్ల మిగులు భూమి రోడ్డు సమీపంలో ఉంది. రోడ్డుకు ఇరుపక్కల అదే గ్రామానికి చెందిన రామకృష్ణ ,సురేష్ మరికొందరికి పట్టాలను గత మూడు నెలల క్రితం తహసీల్దార్ మంజూరు చేశారు.
తమ స్థలాన్ని షెడ్యూల్డ్ తెగల కులస్తులకు ఎలా కేటాయిస్తారని దళితులందరూ పలుమార్లు తహసీల్దార్‌కు విన్నవించారు. అయినా ఆయన దళితుల మాట పెడచెవిన పెట్టినట్లు తెలుస్తోంది. సోమవారం ఆలూరులో మీ కోసం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చి తహసీల్దార్ సూర్యానారయణ ప్రసాద్‌తో మహిళలు వాగ్వాదానికి దిగారు. కోపోద్రిక్తులై చొక్కా పట్టుకొని పిడిగుద్దులు గుద్దారు. అనంతరం తమకు న్యాయం చేయాలని సమస్యసను జిల్లా కలెక్టర్ సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లారు. చేసిన తప్పును వెంటను సరిదిద్దుకోపోతే చర్యలు తప్పని తహసీల్దార్‌ను కలెక్టర్ హెచ్చరించారు. రెండు రోజుల్లోగా సమస్య పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు.
Comments
Please login to add a commentAdd a comment