29 నుంచి డీఎడ్ ప్రథమ సంవత్సరం పరీక్షలు | DED primary annual exams to be held from Dec 29 | Sakshi
Sakshi News home page

29 నుంచి డీఎడ్ ప్రథమ సంవత్సరం పరీక్షలు

Published Wed, Dec 10 2014 2:40 AM | Last Updated on Sat, Sep 2 2017 5:54 PM

DED primary annual exams to be held from Dec 29

సాక్షి, హైదరాబాద్: ఏపీలో 2013-15 బ్యాచ్ డీఎడ్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ఈ నెల 29 నుంచి జనవరి 2వ తేదీ వరకు జరుగుతాయని ప్రభుత్వ పరీక్షల డెరైక్టర్ ఆర్.సురేందర్‌రెడ్డి తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. 29న పేపర్ 1- ఎడ్యుకేషన్ ఇన్ ఎమర్జింగ్ ఇండియా, 30న పేపర్ 2 - ఎడ్యుకేషనల్ సైకాలజీ మెజర్‌మెంట్ అండ్ ఎవాల్యుయేషన్, 31న పేపర్ 3 - ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ప్లానింగ్ మేనేజ్‌మెంట్ అండ్ టీచర్ ఫంక్షన్స్, జనవరి 1న పేపర్ 4 - పర్‌స్పెక్టివ్స్ ఇన్ ప్రైమరీ అండ్ ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్, 2వ తేదీన పేపర్ 5 - కెపాసిటీ బిల్డింగ్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement