సాక్షి, నిజామాబాద్: ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఏడు నెలలు గడిచినా ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ (ట్రైకార్)ల కార్యాచరణ ప్రణాళికలకు ఇంతవరకు ప్రభు త్వం ఆమోదం తెలపలేదు. ఇందిరమ్మ కలలు అభా సు పాలవుతున్నాయనడానికి ఇది నిదర్శనం. ఈ సం స్థల ద్వారా స్వయం ఉపాధి, పునరావాస, వ్యవసాయానుబంధ పథకాలు అమలవుతాయి. అయితే సర్కార్ నిర్లక్ష్యం కారణంగా ఈ ఏడాది ఇవి కుంటుపడిపోయాయి. దీంతో ఈ పథకాల లబ్ధి నిరుపేద దళిత, గిరి జనుల దరి చేరడంలో జాప్యం జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌ల పథకాల యూనిట్ల కోసం జిల్లాలోని నిరుపేద దళిత, గిరిజనులు ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్నారు. ఆయా మండలాల ఎంపీడీఓల ద్వారా ప్రతిపాదనలు అందాయి. యూనిట్ల మంజూరు.. నిధుల కేటాయింపులు.. సబ్సిడీల పెంపు వంటి విషయాల్లో సర్కారు నిర్ణయం తీసుకోవడంలో నెలల తరబడి జాప్యం జరుగుతోంది. దీంతో దరఖాస్తుదారులకు ఎదురుచూపులే మిగులుతున్నాయి.
ట్రైకార్...
మైదాన ప్రాంతాల్లో నివాసముండే గిరిజనుల సంక్షేమం కోసం సర్కారు ట్రైకార్ ద్వారా పలు పథకాలను అమలు చేస్తోంది. కిరాణషాపులు, టైల ర్లు, టెంట్‌హౌజ్, ఇంటర్నెట్ సెంటర్లు, ఫొటోస్టుడియో వంటివి ఏర్పా టు చేసుకుని స్వయం ఉపాధి పొందుతున్న గిరిజన యువతకు సబ్సిడీ రూపంలో ఆర్థిక సహాయం అందిస్తుంది. ట్రాక్టర్ల కొనుగోలు, భూముల్లో సాగునీటి సదుపాయాల కల్పన, డెయిరీఫాంలు, గొర్రెల పెంపకం వంటి యూనిట్లకు కూడా సబ్సిడీలు మంజూరు చేస్తుంది. లబ్ధిదారులు బ్యాంకుల ద్వారా రుణాలు పొంది వీటిని ఏర్పాటు చేసుకుంటే ట్రైకార్ సబ్సిడీలతో చేయూతనందిస్తుంది. గత ఏడాది జిల్లాకు వివిధ పథకాల కింద 430 యూనిట్లు మంజూరయ్యాయి. కానీ ఏడాది ఏడునెలలు గడిచినప్పటికీ మంజూరు ఊసే ఎత్తడం లేదు. ఈ ఏడాది 480 యూనిట్లకు లబ్ధిదారులనుంచి దరఖాస్తులు తీసుకున్న గిరిజన సంక్షేమశాఖ అధికారులు చేసేదేమీ లేక సర్కారు నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు.
ఎస్సీ కార్పొరేషన్..
ఎస్సీ కార్పొరేషన్‌లోనూ దాదాపు ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఏడు నెలలుగా కార్యాచరణ ప్రణాళికకు ఆమోదం లభించకపోవడంతో నిరుపేద దళితులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకాలతో పాటు, జోగినులు, జైలు నుంచి విడుదలైన దళిత ఖైదీలకు పునరావాసం., సఫాయి, కర్మచారుల సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేస్తోంది. చిన్ననీటి పారుదల సౌకర్యం, బోర్లు, పంపుసెట్లు, భూమికొనుగోలు, పాడిగేదెలు, గొర్రెల పెంపకం వంటి యూనిట్లకు సబ్సిడీని అందిస్తారు. ఏటా ఆగస్టులోపే ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను ప్రకటించేది. ఈ మేరకు లబ్ధిదారుల ఎంపిక, యూని ట్ల మంజూరు పత్రాల జారీ వంటి ప్రక్రియ అంతా ఎప్పుడో పూర్తయ్యే ది. ఈసారి ప్రభుత్వం ఇంత వరకు కార్యాచరణ ప్రణాళిక ఊసే ఎత్తకపోవడంతో సాంఘిక సంక్షేమశాఖ అధికారులు ముందుకెళ్లలేకపోతున్నారు.
సర్కారు ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాం..
ఆయా పథకాలకు సబ్సిడీని పెంచే యోచనలో సర్కారు ఉంది. ఇందుకోసం కార్యాచరణ ప్రణాళిక అమలులో జాప్యం జరుగుతోంది. అని సాంఘిక సంక్షేమశాఖ జాయింట్ డెరైక్టర్ కాలేబు ‘సాక్షి’తో పేర్కొన్నా రు. ఇప్పటికే రూపొందించిన కార్యాచరణ ప్రణాళికకు ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే యూనిట్ల మంజూరుకు చర్యలు తీసుకుంటాం.. అని జిల్లా గిరిజన సంక్షేమశాఖాధికారి రాములు తెలిపారు.
‘ఇందిరమ్మ కలలు’ కల్లలేనా!
Published Fri, Nov 8 2013 4:49 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement