సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వ విధానాల వల్ల వైద్య ఆరోగ్య శాఖ ప్రతిష్ట దిగజారిపోయిందని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని విమర్శించారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. వైద్య, ఆరోగ్య రంగ అభివృద్ధిపై టీడీపీ ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. టీడీపీకి సూచనలు, సలహాలు ఇచ్చే అర్హత ఉందా అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పర్యవేక్షణ కరువైందని..ఫలితంగా వేల మరణాలు సంభవించాయన్నారు. ఆరోగ్యశ్రీ నిధులను కూడా పక్కదో పట్టించారని మండిపడ్డారు. రూ.600 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చెల్లిందని వెల్లడించారు. చంద్రబాబు సంతకం చేసిన ఎన్నో చెక్కులు బౌన్స్ అయ్యాయన్నారు. ఆరు నెలల పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యశ్రీలో పెనుమార్పులు తెచ్చారన్నారు. సీఎం జగన్ విశ్రాంతి సమయంలోనూ ఆర్థిక సాయం అందిస్తున్నారని ఆళ్ల నాని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment