రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలలో ప్రవేశానికి గురువారం నిర్వహించిన ఎంసెట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని ఎంసెట్ -2014 పరీక్ష కన్వీనర్ రమణారావు వెల్లడించారు. గురువారం విశాఖపట్నంలో మాట్లాడుతూ... వచ్చే నెల 9వ తేదీన ఎంసెట్ ఫలితాలు విడుదల చేస్తామన్నారు. ఎల్లుండ ఎంసెట్ ప్రాధమిక కీ, 31న ఫైనల్ కీ విడుదల చేస్తామని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా మాల్ ప్రాక్టీస్ ఎక్కడ జరగలేదన్నారు. పరీక్షకు 5 నుంచి 10 మంది మాత్రమే ఆలస్యంగా వచ్చారని చెప్పారు. ఇంజనీరింగ్ విభాగంలో 94.37 శాతం, మెడికల్ విభాగంలో 93.03 శాతం మంది విద్యార్థులు హాజరైయ్యారన్నారు. ఇంజనీరింగ్, మెడికల్ విద్యార్థులు విజయవాడలో అత్యధికంగా హాజరైయ్యారని రమణారావు వెల్లడించారు.