రాజాసింగ్ హత్యకు కుట్ర, నలుగురి అరెస్ట్ | foul play for bjp corporator raja singh murder busted | Sakshi
Sakshi News home page

రాజాసింగ్ హత్యకు కుట్ర, నలుగురి అరెస్ట్

Published Fri, Mar 21 2014 3:19 PM | Last Updated on Fri, Oct 19 2018 7:52 PM

రాజాసింగ్ హత్యకు కుట్ర, నలుగురి అరెస్ట్ - Sakshi

రాజాసింగ్ హత్యకు కుట్ర, నలుగురి అరెస్ట్

హైదరాబాద్: బీజేపీ కార్పొరేటర్ రాజాసింగ్ను హత్య చేసేందుకు కొంతమంది వ్యక్తులు చేసిన కుట్ర భగ్నమైంది. నాంపల్లి కోర్టు వద్ద భారీ సంఖ్యలో మారణాయుధాలు దొరకడం సంచనలం రేపింది. కోర్టు ప్రాంగణంలోని వాహనాల పార్కింగ్ వద్ద వీటిని కనుగొన్నారు. ఇన్నోవా కారులో ఉంచిన వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

మంగళ్‌హాట్ బీజేపీ కార్పొరేటర్ రాజాసింగ్‌ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఆయనను హత్య చేసేందుకు నిందితులు మారణాయుధాలతో వచ్చారని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వివాదస్పద నాయకుడిగా పేరుగాంచిన రాజాసింగ్‌పై గతంలో ఓ పాస్టర్ హత్యకేసు ఉంది. రాజాసింగ్ ప్రాణాలకు ముప్పు  ఉందని ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు చాలాకాలంగా చెబుతూ వస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement