18న ఫీజు రీయింబర్స్మెంట్పై నిర్ణయం
హైదరాబాద్ : విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టనున్నట్లు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈనెల 18న ఫీజు రీయింబర్స్మెంట్పై నిర్ణయం తీసుకుంటామని ఆయన సోమవారమిక్కడ చెప్పారు.
హైదరాబాద్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించనున్నట్లు గంటా తెలిపారు. అనంతరం బోధనారుసుంపై ఓ ప్రకటన చేస్తామన్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్పై కాస్త అస్పష్టత ఉందని, దానిపై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈనెల 18న మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు గంటా తెలిపారు.