ఏపీలో పంట రుణాల మాఫీపై కోటయ్య కమిటీ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ రుణాల మాఫీ మార్గదర్శకాల ఖరారుకై కోట య్య అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ కసరత్తు ముమ్మరం చేసింది. ఎటువంటి ఆంక్షలు, పరి మితులు పెడితే రుణ మాఫీ భారం తగ్గుతుందనే తరహాలో కమిటీ కసరత్తు చేస్తోంది. వ్యవసాయ రుణాలెంతో గణాంకాలు సిద్ధంగా ఉన్నప్పటికీ కోటయ్య కమిటీ ఇంకా గణాంకాలు కావాలంటూ బ్యాంకర్లకు సూచిస్తోంది. సోమవారం కమిటీ బ్యాంకర్లు, ఆర్థిక, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో సుమారు నాలుగు గంటలకు పైగా సమావేశమైంది. అయినా ఎటువంటి అభిప్రాయానికి రాలేదు. చిన్న, సన్న కారు రైతులు ఎంత మంది ఉన్నారు? వారు తీసుకున్న రుణాలెంత? చిన్న, సన్న కారు రైతులంటే ఎంత మేర పొలం ఉండాలి? చిన్న రైతులంటే రెండున్నర ఎకరాలు, సన్న రైతులంటే ఐదు ఎకరాలు అనే లెక్కలు తీయాలని అధికారులకు కమిటీ సూచించింది.
లక్ష రూపాయల వరకు ఉన్న రుణాలెంత? లక్షన్నర రూపాయల వరకు ఉన్న రుణాలెంత? బంగారం రుణాలు ఎంత? అందులో వ్యవసాయానికి తీసుకున్న బంగారం రుణాలెంత? మహిళల పేరుమీద ఉన్న రుణాలెంత? అనే వివరాలను బ్యాంకర్లను కమిటీ కోరుతోంది. పెద్ద రైతులు ఎంత మంది ఉన్నారు? వారు తీసుకున్న రుణాలెంత? అందులో వారికి ఎంతమేర రుణాలు మాఫీ చేయవచ్చు అనే అంశాల ఆధారంగా కమిటీ చర్చించింది. ప్రాధమికంగా చిన్న, సన్నకారు రైతులంటే ఎవరు అనే నిర్ధారణకు మాత్రం వచ్చినట్లు తెలిసింది. కమిటీ తిరిగి మంగళవారం కూడా సమావేశమై చర్చించనుంది.
ఏ ఆంక్షలు పెడితే ఎంత భారం తగ్గుతుంది?
Published Tue, Jun 17 2014 2:49 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement