రాజకీయాల్లోకి రావట్లేదు: లక్ష్మీనారాయణ | Iam not join politics, says Ex-CBI JD lakshminarayana | Sakshi
Sakshi News home page

రాజకీయాల్లోకి రావట్లేదు: లక్ష్మీనారాయణ

Published Fri, Feb 28 2014 12:56 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

రాజకీయాల్లోకి రావట్లేదు: లక్ష్మీనారాయణ - Sakshi

రాజకీయాల్లోకి రావట్లేదు: లక్ష్మీనారాయణ

హైదరాబాద్: తాను బీజేపీలో చేరబోతున్నట్టు వచ్చిన వార్తలను సీబీఐ పూర్వ జేడీ, థానే నగర జాయింట్ పోలీసు కమిషనర్‌ లక్ష్మీనారాయణ తోసిపుచ్చారు. అవన్నీ మీడియా కల్పితాలేనని స్పష్టం చేశారు. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని అన్నారు. లక్ష్మీనారాయణ త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారని, బీజేపీ నాయకులు ఆయనను తమ పార్టీలోకి ఆహ్వానించినట్టు వార్తలు వచ్చాయి. ఆమ్ ఆద్మీపార్టీ నేతలు కూడా ఆయనను సంప్రదించారని వెల్లడించాయి.

బీజేపీ చేరితేనే బాగుంటుందని లక్ష్మీనారాయణకు సన్నిహితులు సూచించినట్టు పేర్కొన్నాయి. అయితే ఈ వార్తలను లక్ష్మీనారాయణ ఖండించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు చెందిన లక్ష్మీనారాయణ మహారాష్ట్ర కేడర్‌లో ఐపీఎస్ అధికారి. సీబీఐ హైదరాబాద్ విభాగం జాయింట్ డెరైక్టర్‌గా విధులు నిర్వహించి రిలీవ్ అయిన లక్ష్మీనారాయణను మహారాష్ట్రలోని థానే నగర జాయింట్ పోలీసు కమిషనర్‌గా  ఆ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement