శ్రీవారి సేవలో జస్టిస్ నరసింహారెడ్డి
తిరుమల: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆయన వైకుంఠం నుంచి ఆలయంలోకి వె ళ్లారు. శ్రీవేంకటేశ్వరస్వామి, వకుళమాతాదేవిని దర్శించుకున్నారు. జస్టిస్ నరసింహారెడ్డికి టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి, లడ్డూప్రసాదాలు అందజేశారు.
కాగా, తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 38,292 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. వీరికి 24 గంటలు, కాలిబాటల్లో నడిచివచ్చిన భక్తులకు 9 గంటల తర్వాత శ్రీవారి దర్శనం లభిస్తోంది.