మెదక్: టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పై హత్యాపథకం జరిగినట్లు వచ్చిన ఆరోపణలను ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి ఖండించారు. కేసీఆర్‌పై హత్యాపథకం ఉదంతం టీఆర్‌ఎస్ ఆడిన డ్రామాగా అభివర్ణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో చోటు చేసుకున్న గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఇప్పటికీ-ఎప్పటికీ సమైక్యవాదినేనని ఆయన తెలిపారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ నగరంలో చేపట్టిన నవభారత యువభేరి సభతో మతకలహాలు చెలరేగే ప్రమాదముందన్నారు.
టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు హత్యకు జరుగుతున్న కుట్రపై దర్యాప్తు జరిపించాలని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉప నేత కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పదవులే కాకుండా, ప్రాణాలను కూడా పణంగా పెట్టిన నాయకుడి హత్యకు కుట్రజరుగుతున్న విషయంతో ఇక్కడి ప్రజలు కలత చెందుతున్నారన్నారని వారు గతంలో ఆరోపించారు.