కి ర్రాకు పుట్టీంచారే
Published Wed, Jan 1 2014 1:36 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM
కొత్త సంవత్సరం వచ్చింది. 2013 మూటా ముల్లే సర్దుకుంది. ఏడాది పొడవునా చోటుచేసుకున్న సంఘటనలు, మంచీ చెడులతో నిండిన 2013 డైరీ అలసిపోయింది. ఇక తాను వీడ్కోలు చెబుతూనే 2014 సంవత్సరానికి స్వాగతం పలికింది. యువతరం హుషారుగా చిందేసింది. ఆకాశమే హద్దుగా న్యూ ఇయర్ వేడుకల్లో మునిగిపోయింది. మహిళలూ ఫుల్ జోష్‌తో గడిపారు. డ్యాన్‌సలతో ‘అదరహో’ అనిపించారు. గ్రూపు డ్యాన్‌సలతో ‘వావ్’ అనిపించారు. పిల్లలు పిడుగులై నాట్యమాడారు. మొత్తానికి వేడుకలతో నగరానికి కిర్రాకు తెప్పించారు. కొత్త ఏడాదిలో అంతా మంచే జరగాలని ఆకాంక్షిస్తూ ఒకరికి ఒకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఊరూవాడా ‘కొత్త బంగారులోకం’లోకి ఘనంగా అడుగు పెట్టింది.
- ఫొటోలు : సాక్షి, రాజమండ్రి
సాక్షి, కాకినాడ :
పన్నుల పోటు..చార్జీల మోత...వరుస ప్రకృతి విపత్తులు...సమైక్యాంధ్ర ఉద్యమాలతో గతేడాది అన్నిరంగాల్లోనూ జిల్లా నష్టపోయింది. నత్తనడకన సాగుతున్న జిల్లా అభివృద్ధికి 2013లో పూర్తిగా బ్రేకులు పడ్డాయి. నాలుగున్నరేళ్లుగా సాగిన కాంగ్రెస్ పాలనలో నిరాశే మిగిలింది.
ధరాఘాతం నుంచి
విముక్తి కలగాలని...
గతంలో ఎన్నడూ లేని రీతిలో విద్యుత్ చార్జీలు పెంచడంతో పాటు సర్‌చార్జి బాదుడుతో వందల్లో వచ్చే విద్యుత్ బిల్లులు కాస్త నేడు వేలల్లో వస్తుండడంతో సామాన్యుల విలవిల్లాడిపోయారు. పెట్రో మంట, రైల్వే, ఆర్టీసీ చార్జీలు మోతమోగాయి. ఆటో చార్జీలు చుక్కలు చూపిస్తున్నాయి. గ్యాస్ గుదిబండగా మారింది. కొత్త సంవత్సరంలో ధరలు అదుపులోకి రావాలని సామాన్యులు ఆశిస్తున్నారు.
పెండింగ్ ప్రాజెక్టులపై ఆశ
ఇక పెండింగ్ ప్రాజెక్టుల విషయాని కొస్తే.. నత్తతో పోటీపడుతున్న గోదావరిపై నిర్మిస్తున్న నాల్గవ వంతెన, బోడసకుర్రు-పాశర్లపూడి వంతెనలతో పాటు అన్నంపల్లి అక్విడెక్టుల నిర్మాణం కొత్త ఏడాదిలోనైనా పూర్తి కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఇక కాకినాడ-పిఠాపురం మెయిన్ రైల్వేలైన్, కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్ల పునరుద్ధరణ ప్రాజెక్టులకు కొత్త ఏడాదిలోనైనా మోక్షం కలగాలని కోరుకుంటున్నారు.
రాజన్న పథకాలు
కొనసాగాలని...
కార్పొరేట్ ఆస్పత్రుల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేసే వ్యాధుల జాబితాలను దాదాపుగా కుదించేశారు. దీంతో ఈ పథకం అందని ద్రాక్షగా తయారైంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి నెలా నిర్వహించే వైద్యశిబిరాలను దాదాపుగా ఎత్తివేశారు. 104 సేవలు పూర్తిగా అటకెక్కాయి. 108 అంబులెన్స్‌లు పిలిస్తే పలికేస్థితిలో లేవు. ఆంక్షల పేరుతో ఫీజు రీయింబర్సు మెంట్‌ను బడుగు, బలహీన వర్గాలకు దూరం చేసింది. ఈ ఏడాది ఇంజనీరింగ్ కళాశాలల్లో సగానికి పైగా మిగిలిన పోయిన సీట్లే ఇందుకు నిదర్శనం. కొత్త ఏడాదిలో రాజన్న పథకాలు పటిష్టంగా కొనసాగాలని సామాన్యులు కోరుకుంటున్నారు. సమర్థత గలిగిన జననేత కోసం జనం ఎదురుచూస్తున్నారు.
బిడ్డకు స్తన్యమిస్తున్నట్టు నాగశైలారెడ్డి రూపొందించిన నూతన సంవత్సర గ్రీటింగ్
రాయవరం, న్యూస్‌లైన్ :రాయవరం సాయితేజా విద్యానికేతన్‌లో పదో తరగతి చదువుతున్న పడాల నాగశైలారెడ్డి మాతృత్వపు మమకారాన్ని తెలియజేసే విధంగా నూతన సంవత్సరానికి వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలుపుతూ చిత్రాన్ని గీసింది. తాను పాఠంలో నేర్చుకున్న తల్లిపాల విశిష్ఠతను, బిడ్డపై తల్లికి ఉండే మమకారాన్ని తెలియజేసేలే చిత్రాన్ని గీసినట్టు నాగశైలారెడ్డి తెలిపింది.
గోరంత
సంబరం
ద్వారపూడి (మండపేట రూరల్), న్యూస్‌లైన్ : ద్వారపూడికి చెందిన పి.సత్యనారాయణరాజు తన గోరుపై చెక్కించుకున్న హ్యేపీ న్యూ ఇయర్ పలువురిని అమితంగా ఆకట్టుకుంటుంది. ఎనిమిది సంవత్సరాలుగా ఎంతో జాగ్రత్తగా పెంచుకుంటున్న ఈ గోరుపై న్యూ ఇయర్ సందర్భంగా ఇలా అలంకరించారు.
తలకెక్కిన అభిమానం
సుంకరపాలెం (తాళ్లరేవు) : నూతన సంవత్సర వేడుకలను వినూత్నంగా జరుపుకోవాలనే కోరికతో లక్ష్మీదేవిలంక గ్రామానికి చెందిన ప్రకాష్ ఒకే షనల్ కళాశాల బస్ డ్రైవర్ పాటి రాంబాబు జుట్టును 2014 మాదిరిగా కట్ చేయించుకున్నాడు. గతంలో 2013, జై సమైక్యాంధ్ర పేరుతో కూడా జుట్టు కట్ చేయించుకుని అందరినీ ఆకట్టుకున్నాడు.
Advertisement
Advertisement