సాక్షి, విశాఖపట్నం: ‘ఎమ్మెల్యేలకు అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇచ్చే ప్రసక్తే లేదు. గతేడాది ఇవ్వలేదు. ఈ ఏడాది ఇచ్చే అవకాశం లేదు. ఆర్థిక పరిస్థితి గాడిలో పడే వరకు ఏసీడీపీ ఫండ్స్ కోసం ఏ ఎమ్మెల్యే ఎదురుచూడనవసరం లేదు’ అని రాష్ర్ట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తేల్చిచెప్పారు. ‘గతేడాది స్పెషల్ డెవలప్ ఫండ్స్ (ఎస్‌డీఎఫ్) ఇవ్వలేదు.
కానీ ఈ ఏడాది ఎస్‌డీఎఫ్ ఇచ్చాం. సీఎం వద్దే రూ.500 కోట్ల ఎస్‌డీఎఫ్ నిధులుంచాం..ఎమ్మెల్యేలు అత్యవసర పనుల కోసం వాడుకోవచ్చు. తనకున్న ప్రత్యేకాధికారాలతో సీఎం ఈ నిధులను ఏ నియోజకవర్గంలో ఏ అవసరం కోసమైనా వినియోగించుకునే అవకాశం ఉంది’అని చెప్పారు. విశాఖ జిల్లా ఇన్‌చార్జిగా తొలిసారి జిల్లాకు విచ్చేసిన యనమల ఆదివారం టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.డీడీఆర్‌సీ లను రద్దు చేశామన్నారు.
ఎమ్మెల్యేలకు అభివృద్ధి నిధులుండవు
Published Mon, May 18 2015 2:52 AM | Last Updated on Tue, Oct 30 2018 5:17 PM
Advertisement