ఎలాంటి తాయిలాలు ఇవ్వలేదు: జేసీ
హైదరాబాద్ : తాము కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లే ప్రసక్తే లేదని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. విభజన తర్వాత సీమాంధ్రకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నానని ఆయన వ్యాఖ్యానించారు. అయితే తమకు అధిష్టానం ఎలాంటి తాయిలాలు ప్రకటించలేదని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు.
ముఖ్యమంత్రి వ్యాఖ్యలు అధిష్టానాన్ని ధిక్కరించినట్లు కాదని జేసీ అన్నారు. ఆ వ్యాఖ్యలు కిరణ్ కుమార్ రెడ్డి మనసులో ఉన్న ఆవేదన మాత్రమేనన్నారు. కొత్త పార్టీ పెట్టే యోచనే లేదని.... కాంగ్రెస్ పార్టీని వీడే అవకాసం లేదన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని, ఒకవేళ విభజిస్తే రాయల తెలంగాణకే తమ మద్దుతు అని ఆయన గతంలో వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గుడ్డి కన్ను కన్నా....మెల్లకన్ను నయమని తాము భావిస్తున్నామని జేసీ అన్నారు.
మరో ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి మాట్లాడుతూ తెలుగు తల్లిని చూస్తే జాలి వేస్తుందన్నారు. రాజకీయ పార్టీలు తెలుగుతల్లికి ఉచ్చు వేసి లాగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పనిలో పనిగా ఆనం వివేకానందరెడ్డి.... టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై విరుచుకుపడ్డారు. ఆత్మగౌరవాన్ని పోరాడిన వ్యక్తిని చంపినవాడు చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు.
కాగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సీమాంధ్ర మంత్రులు వచ్చే నెల 3వ తేదీన అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టనున్నారు. ఈ సందర్భంగా సీమాంధ్ర మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని భావిస్తున్నామన్నారు.ఎలాంటి తాయిలాలు ఇవ్వలేదు: జేసీ
హైదరాబాద్ : తాము కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లే ప్రసక్తే లేదని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. విభజన తర్వాత సీమాంధ్రకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నానని ఆయన వ్యాఖ్యానించారు. అయితే తమకు అధిష్టానం ఎలాంటి తాయిలాలు ప్రకటించలేదని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని, ఒకవేళ విభజిస్తే రాయల తెలంగాణకే తమ మద్దుతు అని ఆయన గతంలో వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గుడ్డి కన్ను కన్నా....మెల్లకన్ను నయమని తాము భావిస్తున్నామని జేసీ అన్నారు.
మరో ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి మాట్లాడుతూ తెలుగు తల్లిని చూస్తే జాలి వేస్తుందన్నారు. రాజకీయ పార్టీలు తెలుగుతల్లికి ఉచ్చు వేసి లాగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పనిలో పనిగా ఆనం వివేకానందరెడ్డి.... టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై విరుచుకుపడ్డారు. ఆత్మగౌరవాన్ని పోరాడిన వ్యక్తిని చంపినవాడు చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు.
కాగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సీమాంధ్ర మంత్రులు వచ్చే నెల 3వ తేదీన అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టనున్నారు. ఈ సందర్భంగా సీమాంధ్ర మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని భావిస్తున్నామన్నారు.