నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్: ఇలా ఈ రెండు పాఠశాలలే కాదు. జిల్లా కేంద్రంలోని చాలా ప్రభుత్వ పాఠశాలలలో విద్యాబోధన అస్తవ్యస్తంగా మారింది. ప్రైవేటు పా ఠశాలలకు దీటుగా సర్కారు బడిలో విద్యార్థుల సంఖ్య ఉంటున్నా.. బోధించే ఉపాధ్యాయులు మాత్రం ఉండటం లేదు. విద్యాసంవత్సరం మొత్తంలో కనీసం తరగతులు కొనసాగడం లేదు. సాక్షాత్తూ జిల్లా కేంద్రంలోనే ఈ పరిస్థితి నెలకొంది. కలెక్టర్ మొదలు డీఈఓ వరకు ఉన్నతాధికారులంతా ఇక్కడే ఉంటారు. కానీ ఈ పాఠశాలల వైపు కన్నెత్తి చూసే తీరిక మాత్రం ఎవరికీ లేదని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక టీచరు అందుబాటులో ఉండాలి. 40 మంది విద్యారులుంటే ఇద్దరిని నియమించాలి. అలాంటిది మూడువందల మంది విద్యార్థులున్న పాఠశాలల్లో ఒక్క టీచరూ లేకపోవడం గమనార్హం.
ఇదీ పరిస్థితి
మహ్మదీయనగర్ ప్రాథమిక పాఠశాలలో 156 మంది విద్యార్థులుండగా ఉన్న ఒక టీచరు అనారోగ్యానికి గురి కావడంతో ప్రస్తుతం ఎవరూ అందుబాటులో లేరు. ఇతర పాఠశాలల నుంచి డిప్యుటేషన్‌పై రోజుకొకరిని పం పించారు. ఒక్కోసారి స్కూలుకు సెలవు ప్రకటించారు. రెండు రోజుల క్రితం ఒక విద్యావాలంటీర్‌ను నియమించారు. వెంగళరావునగర్ కాలనీ ఉర్దూ మీడియం పాఠశాలలో 245 మంది విద్యార్థులకు ఇద్దరు విద్యావాలంటీర్లు మాత్రమే ఉన్నారు. అన్ని తరగతుల విద్యార్థులను ఒకే చోట కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్నారు. అంతేకాక 6,5 తరగతుల విద్యార్థులు, 1వ తరగతి విద్యార్థులకు బోధన చేస్తున్నారు.
తినగానే ఇంటికి
టీచర్లు అందుబాటులో లేకపోవడంతో విద్యాబోధన జరుగడం లేదు. మధ్యాహ్న భోజనం తినగానే విద్యార్థులు ఇంటికి వెళ్లిపోతున్నారు. విద్యార్థులకు షెడ్యూల్ ప్రకారం తరగతుల బోధన ఎక్కడా జరుగడం లేదు. దీంతో తల్లిదండ్రులు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలకు పంపేందుకు ఆసక్తి చూపడం లేదు. వెంగళరావుకాలనీ నగ రానికి శివారు ప్రాంతం కావడం ఇక్కడ పలు సమస్యలు ఉండడం మూలంగా విద్యార్థులను బయటకు కానీ, ప్రైవేటు పాఠశాలలకు కాని పంపేందుకు తల్లిదండ్రులు ముందుకు రావడం లేదు. ఈ కారణంగా ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల చేరిక ఎక్కువైంది. దీనికి అనుగుణంగా టీచర్లను నియమించకపోవడం విద్యాబోధనకు ఆటంకంగా మారిం ది. టీచర్లు లేదా విద్యావాలంటీర్లు ఉన్న పాఠశాలల్లో వారు పాఠశాలకు సంబంధించి నివేదికలు తయారు చేయడం, శిక్షణ కార్యక్రమాలకు వెళ్తుండడంతో విద్యా బోధన పక్కదారి పట్టింది. దీంతో పేద మధ్య తరగతి విద్యార్థులకు సర్కారీ విద్యా అందకుండా పోతోంది. అధికారులు ఇకనైనా మేల్కొని విద్యాబోధనపై దృష్టి సారించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఖాళీలున్న చోట భర్తీ చేస్తాం
అర్బన్‌లో ఖాళీలున్న చోట విద్యావాలంటీర్లచే భర్తీ చేస్తాము. విద్యార్థులకనుగుణంగా టీచర్లను డిప్యుటేషన్లపైనా అయినా వేస్తాము. విద్యాబోధనకు మాత్రం ఆటంకాలు కలుగకుండా చూస్తాం. టీచర్ల కొరత ఉన్న పాఠళాలలను గుర్తిస్తున్నాం.
-లింగమూర్తి, ఎంఈఓ, నిజామాబాద్
వెంటనే టీచర్లను నియమించండి
నగరంలో ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరతతో విద్యాబోధన ఇబ్బందులలో ఉంది. అధికారులు టీచర్ల కొరతను తీర్చి విద్యబోధన సక్రమంగా అ దేలా చర్యలు తీసుకోవాలి.
-ఖాజామోయినోద్దీన్, పీఆర్టీయూఅర్బన్ అధ్యక్షుడు
సర్కారు బడి.. సమస్యల జడి
Published Tue, Dec 10 2013 6:35 AM | Last Updated on Sat, Sep 2 2017 1:27 AM
Advertisement
Advertisement