సాక్షి, ఏలూరు:
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన ప్పుడు తీవ్రంగా నష్టపోయే రైతులను ఆదుకునే లక్ష్యంతో అమల్లోకి తెచ్చిన జాతీయ వ్యవసాయ పంటల బీమా పథకం (ఎన్‌ఎఐఎస్) ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అన్నదాతలం దరికీ అక్కరకు రావటం లేదు. రైతులు బీమా చేయించేందుకు ఆసక్తి చూపుతున్నా గడువు పెంచకపోవడంతో జిల్లాలో లక్షన్నర మంది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. గతేడాది నీలం, పై-లీన్, హెలెన్, లెహర్ తుపానులు, భారీ వర్షాలు పంటలను నాశనం చేశాయి. ఇలాంటప్పుడు, కళ్లాల్లో ఉన్న ధాన్యం రాశులు పాడైనా, వర్షాభావ పరిస్థితుల్లో విత్తనం మొలకెత్తకపోయినా.. వడగండ్ల వానలు కురిసినప్పుడు పంట దెబ్బతిన్నా రైతులకు కలిగే నష్టానికి ఈ బీమా పథకం వర్తిస్తుంది.
లక్షన్నర మందికి మొండిచేయి
జిల్లాలో 5.85 లక్షల మంది రైతులు ఉ న్నారు. సుమారు ఆరు లక్షల ఎకరాల్లో వీ రంతా వరి పంటను సాగు చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు పంటలకు కలి పి 4.31 లక్షల మంది ఇప్పటివరకూ రూ. 4,250 కోట్ల మేర రుణాలు పొందారు. బ్యాం కులు రుణాలు ఇచ్చేప్పుడే బీమా ప్రీమియంను మినహాయించుకుంటాయి. రుణా లు పొందిన రైతులకు బీమా చెల్లిం చేందుకు బ్యాంకులకు ఈ ఏడాది మార్చి వరకూ గడువు ఇచ్చారు. రుణం తీసుకోని రైతులూ వ్యవసాయశాఖ ద్వారా నేరుగా బీమా చెల్లించవచ్చు. జిల్లాలో రుణాలు పొందని కౌలు రైతులు, రైతులు 1.54 లక్షల మంది ఉన్నారు. వీరికి బీమా గడువు గతేడాది డిసెంబర్ 31 వరకు మాత్రమే ఇచ్చారు. బ్యాంకు రుణం పొందని రైతులు పంటల బీమా చేయించుకోవాలంటే నాట్లు వేసినట్టు ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. వరుస తుపానుల కారణంగా ఖరీఫ్ బాగా ఆలస్యం కావడంతో రబీ కూడా ఆలస్యమైంది. గత నెలాఖరుకు నాట్లు ప్రారంభ దశలోనే ఉన్నాయి. నాట్లు వేయకుండా ధ్రువీకరణ పత్రం ఇవ్వడం అసాధ్యం. దీంతో బీమా గడువు పెంచాల్సిన ప్రభుత్వం వారి సంగతి పట్టించుకోకపోవడంతో పంటల బీమా పథకానికి దూరమయ్యారు. ఇప్పుడు నాట్లు పూర్తయినా గడువు లేకపోవడంతో లక్షన్నర మంది రైతులకు పంటల బీమా అందకుండా పోయింది. అదే సమయంలో బ్యాంకర్లకు ప్రభుత్వం మార్చి 31 వరకు గడువివ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బీమా చేయించుకున్నవారిపైనా ఆర్థిక భారం
బీమా ప్రీమియాన్ని పెంచడంతో పాటు ప్రభుత్వ నిబంధనల వల్ల క్రాప్ ఇన్సూరెన్స్ కట్టిన రైతులపైనా భారం పడుతోంది. బీమా ప్రీమియం గతంలో 2.25 శాతమే ఉండేది. దానిని 2012-13లో 4 శాతానికి పెంచారు. 2013-14లో మరోసారి 5 శాతానికి పెంచారు. దీంతో ఎకరా వరి పంటకు రూ.579, చెరకుకు రూ.974 చొప్పున ప్రీమియం చెల్లించాల్సి వస్తోంది. పంట నష్టపోయిన రైతుని ఆదుకోవాల్సి వచ్చినప్పుడు మండలం యూనిట్‌గా పరిగణించడంతో పాటు నష్టం అంచనాలు వేయడంలో ప్రామాణికతలు పాటించకపోవడంతో పరిహారం దక్కడం లేదు. 50 శాతం పైగా పంటకు నష్టం వాటిల్లితేనే పరిహారం అంటూ మెలిక పెట్టి బీమా ఎగ్గొడుతున్నారు. తమకు ఒరిగేదేమీ ఉండడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు.
బీమాయే
Published Tue, Jan 21 2014 1:13 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
Advertisement
Advertisement