government negligence
-
వర్గపోరు.. లబ్ధిదారుల బేజారు
ప్రజాసమస్యలను తీర్చడానికే ప్రజాప్రతినిధులు ఉండాలి, ఇక్కడేమో ప్రజాప్రతినిధులే ప్రజలకు సమస్యగా మారారు. నియోజకవర్గ పరిధిలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధుల వర్గపోరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పెత్తనం కోసం పాకులాడుతూ ప్రజల సమస్యలు గాలికొదిలేశారు. ప్రభుత్వ గృహ పథకంలో దరఖాస్తు చేసుకున్న వారికి గృహాలు మంజూరు కాకుండా ఒక వర్గం అడ్డుకుంటుంటే మరో వర్గం వారు ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు రాకుండా అడ్డుపడుతున్నారు. సాక్షి, బల్లికురవ (ప్రకాశం): గూడులేని అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ పక్కా ఇల్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రకటించారు. అర్హులు గ్రామాల వారీగా దరఖాస్తులు చేసుకొంటే కొందరికే మంజూరు పత్రాలు ఇచ్చారు. ఒక్కపైసా బిల్లు కూడా చెల్లించలేదు. మరికొందరికి మంజూరు ఉత్తర్వులు రాకుండా అడ్డుకొంటున్నారు. అద్దంకి నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కరణం బలరామకృష్ణమూర్తి, ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మధ్య వర్గపోరులో పేదలు బలవుతున్నారు. ముక్తేశ్వరంలో ఇల్లు నిర్మించుకొన్నా మంజూరు ఉత్తర్వులు ఇవ్వని గృహం అర్థాంతరంగా నిలిచిన గృహాలు ప్రభుత్వం, అధికారులు పక్కా ఇళ్లకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించటంతో 2015, 2016 సంవత్సరాల్లో ముక్తేశ్వరం, సూరేపల్లి, రామాంజనేయపురం, పెదఅంబడిపూడి, చిన అంబడిపూడి కొత్తపాలెం, బల్లికురవ గ్రామాల్లో సుమారు 120 మంది దరఖాస్తు చేశారు. వీరిలో కొందరికి మంజూరు ఉత్తర్వులిచ్చారు. కొందరికి మంజూరు ఉత్తర్వులు రాకుండానే అడ్డుకున్నారు. ఇంటినిర్మాణానికి దరఖాస్తు చేశాం. మంజూరు ఉత్తర్వులతో బిల్లులు చెల్లించకపోతారా అని అప్పుచేసి మరీ గృహాలు నిర్మించుకున్నారు. వర్గపోరుతో నిలిచిన బిల్లులు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కరణం బలరాం, ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటోంది. ఈ పరిస్థితుల్లో వైఎస్సార్ సీపీ తరపున గెలుపొందిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ 2016లో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవటంతో బలరాం వర్గానికి ప్రాధాన్యత తగ్గింది. అప్పటి వరకు అధికారపార్టీలో హీరోలుగా కొనసాగిన గ్రామస్థాయి నేతలు జీరోలు కాగా వైఎస్సార్ సీపీ గ్రామస్థాయి నేతలు ఎమ్మెల్యేతో పాటు టీడీపీ తీర్థం పుచ్చుకోవటంతో హీరోలయ్యారు. ఈ హీరోలు టీడీపీకి ఓట్లు వేసిన లబ్ధిదారులకు చెల్లించాల్సిన బిల్లులు మంజూరు ఉత్తర్వులనే నిలుపుదల చేయించారు. అధికారుల వత్తాసు గ్రామస్థాయి నేతలకు అధికారులు సైతం డూడూ బసవన్నలా తల ఊపుతూ బిల్లులు చెల్లించటంలేదు. అప్పులు తెచ్చి ఇల్లు నిర్మించుకున్నామని తమ పరిస్థితి ఏమిటని లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. అయినా అధికారులు గ్రామస్థాయి నేతల్లో కనికరం లేదు. ఎమ్మెల్యే ఏ గ్రూపులో నేతలు తమకు అనుకూలమైన వారికి గతంలో నిర్మించుకొన్న ఇళ్లకు కూడా రెండో పేరుతో తిరిగి బిల్లు చెల్లించేలా చేస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేదని లబ్ధిదారులు యలగాల అంజయ్య, చల్లగుండ్ల శ్రీనివాసరావు, పోలయ్య, మందా మేరి వాపోయారు. రాబోయే ఎన్నికల్లో తమ ఇళ్ల బిల్లులు నిలుపుదల చేసిన నేతలకు ఓటు ద్వారా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని లబ్ధిదారులు వివరించారు. సర్పంచ్‌గా పోటీచేశాననే బిల్లు ఆపారు ముక్తేశ్వరం పంచాయతీ సర్పంచ్‌గా 2014లో ఎమ్మెల్సీ కరణం బలరాం ఆశీస్సులతో బరిలోకి దిగి ఓటమి పాలయ్యాను. ఆ అక్కసుతో తాను పక్కా ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాకుండా తన ప్రత్యర్ధులు అడ్డుకుంటున్నారు. ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలియడంలేదు. – మందామేరి, రామాంజనేయపురం అప్పుచేసి ఇల్లు నిర్మించా బిల్లు లేదు ఇల్లు నిర్మాణానికి దరఖాస్తు చేశాను. మంజూరైన జాబితా నుంచి నా పేరు తొలగించారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదు. ఇంటి నిర్మాణానికి చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలియడం లేదు. – కోవూరి సుబ్బరావమ్మ, చిన అంబడిపూడి టీడీపీకి ఓటు వేసి జీరో అయ్యాను బలరాం కొడుకు వెంకటేష్ ఓట్లు వేసి, విజయవాడ మహానాడుకు వెళ్లి నేడు జీరోలం అయ్యాం. ఇళ్ల నిర్మాణానికి పేదల చేత దరఖాస్తు చేయిస్తే ఇళ్లు మంజూరు కాకుండా అడ్డుకుంటున్నారు. ఇలాంటి దుర్మార్గపు పాలన ఏనాడు చూడలేదు. రాబోయే ఎన్నికల్లో వీళ్లకి ఓటు ద్వారా బుద్ధి చెప్తాం. – యలగాల అంజయ్య, ముక్తేశ్వరం -
చస్తూ.. బతుకుతుండ్రు!
కొవ్వొత్తి తాను కరిగిపోతూ.. ఇతరుల జీవితాలకు వెలుగునిస్తుంది.. అచ్చం ఇలాగే వారు నిండా మునిగిపోయి.. లక్షలాది కుటుంబాలకు వెలుగునిచ్చారు.. ఇది గడిచి 36 ఏళ్లు అ వుతోంది.. కానీ నేటికీ వారి జీవితాలు అంధకారంలోనే మగ్గుతున్నాయి.. ప్రభుత్వాల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల అలసత్వం, రెండు శాఖల మధ్య సమన్వయలోపం కారణంగా విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.. ఉండటానికి గూడు లేక.. తినడానికి తిండిలేక.. కంటినిండా నిద్రపోక.. నేటికీ చస్తూ.. బతుకుతుండ్రు.. శ్రీశైలం ప్రాజెక్టులో సర్వస్వం కోల్పోయిన కొల్లాపూర్ మండల ం ఎర్రగట్టు బొల్లారం గ్రామస్తులు.. కొల్లాపూర్: సుమారు 36 ఏళ్ల క్రితం శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంతో కృష్ణా బ్యాక్‌వాటర్ చేరి ఉమ్మడి పాలమూరు జిల్లాలో 69 గ్రామాలు నీటమునిగా యి. అందులో కొల్లాపూర్ మండలంలోని మొగలొత్తు బొల్లారం ఒకటి. ప్రభుత్వం అన్ని గ్రామాలకు పునరావా సం కల్పించినట్టే.. బొల్లారానికి సైతం మొలచింతలపల్లి సమీపం లోని ఎర్రగట్టు వద్ద సర్వే నం.399 లో పునరావాసం కల్పించారు. ఎర్రగ ట్టు బొల్లారం అని పేరు పెట్టారు. మొత్తం 60 కుటుంబాల ప్రజలు ఇక్కడ స్థిరపడ్డారు. గ్రామ సమీపంలోని పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నా రు. ఆ తర్వాతే వారికి కష్టాలు మొదలయ్యా యి. ఈ గ్రామం రిజర్వు ఫారెస్టులో ఉందని, వెంటనే ఖాళీ చేయాలని అటవీశాఖ అధికారులు ఒత్తిళ్లు ప్రారంభించారు. గ్రామంలో శాశ్వత నిర్మాణాలను అడ్డుకుంటున్నారు. అభివృద్ధి పనులకు అడ్డంకి.. ఎర్రగట్టు బొల్లారంలో 60 కుటుంబాలు నివసిస్తుండగా.. జనాభా 232 కాగా, ఓటర్ల సంఖ్య 160. ఈ గ్రామం ఎల్లూరుకు అనుబంధంగా ఉంది. గ్రామంలో 1997లో ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణానికి రూ.1.50 లక్షలు మంజూరయ్యా యి. పనుల ప్రారంభానికి అటవీశాఖ అభ్యంతరం తెలిపింది. దీంతో పూరిగుడిసెలోనే ప్రభుత్వ పాఠశాలను గత నాలుగేళ్ల క్రితం వరకూ నిర్వహించారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే సాకుతో ఉన్న పాఠశాలకు కూడా ఎత్తేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరవగా.. ఆ పనులను సైతం అటవీ శాఖ అడ్డుకుంది. గ్రామంలో తాగునీటి ట్యాంకు మినహా మిగతా ఎలాంటి శాశ్వత భవనాలు, పక్కా ఇళ్లు, రోడ్ల నిర్మాణాలు చేపట్టకుండా అడ్డుచెబుతూ వస్తున్నారు. అయితే గడిచిన ఐదేళ్లలో గ్రామస్తులు బలవంతంగా 6 పక్కా ఇళ్లు నిర్మించుకోగా.. మిగతా వారంతా పూరి గుడిసెల్లోనే కాలం వెళ్లదీస్తుండటం గమనార్హం. అమలుకు నోచుకోని హామీలు ఎర్రగట్టు బొల్లారం గ్రామస్తుల సమస్యను పరిష్కరిస్తామని చాలామంది నాయకులు ప్రకటిస్తూ వచ్చారు. నియోజకవర్గ ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారితోపాటు అప్పటి నాగర్‌కర్నూల్ ఎంపీ మంద జగన్నాథం పలు పర్యాయాలు గ్రామాన్ని సం దర్శించి.. గ్రామస్తుల ఇళ్లకు, భూములకు పట్టాలిప్పిస్తామని హామీలు ఇచ్చారు. కానీ వీరిలో ఏ ఒక్కరి హామీ కూడా అమలుకు నోచుకోలేదు. సమన్వయ లోపమే శాపం.. గ్రామంలో అభివృద్ధి, రైతుల పొలాల్లో వ్యవసాయ పనులను అడ్డుకోవడం ఇక్కడి అటవీ అధికారులకు సర్వసాధారణం. అధికారులు అడ్డుకున్న ప్రతిసారి గ్రామస్తులు వారితో గొడవలు పడడం, ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లడం, వారు రెవెన్యూ అధికారులకు సమస్యను అప్పగించడం, అధికారులు గ్రామాన్ని సందర్శించి మీకు న్యాయం చేస్తామని చెప్పి వెళ్లడం నిత్యకృత్యంగా మారింది. సమస్య తలెత్తి మూడున్నర దశాబ్దాలు అవుతున్నా, నేటికీ దీనికి శాశ్వత పరిష్కారం చూపడం లేదు. రెండు శాఖల అధికారులు ఈ భూమి తమదే అంటూ వాదించుకుంటున్నారు. సర్వే నం.399లో 200 ఎకరాలకు పైగా భూమిని ఎర్రగట్టు బొల్లారం గ్రామస్తులు సాగు చేసుకుంటుండగా.. మరో 40 ఎకరాలు మొలచింతలపల్లి రైతుల ఆధీనంలో ఉన్నాయి. మొలచింతలపల్లి రైతులకు అసైన్డ్ పట్టాలు ఇచ్చిన రెవెన్యూ అధికారులు ఎర్రగట్టు బొల్లారం గ్రామస్తులకు మాత్రం ఎలాంటి పట్టాలు ఇవ్వలేదు. డీ–రిజర్వ్ చేయాలని కోరాం.. ఎర్రగట్టు బొల్లారం అటవీ శాఖ పరిధిలో ఉందని వారు చెబుతున్నారు. 5 హెక్టార్లలోపు నివాస ప్రాంతాలు ఉంటే ఆ స్థలాన్ని డీ–రిజర్వ్ చేసే వెసులుబాటు ఆ శాఖకు ఉంది. గ్రామంలో నివాస ప్రాంతంలో దాదాపు 5 హెక్టార్ల పరిధిలోనే ఉన్నాయి. దీని కోసం ఆర్డీఓకు నివేదిక పంపాం. కలెక్టర్ ద్వారా అటవీశాఖకు ప్రతిపాదనలు వెళ్తాయి. అటవీశాఖ వారు దీనికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఈ సమస్యకు ఉన్నత స్థాయిలో పరిష్కారం జరగాల్సి ఉంది. – సరస్వతి, తహసీల్దార్, కొల్లాపూర్ మా సమస్యను పట్టించుకోవాలే.. నిర్వాసితులమైన మాకు రెవెన్యూ అధికారులు ఎర్రగట్టు వద్ద పునరావాసం కల్పించారు. ఆ భూమి రిజర్వ్ ఫారెస్టులో ఉందంటూ ఫారెస్టు వాళ్లు అభ్యంతరం చెబుతున్నారు. ఊర్ల ఒక్క సర్కారు బిల్డింగ్ కట్టనివ్వరు. అధికారుల వల్లనే మాకు ఈ తిప్పలు. మాకు న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా వారిపైనే ఉంది. – డి.వెంకటస్వామి, ఎర్రగట్టు బొల్లారం ఉన్నతాధికారులు స్పందించాలి.. మా గ్రామంలోని నివాస గృహాలు, వ్యవసాయ భూములకు పట్టాలు ఇవ్వాలి. రెవెన్యూ అధికారులు మాకు పునరావాసంగా ఈ ప్రాంతాన్ని కాకుండా వేరే ప్రాంతం ఏర్పాటు చేసి ఉంటే మాకు ఈ సమస్య ఉండేది కాదు. కాబట్టి ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. ప్రభుత్వం అండగా ఉండాలి. – సుధాకర్, ఎర్రగట్టు బొల్లారం -
ఉర్దూ పాఠశాలలపై సర్కార్ నిర్లక్ష్యం
అనంతపురం అర్బన్: ఉర్దూ పాఠశాలల్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఇంతియాజ్ మండిపడ్డారు. మంగళవారం నగరంలోని కొత్తూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో గల బాలికల ఉర్దూ పాఠశాలను జిల్లా ప్రధాన కార్యదర్శి ముష్కిన్, కమిటీ సభ్యులు అల్లాబక్ష్, మహబూబ్ బాషాతో కలిసి సందర్శించారు. అక్కడి విద్యార్థినులతో ఇంతియాజ్ మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పాఠశాలలు పునఃప్రారంభమై రెండు నెలలు గడిచినా పదో తరగతి విద్యార్థులకు సాంఘిక, సామాన్య శాస్త్రాలు, గణితం పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదన్నారు. ప్రతి ఏడాదీ సగం మంది విద్యార్థులకు ఉపకార వేతనం అందని పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వారికి మాత్రమే ఇలా జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మైనార్టీ సంక్షేమ శాఖ బాధ్యతారాహిత్యానికి ఇదో నిదర్శనమని మండిపడ్డారు. కంబదూరులో అన్ని తరగతులకూ ఒకే ఉపాధ్యాయుడు బోధిస్తున్నాడని, కణేకల్, తలుపుల, కదిరి, తదితర ప్రాంతాల్లోని ఉర్దూ పాఠశాలల్లో ఉర్దూ ఉపాధ్యాయులు లేరని అన్నారు. మైనారిటీ విద్యార్థుల సమస్యలపైన, వారి సంక్షేమం పైన రాష్ట్ర మైనార్టీ శాఖమంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. -
కలెక్టరేట్‌ను ముట్టడించిన గ్రామస్తులు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఓ విద్యార్థి నిండు ప్రాణం కోల్పోవాల్సి వచ్చిందంటూ గొందిపర్ల గ్రామస్తులు కర్నూలు కలెక్టరేట్‌ను గురువారం ముట్టడించారు. ఉదయం 12.30 గంటలకు గొందిపర్ల గ్రామస్తులతో పాటు క్వార్టర్స్, ఇందిరమ్మ కాలనీ, పూలతోట, సుందరయ్యనగర్ వాసులు గాంధీ విగ్రహం ఎదుట బైటాయించారు. బాధిత విద్యార్థి కుటుంబానికి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ బయటకు వచ్చి తుంగభద్ర నదిపై బ్రిడ్జి నిర్మించే వరకు తమ ఆందోళనను విరమించేది లేదని భీష్మించారు. రెండ్రోజుల కిందట బ్రిడ్జి లేకపోవడంతో ఉస్మానియా కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదివే మోహన్ అనే విద్యార్థి అకస్మాత్తుగా వచ్చిన వరద నీటిలో కొట్టుకుపోయి మృత్యువాతపడినట్లు వారు కన్నీటిపర్యంతమయ్యారు. సకాలంలో బ్రిడ్జి నిర్మించి ఉన్నట్లైతే ఓ నిండుప్రాణం బలై ఉండేది కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులకు మద్దతుగా కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ, అలంపూరు మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు షడ్రక్, జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి మద్దుతు తెలిపారు. గంటకుపైగా ధర్నా కొనసాగడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాపిక్ డీఎస్పీ రామచంద్ర అక్కడికి చేరుకొని గ్రామస్తులతో చర్చించారు. కలెక్టర్ వచ్చి తమకు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు కదిలేది లేదని వారు స్పష్టం చేశారు. దీంతో డీఎస్పీ స్పందిస్తూ.. పది మంది గ్రామస్తులు వస్తే కలెక్టర్‌తో మాట్లాడిస్తానంటూ చెప్పడంతో వారు ధర్నా విరమించారు. -
104కు బ్రేక్
మోర్తాడ్ : పల్లె ముంగిట్లోనే ప్రజలకు వైద్య సేవలు అందించడానికి నిర్దేశించిన 104 వాహనాలను డీజిల్ కొరత వెంటాడుతోంది. డీజిల్ పోయించడానికి అవసరమైన నిధుల కేటాయింపులో ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 104 వాహనాలకు డీజిల్ అరువు పోసేందుకు పెట్రోల్ బంక్ యజమానులు అభ్యంతరం చెప్పడంతో జిల్లాలోని పలు క్లస్టర్ల వాహనాలు ఆసుపత్రి ఆవరణలకే పరిమితమయ్యాయి. దీంతో కొన్ని రోజులుగా గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు మృగ్యమయ్యూరుు. జిల్లాలోని మోర్తాడ్, బాల్కొండ, డిచ్పల్లి, ధర్పల్లి, నవీపేట్, కోటగిరి, వర్ని, ఆర్మూర్, బిచ్కుంద, దోమకొండ, పిట్లం, ఎల్లారెడ్డి, మద్నూర్, గాంధారి హాస్పిటల్స్‌ను క్లస్టర్ ఆసుపత్రులుగా మార్చారు. 104 వైద్య సేవలు ప్రారంభించినప్పుడు రెవెన్యూ డివిజన్లకు వాహనాలను కేటాయించి గ్రామాలలో రోజూ వైద్య సేవలు అందించేవారు. క్లస్టర్ ఆసుపత్రుల ఏర్పాటు తరువాత వాహనాలను ఒక్కో హాస్పిటల్‌కు ఒక వాహనం చొప్పున కేటాయించారు. ప్రతి వాహనంలో ఒక పెలైట్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ ఉంటారు. క్లస్టర పరిధిలోని గ్రామాలకు వెళ్లి ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందించడం వీరి విధి. ఇలా ఒక్కో వాహనం రోజుకు కనీసం రెండు గ్రామాల్లో పర్యటిస్తుంది. ప్రబలుతున్న వ్యాధులు.. ఇప్పటికే గ్రామాలలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ సమయంలో 104 వైద్య సేవలు నిలిచిపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. రెండు, మూడు నెలలుగా ప్రభుత్వం డీజిల్ బిల్లులు చెల్లించడం లేదు. దీంతో పెట్రోల్ బంకుల్లో అరువు ఖాతాలను తెరిచారు. అవి కూడా ఎక్కువ కావడంతో మోర్తాడ్, ఆర్మూర్‌లకు సంబంధించిన వాహనాలకు బంక్ యజమానులు డీజిల్ పోయడానికి నిరాకరించినట్లు తెలిసింది. ఇతర క్లస్టర్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లాలోని 14 వాహనాలకు గాను 5 వాహనాలు వారం రోజుల నుంచి గ్రామాలకు వెళ్లడం లేదు. డీజిల్ నిధులను అడ్వాన్స్‌గా ఇస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నా పెట్రోల్ బంకులలో బిల్లులు చెల్లించడం లేదంటే నిధుల కొరత ఉన్నట్లు స్పష్టం అవుతోంది. గతంలో కూడా వాహనాలు రిపేర్‌కు వస్తే నిధులు లేక రోజుల తరబడి గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందలేదు. ప్రభుత్వం స్పందించి ప్రజలకు మెరుగైన వైద్యం అందించే 104 వాహనాలకు నిధుల కొరత లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. రెండు, మూడు రోజుల్లో నిధులు వస్తాయి ‘104 వాహనాలకు డీజిల్ నిధుల కోసం కలెక్టర్ కార్యాలయానికి ప్రతి పాదనలు పంపాం. రెండు మూడు రోజుల్లో నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. డీజిల్‌కు నిధులు లేకపోయినా క్లస్టర్ ఆసుపత్రిలో ఉండే ఇతర నిధులను వినియోగించడానికి వీలుంది. దీనిపై క్లస్టర్ ఆసుపత్రి అధికారులకు గతంలోనే మార్గదర్శకాలు జారీ చేశాం. - దేవసాయం, అడ్మినిస్ట్రేటివ్ అధికారి, నిజామాబాద్ -
వైద్య రహిత హెల్త్‌కార్డులు
ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఉద్యోగులకు ఇబ్బందులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నగదురహిత వైద్యం కలగానే మిగిలిపోయింది. హెల్త్‌కార్డులు ఇచ్చినప్పటికీ వాటితో ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం పొందే అవకాశం కల్పించడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైంది. హెల్త్‌కార్డుల ప్రీమియంను ఉద్యోగుల నుంచి ఆరు నెలలుగా వసూలు చేస్తున్నా.. కార్పొరేట్ ఆసుపత్రులతో పూర్తిస్థాయిలో ఒప్పందాలు కుదుర్చుకోలేదు. ప్రభుత్వం ఇస్తున్న ప్యాకేజీలు తమకు గిట్టుబాటు కావడం లేదని కార్పొరేట్ ఆసుపత్రులు తేల్చిచెబుతున్నాయి. ఉద్యోగులకు నగదు ప్రమేయం లేని వైద్యం అందించడానికి నిరాకరిస్తున్నాయి. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆసుపత్రుల ప్రతినిధులతో ఇప్పటికే పలుమార్లు సమావేశమైనా.. సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. నగదు రహిత వైద్య పథకాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకొస్తామంటూ మంత్రి చేసిన ప్రకటనలు వాస్తవరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వం లో స్టీరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి, సమస్యల పరిష్కారానికి రోడ్‌మ్యాప్ రూపొం దించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. శుక్రవారం జరగాల్సిన ఈ భేటీ అధికారులు అందుబాటులో లేకపోవడంతో వాయిదా పడింది. పెన్షనర్ల ఆవేదన: పెన్షనర్లు వైద్యం చేయించుకోవడానికి చేతి నుంచి డబ్బు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. రీయింబర్స్మెంట్ సౌకర్యం ఉన్నప్పటికీ దరఖాస్తు చేసుకున్న చాలా కాలానికి, పెట్టిన ఖర్చులో గరిష్టంగా 80 శాతం మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తోంది. హెల్త్‌కార్డులతో సమస్యలు తీరుతాయని ఆశించినపెన్షనర్లకు నిరాశే ఎదురైంది. పెన్షన్‌లో ప్రీమియం కోత విధిస్తున్నా.. హెల్త్‌కార్డులపై ప్రభుత్వం వైద్యం అందించలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హెల్త్‌కార్డుల పథకం అమలుకు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతున్నారు. -
అమ్మ, నాన్నలైనా అందని ప్రోత్సాహకం
కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న జంటలకు ఇంటా, బయటే కాదు ప్రభుత్వం నుంచి కూడా నిష్టూరాలే ఎదురవుతున్నాయి. ప్రోత్సాహకాలతో అండగా ఉంటాం అని భరోసా ఇచ్చిన సర్కారే మొండి చేయి చూపించడంతో నవ వధూవరులు కాస్తా అమ్మానాన్నలుగా మారినా ఆశించిన నగదు మాత్రం చేతికి అందలేదు. ఇదేమని ప్రశ్నించినా సంబంధితాధికారుల నుంచి నిర్లక్ష్యమే సమాధానమవుతోంది తప్ప సమస్య పరిష్కారం కావడం లేదు. ఒంగోలు సెంట్రల్ : కులాలు, మతాలు కట్టుబాట్లను తెంచుకుని ఆదర్శ వివాహం చేసుకున్న జంటలకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం అందని ద్రాక్ష పండులా మారింది. ఈ జంటలకు ఇద్దరేసి పిల్లలు పుట్టిన తరువాత కూడా ప్రోత్సాహం అందటంలేదంటే ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఎంతగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రోత్సాహ నగదును రూ. 50,000 పెంచుతున్నట్టు ప్రకటించినా ఆచరణలో మాత్రం నిధులు విడుదలకు ప్రభుత్వం చొరవ చూపించడం లేదన్న విమర్శలున్నాయి. కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు ప్రభుత్వం మాత్రం ప్రతి సంవత్సరం కేవలం రూ. 20,000 మంజూరు చేసి చేతులు దులుపుకుంటోంది. గిరిజన సంక్షేమ శాఖకు 2006 నుంచి 15 మంది జంటలు దరఖాస్తులు చేసుకోగా కేవలం ఇద్దరికి మాత్రమే పాత జీఓ ప్రకారం ఒక్కొక్కరికి రూ. 10,000 చొప్పున పంపిణీ చేశారు. మరో ఇద్దరికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తాజాగా మరో జంట దరఖాస్తు చేసుకుంది. దీంతో పన్నెండు జంటలు కాళ్లరిగేలా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. వీరికి ఆరు లక్షల రూపాయలు ప్రోత్సాహకాల కింద చెల్లించాల్సి ఉంది. పద్ధతి ఇలా... వివాహ వయస్సు వచ్చిన అమ్మాయి, అబ్బాయి హిందూ వివాహ చట్టం ప్రకారం ఇష్ట పూర్వకంగా కులాంతర వివాహం చేసుకుంటే ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తుంది. ఇందుకు సంబంధించిన వివాహ ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. ఎస్సీ,ఎస్టీలకి రూ.10 వేలు,బి.సిలకు రూ. 5 వేలు ప్రోత్సాహకంగా అందిస్తుంది. తాజాగా ఎస్సీ,ఎస్టీలకు రూ. 50 వేలు, బి.సిలకు రూ. 10 వేలుగా పారితోషకం పెంచారు. వివాహమై ఐదారు సంవత్సరాలు గడిచినా పిల్లలు పుట్టి, పెద్దవారైనా నేటికీ ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాలు అండడంలేదు. సాధారణంగా ఈ ప్రోత్సాహకాలను గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాల్లో అందిస్తారు. గిరిజన సంక్షేమ శాఖ అధికారి: జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఎం. కమల నిధులు విడుదలకాకపోవడంతో ఉన్నంత వరకూ లబ్ధిదారులకు విడుదల చేస్తున్నాం. దరఖాస్తు చేసుకున్న జంటల వివరాలు ఉన్నతాధికారులకు తెలియజేస్తాం. -
ఏదీ 'సెట్' కాలేదు
సకాలంలో వృత్తి విద్యా ప్రవేశాలు మిథ్య సుప్రీంకోర్టు ఆదేశించినా ఏటా ఇదే పరిస్థితి అన్ని కోర్సుల్లోనూ ప్రవేశాలు గందరగోళమే ఇంజనీరింగ్ ప్రవేశాలు ఇప్పటికీ అసంపూర్ణమే! ఈసెట్, పాలిసెట్ అలాట్మెంట్లు మాత్రమే పూర్తి ఐసెట్, పీజీఈసెట్, డైట్‌సెట్, లాసెట్.. అన్నీ అంతే! అడ్మిషన్ల కోసం లక్షల మంది విద్యార్థుల ఎదురుచూపులు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ అలసత్వం.. అధికారుల నిర్లక్ష్యం.. విధానపర నిర్ణయాల్లో జాప్యం.. తప్పుడు నిర్ణయాల ఫలితం.. ఏదైతేనేం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశాల పరిస్థితి ఏటా గందరగోళంగా మారుతూనే ఉంది.. అడ్మిషన్లలో తీవ్ర జాప్యం జరుగుతూనే ఉంది.. విద్యా సంవత్సరం ప్రారంభమైనా కౌన్సెలింగ్ కోసమే విద్యార్థులు ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంటూనే ఉంది.. గడిచిన ఐదారేళ్లలో ఏ విద్యా సంవత్సరంలోనూ సరిగ్గా తరగతులు ప్రారంభమైంది లేదు. చివరకు సుప్రీంకోర్టు ఆదేశించినా అదే పరిస్థితి. ఈసారి కూడా అదే దుస్థితి. రాష్ట్ర విభజన సమస్యలు, అధికారుల తప్పిదాలు, నిర్లక్ష్యం, ప్రభుత్వాల మొండిపట్టు వంటివన్నీ ప్రవేశాలు ఆలస్యం కావడానికి కారణమయ్యాయి. ఈసారీ పరిస్థితి అంతే. విద్యా సంవత్సరం సకాలంలో ప్రారంభం కావాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల స్ఫూర్తి ఏ ఒక్క కోర్సు ప్రవేశాల్లోనూ కనిపించడం లేదు. జూలై 31 నాటికే వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలు పూర్తి చేసి ఆగస్టు 1 నుంచి తరగతులను ప్రారంభించాల్సి ఉన్నా.. కొన్ని కోర్సులకు అయితే ప్రవేశాల షెడ్యూల్ కూడా విడుదల కాలేదు. ఎడ్‌సెట్, ఐసెట్, పీజీఈసెట్, డైట్‌సెట్, పాలిసెట్, లాసెట్ అన్నింటి పరిస్థితీ ఇంతే. ఏటా ప్రవేశాలు అక్టోబర్ వరకు కొనసాగుతుండటంతో.. లక్షల మంది విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎంసెట్..: విద్యార్థులకు ఆవేదనే! ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్ కౌన్సెలింగ్ విద్యార్థులకు ఆవేదనే మిగిల్చింది. కాలేజీలకు అఫిలియేషన్లు, ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మొండిపట్టు వంటివాటి కారణంగా కౌన్సెలింగ్ జాప్యమైంది. మొదటి విడత సీట్ల కేటాయింపు జరిగినా సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వకపోవడంతో రెండో దశ కౌన్సెలింగ్‌కు అవకాశం లేకుండా పోయింది. మొదటి దశలో సీట్లు పొందిన వారు ఇతర కాలేజీల్లోకి మారలేకపోయారు, పూర్తిస్థాయిలో ఆప్షన్లు పెట్టుకోక సీట్లు పొందలేకపోయిన అభ్యర్థులకు మరో అవకాశం లేకుండా పోయింది. చివరకు విద్యార్థులే కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధపడాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా అవకాశం వస్తుందో లేదో తెలియదు. మొదటి దశలో చేరిన 1.04 లక్షల మంది విద్యార్థులకు మాత్రం తరగతులు ప్రారంభమయ్యాయి. ఇక ఎంసెట్ మేనేజ్మెంట్ కోటా భర్తీ, బైపీసీ స్ట్రీమ్ ప్రవేశాల్లోనూ గందరగోళం నెలకొంది. పీజీఈసెట్: అంతా గందరగోళం పీజీఈసెట్‌లో ప్రవేశాల కౌన్సెలింగ్ వ్యవహారం మొత్తం గందరగోళంగా తయారైంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏయే కాలేజీల్లో ఆప్షన్లు ఇచ్చుకోవాలో, ఏ కాలేజీలో ఆప్షన్లు ఇచ్చుకోవద్దో తెలియని అయోమయంలో అభ్యర్థులు మునిగిపోయారు. మొదట 145 ఎంటెక్, 50 ఎంఫార్మసీ కాలేజీలనే కౌన్సెలింగ్‌లో చేర్చాలని నిర్ణయించారు. అయితే మిగతా కాలేజీల వారు కోర్టును ఆశ్రయించడంతో... మరో 150కి పైగా ఎంటెక్, ఎంఫార్మసీ కాలేజీలను కౌన్సెలింగ్‌లో చేర్చారు. కానీ తుది తీర్పు వెలువడే వరకు వీటిల్లో ప్రవేశాలను ఖరారు చేయవద్దని కోర్టు స్పష్టం చేసింది. దీంతో విద్యార్థులకు ఆ కాలేజీల్లో ఆప్షన్ ఇచ్చుకోవాలా? వద్దా? అనే గందరగోళం నెలకొంది. పీజీఈసెట్‌కు 19వ తేదీ వరకూ సర్టిఫికెట్ల తనిఖీ నిర్వహిస్తుండగా.. 23వ తేదీ వరకు ర్యాంకుల వారీగా వెబ్ఆప్షన్లకు అవకాశం ఉంది. ఎడ్‌సెట్..: అఫిలియేషన్లకే దిక్కులేదు ఉపాధ్యాయ విద్యా కోర్సు అయిన బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఎడ్)లో ప్రవేశాలు చేపట్టాల్సిన కాలేజీలకు ఇంతవరకు అఫిలియేషన్ల ప్రక్రియే పూర్తి కాలేదు. ఈ నెల 21వ తేదీ నుంచి 28 వరకు సర్టిఫికెట్ల తనిఖీ, 23వ తేదీ నుంచి అక్టోబరు 1వ తేదీ వరకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించినా... ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి. ఈ కౌన్సెలింగ్‌తో తెలంగాణ, ఏపీల్లోని 69,068 బీఎడ్ సీట్లను భర్తీ చేయాల్సి ఉంది. ఇందుకోసం ఎడ్‌సెట్‌లో అర్హత సాధించిన 1,47,188 మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. తెలంగాణలోని 261 కాలేజీల్లో 27,744 సీట్లు అందుబాటులో ఉండగా... ఆంధ్రప్రదేశ్‌లోని 386 కాలేజీల్లో 41,324 సీట్లు భర్తీ చేయాల్సి ఉంది. డైట్‌సెట్..: పరిస్థితి మరీ దారుణం ఉపాధ్యాయ విద్యా కోర్సు అయిన డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సులో ప్రవేశాల కోసం డైట్‌సెట్‌లో అర్హత సాధించిన 2,25,000 మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఈ ప్రవేశాలకు సంబంధించి 650కు పైగా ప్రైవేటు కాలేజీలకు అఫిలియేషన్ల ప్రక్రియ ఇంకా ప్రభుత్వ పరిశీలనలోనే ఉంది. అఫిలియేషన్లు లభిస్తే తప్ప ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్ జారీ చేసే పరిస్థితి లేదు. అనేక డీఎడ్ కాలేజీల్లో లోపాలు ఉన్నట్లు ప్రభుత్వానికి సిఫారసులు అందాయి. దీంతో ప్రభుత్వాలు ఎన్నింటికి, ఎప్పుడు అనుమతిస్తాయో.. పాఠశాల విద్యా శాఖలు అఫిలియేషన్లు ఇస్తాయో తెలియదు. దీంతో ప్రభుత్వ కాలేజీల్లోని సీట్ల భర్తీ కూడా ఆగిపోయింది. 2012లో అయితే ఏకంగా ఫిబ్రవరిలో తరగతులు ప్రారంభించారు. ఇక ఈసారి ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియదు. పీఈసెట్: ఇంకా రాని షెడ్యూల్ వ్యాయమ ఉపాధ్యాయ కోర్సులైన బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ), డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (డీపీఈడీ)లో ప్రవేశాల కోసం ఇంకా షెడ్యూల్ జారీ కాలేదు. ప్రవేశాల కౌన్సెలింగ్‌ను వచ్చే నెల 6వ తేదీ నుంచి చేపట్టాలని మాత్రం నిర్ణయించారు. ఇరు రాష్ట్రాల్లోని దాదాపు 40 కాలేజీల్లో ప్రవేశాలను చేపట్టాల్సి ఉంది. ఈ నెల 24న నోటిఫికేషన్ జారీ చేసి.. వచ్చే నెల 6 నుంచి 8 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 7వ తేదీ నుంచి 9 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించాలని, 11న సీట్లను కేటాయించాలని నిర్ణయించారు. ఐసెట్..: ఆలస్యం తప్పేలా లేదు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు షెడ్యూల్‌ను శనివారం జారీ చేశారు. కానీ కాలేజీలకు అఫిలియేషన్లు లభించాల్సి ఉంది. 17వ తేదీ నుంచి సర్టిఫికెట్ల తనిఖీ, 20వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించారు. ఈ ప్రవేశాల కోసం ఐసెట్‌లో అర్హత సాధించిన 1,19,756 మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఇంజనీరింగ్ (బీటెక్) ప్రవేశాల ప్రక్రియ పూర్తయ్యాక దీనిపై దృష్టి సారించాలని భావించడంతో.. దీనికి ఆలస్యం తప్పడం లేదు. ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో కలిపి మొత్తం 1.20 లక్షల వరకు సీట్లను భర్తీ చేయాల్సి ఉండగా.. తెలంగాణలోని 539 కాలేజీల్లో దాదాపు 64 వేల సీట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని 628 కాలేజీల్లో 56 వేలకు పైగా సీట్లు ఉన్నాయి. లాసెట్దీ అదే పరిస్థితి.. లాసెట్‌లో ప్రవేశాలకు షెడ్యూల్‌ను ఇంకా జారీ చేయాల్సి ఉంది. దీనిపై అధికారులు దృష్టి సారించడం లేదు. ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన యూజీ లాసెట్, పీజీ లాసెట్‌లో అర్హత సాధించిన వారు 19 వేల మందికి పైగా అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలీసెట్ సీట్ల కేటాయింపు పూర్తయింది. ప్రవేశాలు కొనసాగుతున్నాయి. సోమవారం నుంచి తరగతులు ప్రారంభం కావాల్సి ఉంది. ఇక ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో లేటరల్ ఎంట్రీ (ఈసెట్) ప్రవేశాలు పూర్తయి, 12న తరగతులు ప్రారంభమయ్యాయి. పీజీఈసెట్ గందరగోళం పీజీఈసెట్‌లో ప్రవేశాల కౌన్సెలింగ్ వ్యవహారం మొత్తం గందరగోళంగా తయారైంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏయే కాలేజీల్లో ఆప్షన్లు ఇచ్చుకోవాలో, ఏ కాలేజీలో ఆప్షన్లు ఇచ్చుకోవద్దో తెలియని అయోమయంలో అభ్యర్థులు మునిగిపోయారు. మొద ట 145 ఎంటెక్, 50 ఎంఫార్మసీ కాలేజీలనే కౌన్సెలింగ్‌లో చేర్చాలని నిర్ణయించారు. అయితే మిగతా కాలేజీల వారు కోర్టును ఆశ్రయించడంతో... మరో 150కి పైగా ఎంటెక్, ఎంఫార్మసీ కాలేజీలను కౌన్సెలింగ్‌లో చేర్చారు. కానీ తుది తీర్పు వెలువడే వరకు వీటిల్లో ప్రవేశాలను ఖరారు చేయవద్దని కోర్టు స్పష్టం చేసింది. దీంతో విద్యార్థులకు ఆ కాలేజీల్లో ఆప్షన్ ఇచ్చుకోవాలా? వద్దా? అనే గందరగోళం నెలకొంది. పీజీఈసెట్‌కు 19వ తేదీ వరకూ సర్టిఫికెట్ల తనిఖీ నిర్వహిస్తుండగా.. 23వ తేదీ వరకు ర్యాంకుల వారీగా వెబ్ఆప్షన్లకు అవకాశం ఉంది. -
ఒక్క రూపాయిస్తే ఒట్టు!
వారంతా వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులు... ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కుటుంబసభ్యులకు దూరంగా వసతి గృహాల్లో ఉంటూ చదువుకొంటున్నారు. హాస్టల్లో ఉంటే కాస్త మంచి దుస్తులు, భోజనం లభిస్తుంది, చక్కగా చదువుకోవచ్చని భావించిన విద్యార్థులకు ఇక్కడ కూడా అవస్థలు తప్పడంలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇక్కట్లకు గురవుతున్నారు. హాస్టళ్ల నిర్వహణకు ఇంతవరకూ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా విడుదల కాకపోవడంతో వసతి గృహాల అధికారులు బయట అప్పులు చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం : ‘మాది బీసీల పార్టీ. అధికారంలోకి వస్తే అన్ని విధాలుగా ఆదుకుంటాం. వెనుకబడిన వర్గాల సంక్షేమమే మా ధ్యేయం’ అంటూ ఎన్నికలకు ముందు టీడీపీ నేతలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. తీరా ప్రభుత్వం ఏర్పాటు చేశాక గాలి కొదిలేశా రు. అందుకు బీసీ హాస్టళ్లే ఉదాహరణ. వసతి గృహాలు తెరిచి నెలరోజులుకావస్తున్నా ఇంతవరకూ ఒక్క రూపాయి బడ్జెట్ కూడా విడుదల చేయలేదు. విద్యార్థులకు కావాల్సిన యూనిఫారాలు, నోటు పుస్తకాలు పంపిణీ చేయలేదు. పాఠశాలలు తెరిచే నాటికే నిధులతో పాటు విద్యార్థులకు అవసరమైనవన్నీ సిద్ధం చేయాలి. కానీ, ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో అటు విద్యార్థులు, ఇటు హాస్టల్ అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత నెల 12న బీసీ హాస్టళ్లు తెరిచారు. కానీ, ఇంతవరకు యూనిఫారాలు ఇవ్వలేదు. గతంలో మాదిరిగా ఒక్కొక్క విద్యార్థికి నాలుగు జతలు కాకుండా మూడు జతలే ఇస్తామని, వాటితో పాటు ఒక ట్రాక్ షూ ఇవ్వనున్నట్టు ప్రకటిస్తూ అందుకనుగుణంగా ప్రతిపాదనలు పంపాలని జిల్లాల వారీగా అధికారులను సర్కార్ కోరింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో ఉన్న లక్షా 12వేల మంది విద్యార్థులకు వేర్వేరు రకాలు కలిపి 7లక్షల 97వేల 120మీటర్ల క్లాత్ అవసరం ఉంటుందని అధికారులు నివేదించారు. జిల్లాలో విద్యార్థులకు 46,487.9 మీటర్లు కావాలి. కానీ ఇంతవరకు యూనీఫారాల గురించి పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. ఎప్పుడిస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీంతో గత ఏడాది వాడిన యూనిఫారాలనే విద్యార్థులు వేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. వాటిలో చాలావరకు చిరిగిపోయినా తప్పని పరిస్థితుల్లో వేసుకుంటున్నారు. అసలు ధరించడానికే అవకాశం లేకపోతే సాధారణ దుస్తులు(సివిల్ డ్రెస్) ధరిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూనిఫారాల కోసం రాష్ట్రంలో సుమారు లక్షా 12 వేల మంది విద్యార్థులు నిరీక్షిస్తున్నారు. ఇంకో విశేషమేమిటంటే గత ఏడాది విద్యార్థుల దుస్తులు కుట్టిన దర్జీలకు నేటికీ చెల్లింపులు చేయలేదు. దీంతో భవిష్యత్‌లో విద్యార్థుల దుస్తులు కుట్టేందుకు సిద్ధంగా లేమని దర్జీలు తెగేసి చెప్పేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం క్లాత్ పంపించినా మూలన పడి ఉండడం తప్ప అధికారులు చేసేదేమీ లేదు. నోటు పుస్తకాల పరిస్థితీ అంతే... ఇంతవరకు ఒక్క హాస్టల్ విద్యార్థికి కూడా నోటు పుస్తకాలు అందజేయలేదు. దీంతో విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగుతోంది. జిల్లాలో వసతిగృహాల్లో ఉండి చదువుకుంటున్న 5,715 మంది విద్యార్థులకు 63,839నోటు పుస్తకాలు అవసరం కాగా, ఇప్పటికి ఒక్క పుస్తకం కూడా విద్యార్థికి చేరలేదు. రాష్ట్రంలోని మిగతా 12 జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. హాస్టళ్ల నిర్వహణకు కూడా ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయలేదు. తెరిచి నెలరోజులు కావస్తున్నా ఒక్క రూపాయి కూడా మంజూరుచేయలేదు. దీంతో వసతి గృహాల అధికారులంతా అప్పులు చేసి విద్యార్థులకు భోజనం పెడుతున్నారు. సివిల్ సప్లయిస్ ద్వారా అందిస్తున్న పీడీఎస్ బియ్యం విడిపించుకోవడానికి ప్రభుత్వం నిధులివ్వలేదు. ఈ క్రమంలో విద్యార్థులకు అందించే భోజనం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఏడాదీ హాస్టల్ తెరిచే ముందు భవనాలకు మరమ్మతులు చేయాల్సి ఉంది. అవసరమైతే సున్నాలు వేయాల్సి ఉంటుంది. కానీ ఈ ఏడాది నిధులు విడుదల చేయకపోవడంతో వసతి గృహ అధికారులు వాటి జోలికే వెళ్లలేదు. దీంతో మరమ్మతులకు నోచుకోని భవనాల్లోనే విద్యార్థులు కాలం వెళ్లదీస్తున్నారు. -
బీమాయే
సాక్షి, ఏలూరు: ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన ప్పుడు తీవ్రంగా నష్టపోయే రైతులను ఆదుకునే లక్ష్యంతో అమల్లోకి తెచ్చిన జాతీయ వ్యవసాయ పంటల బీమా పథకం (ఎన్ఎఐఎస్) ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అన్నదాతలం దరికీ అక్కరకు రావటం లేదు. రైతులు బీమా చేయించేందుకు ఆసక్తి చూపుతున్నా గడువు పెంచకపోవడంతో జిల్లాలో లక్షన్నర మంది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. గతేడాది నీలం, పై-లీన్, హెలెన్, లెహర్ తుపానులు, భారీ వర్షాలు పంటలను నాశనం చేశాయి. ఇలాంటప్పుడు, కళ్లాల్లో ఉన్న ధాన్యం రాశులు పాడైనా, వర్షాభావ పరిస్థితుల్లో విత్తనం మొలకెత్తకపోయినా.. వడగండ్ల వానలు కురిసినప్పుడు పంట దెబ్బతిన్నా రైతులకు కలిగే నష్టానికి ఈ బీమా పథకం వర్తిస్తుంది. లక్షన్నర మందికి మొండిచేయి జిల్లాలో 5.85 లక్షల మంది రైతులు ఉ న్నారు. సుమారు ఆరు లక్షల ఎకరాల్లో వీ రంతా వరి పంటను సాగు చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు పంటలకు కలి పి 4.31 లక్షల మంది ఇప్పటివరకూ రూ. 4,250 కోట్ల మేర రుణాలు పొందారు. బ్యాం కులు రుణాలు ఇచ్చేప్పుడే బీమా ప్రీమియంను మినహాయించుకుంటాయి. రుణా లు పొందిన రైతులకు బీమా చెల్లిం చేందుకు బ్యాంకులకు ఈ ఏడాది మార్చి వరకూ గడువు ఇచ్చారు. రుణం తీసుకోని రైతులూ వ్యవసాయశాఖ ద్వారా నేరుగా బీమా చెల్లించవచ్చు. జిల్లాలో రుణాలు పొందని కౌలు రైతులు, రైతులు 1.54 లక్షల మంది ఉన్నారు. వీరికి బీమా గడువు గతేడాది డిసెంబర్ 31 వరకు మాత్రమే ఇచ్చారు. బ్యాంకు రుణం పొందని రైతులు పంటల బీమా చేయించుకోవాలంటే నాట్లు వేసినట్టు ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. వరుస తుపానుల కారణంగా ఖరీఫ్ బాగా ఆలస్యం కావడంతో రబీ కూడా ఆలస్యమైంది. గత నెలాఖరుకు నాట్లు ప్రారంభ దశలోనే ఉన్నాయి. నాట్లు వేయకుండా ధ్రువీకరణ పత్రం ఇవ్వడం అసాధ్యం. దీంతో బీమా గడువు పెంచాల్సిన ప్రభుత్వం వారి సంగతి పట్టించుకోకపోవడంతో పంటల బీమా పథకానికి దూరమయ్యారు. ఇప్పుడు నాట్లు పూర్తయినా గడువు లేకపోవడంతో లక్షన్నర మంది రైతులకు పంటల బీమా అందకుండా పోయింది. అదే సమయంలో బ్యాంకర్లకు ప్రభుత్వం మార్చి 31 వరకు గడువివ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీమా చేయించుకున్నవారిపైనా ఆర్థిక భారం బీమా ప్రీమియాన్ని పెంచడంతో పాటు ప్రభుత్వ నిబంధనల వల్ల క్రాప్ ఇన్సూరెన్స్ కట్టిన రైతులపైనా భారం పడుతోంది. బీమా ప్రీమియం గతంలో 2.25 శాతమే ఉండేది. దానిని 2012-13లో 4 శాతానికి పెంచారు. 2013-14లో మరోసారి 5 శాతానికి పెంచారు. దీంతో ఎకరా వరి పంటకు రూ.579, చెరకుకు రూ.974 చొప్పున ప్రీమియం చెల్లించాల్సి వస్తోంది. పంట నష్టపోయిన రైతుని ఆదుకోవాల్సి వచ్చినప్పుడు మండలం యూనిట్‌గా పరిగణించడంతో పాటు నష్టం అంచనాలు వేయడంలో ప్రామాణికతలు పాటించకపోవడంతో పరిహారం దక్కడం లేదు. 50 శాతం పైగా పంటకు నష్టం వాటిల్లితేనే పరిహారం అంటూ మెలిక పెట్టి బీమా ఎగ్గొడుతున్నారు. తమకు ఒరిగేదేమీ ఉండడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. -
నడకయాతన
సాక్షి, నల్లగొండ: వికలాంగుల సంక్షేమానికి సర్కారు నీళ్లొదులుతోంది. అన్నివిధాలుగా ఆదుకోవాల్సిన బాధ్యతను విస్మరిస్తోంది. ఫలితంగా వారు తీవ్ర నిర్లక్ష్యానికి గురై ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నారు. జిల్లాలో సుమారు 85వేల మందికి పైగా వికలాంగులు ఉన్నారు. వీరిలో చాలామందికి ట్రై సైకిళ్లు, వీల్ చైర్లు, ఊతకర్రలు, వినికిడి యంత్రాలు, కృత్రిమ కాళ్లు తదితర ఉపకరణాలు అవసరం. అయితే ఏటా కొంతమందికే సర్కారు వీటిని అందజేసి చేతులు దులుపుకుంటోంది. ఒకసారి అందజేస్తే ఆ పరికరాలు మూడేళ్ల వరకు ఉపయోగపడతాయి. వీటి జీవితకాలం పూర్తికాగానే మళ్లీ కొత్తవాటిని అందజేయాల్సి ఉంటుంది. ఇలా మూడేళ్లకోసారి ప్రతి వికలాంగుడికీ సంబంధిత పరికరం అప్పగించాల్సిందే. కానీ, ఇవేవీ సక్రమంగా జరగడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అత్తెసరుగా.. ప్రత్యేక అవసరాలు గల వారికి నామమాత్రంగా ఉపకరణాలు అందజేస్తున్నారు. దీంతో పరికరాల కోసం రెండేళ్లుగా వేలమంది వికలాంగులు నిరీక్షిస్తున్నారు. మొదటగా దరఖాస్తు చేసుకున్న, అధిక వికలత్వం ఉన్న వారికి తొందరగా ఉపకరణాలు ఇచ్చేందుకు మొదటి ప్రాధాన్యం ఇస్తారు. వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా 2012లో 700, ఈ ఏడాదిలో ఇప్పటివరకు 500 ట్రై సైకిళ్లు మాత్రమే వికలాంగులకు అందజేశారు. గతేడాది జనవరి నుంచి ట్రె సైైకిళ్ల కోసం 500, ఊతకర్రల కోసం 200, కృత్రిమ అవయవాలకు 150, కాలిపర్స్కు 150మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీరికి ఇప్పటివరకు పరికరాలు అందజేసిన పాపాన పోలేదు. ఇవేగాక తాజాగా రెవెన్యూ డివిజన్లలో అధికారులు ప్రత్యేక క్యాంపులు నిర్వహించారు. ఈ శిబిరాల్లో మరో వెయ్యి మందికిపైగా వికలాంగులు ఉపకరణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ముందు దరఖాస్తు చేసుకున్న వారికే పరికరాలు చేరలేదు... తాజా దరఖాస్తుదారులకు ఎప్పుడు అందజేస్తారో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది. తీవ్ర అవస్థలు.. పరికరాలు అందనివారిలో చాలామంది విద్యార్థులున్నారు. వీరు నిత్యం విద్యాలయలకు వెళ్లాలంటే తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఒకరు తోడుంటేనే ఇంటి నుంచి బయటకు వెళ్తున్నారు. బయట ఏ చిన్న అవసరం పడినా స్వయంగా చేసుకోలేని దుస్థితి దాపురించింది. వీరితోపాటు చిరువ్యాపారాలు చేసుకునేవారు ఉన్నారు. వీరు పనిపై నిత్యం బయటకు వెళ్లాల్సిందే. దీంతో అటు బయట తిరగలేక.. ఇటు పరికరాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం వారికి ఊతకర్రలూ ఇచ్చేందుకూ అధికారులకు మనసొప్పడం లేదు. ఊతకర్రల జత ధర రూ 750 నుంచి రూ 1000 వరకు ఉంటుంది. ఈ మొత్తాన్ని భరించేందుకూ వారు సాహసించడం లేదు. దీన్నిబట్టి చూస్తే సర్కారుకు వికలాంగులపై ఉన్న ప్రేమ ఏపాటిదో అర్థమవుతోంది. వచ్చే గణతంత్ర దినోత్సవంనాడు పరికరాలు అందుతాయని అధికారులు చెబుతున్నారు. అయితే, అప్పుడైనా వాటిని పూర్తిస్థాయిలో అందేజేస్తారా అన్న సందేహం కలుగుతోంది. -
‘ఉత్త’ ప్రణాళిక!
యాచారం, న్యూస్‌లైన్ : దళితులు, గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు ఉద్దేశించిన ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక ప్రభుత్వ నిర్లక్ష్యంతో నీరుగారుతోంది. దేశంలోనే ప్రప్రథమంగా ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికను రూపొందించి చట్టబద్ధత కల్పించామని.. రూ.కోట్ల రూపాయలు వారి సంక్షేమానికి కేటాయించామని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. అరకొర నిధులు విడుదల చేస్తూ ఉప ప్రణాళికను ‘ఉత్త’ ప్రణాళికగా మార్చేస్తోంది. కాలనీల్లో అభివృద్ధి పనులు వెంటనే చేపట్టనున్నట్టు ప్రజా ప్రతినిధులు, అధికారులు నమ్మబలకడంతో దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీలు అరకొర నిధులు మంజూరు కావడంతో నిరుత్సాహానికి గురవుతున్నారు. ఉదాహరణకు యాచారం మండలంలోని 20గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనుల కోసం దళితులు, గిరిజనులు రెండువేలకు పైగా అర్జీలు పెట్టుకున్నారు. అధికంగా ఇళ్లు, సీసీ రోడ్లు, డ్రెయినేజీ కాల్వలు, వీధి లైట్లు, కమ్యూనిటీ భవనాలు, తాగునీటి సరఫరా మెరుగు కోసం దరఖాస్తు చేసుకున్నారు. మండల పరిధి 20 గ్రామాల్లోని ఎస్సీ కాలనీల్లో నేటికీ సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేదు. ఇక నందివనపర్తి అనుబంధ తండాలైన బొల్లిగుట్ట, ఎనెకింది, నీలిపోచమ్మ తండా, మంతన్‌గౌరెల్లి పరిధిలోని భానుతండా, కేస్లీతండా, మంతన్‌గౌడ్, కొత్తపల్లి తండా, తక్కళ్లపల్లి అనుబంధ ఎర్రగొల్ల తండా, వేపపురితండా ఇలా మండలంలోని 19 తండాల్లో మౌలిక వసతులు అటుంచి కనీస రోడ్డు కూడా లేకపోవడంతో గిరిజనులు నిత్యావసరాల కోసం కాలినడకన కిలోమీటర్ల దూరంలోని గ్రామాలకు వెళ్లాల్సి వస్తోంది. ప్రతిపాదనలు రూ.30కోట్లకు.. మంజూరైంది రూ.7.30లక్షలే! ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద చేపట్టాల్సిన పనుల కోసం ప్రతిపాదనలు పంపాలన్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన క్షేత్రస్థాయి సిబ్బంది దరఖాస్తులను పరిశీలించి అభివృద్ధి పనుల విలువ లెక్కకట్టారు. 20 గ్రామాలు, 19 తండాల్లో అభివృద్ధి పనుల కోసం రూ.30 కోట్లకు పైగా నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపా రు. అయితే ఇళ్లు, సీసీ రోడ్లు, డ్రెయినేజీ వ్యవ స్థ నిర్మాణాలు, తాగునీటి సమస్య పరిష్కారాలకు నిధుల మంజూరును పక్కన పెట్టిన ఉన్నతాధికారులు కేవలం ఒక్క కమ్యూనిటీ భవన నిర్మాణానికి మాత్రమే నిధులు విడుదల చేశారు. మొత్తం 12 గ్రామాల్లో కమ్యూనిటీ భవనాలు ప్రతిపాదించగా, ఒక్క మంతన్‌గౌరెల్లిలో మాత్రమే నిర్మించడానికి రూ.7.30లక్షలు మంజూరయ్యాయి. ఇటీవల మంతన్‌గౌరెల్లిలో పర్యటించిన ఎంపీడీఓ.. ఎస్సీ కాలనీ లో కమ్యూనిటీ భవనం నిర్మాణానికి నిధులు మంజూరైన విషయం గ్రామస్తులకు తెలియజేశారు. కాగా, మంతన్‌గౌరెల్లి గ్రామంలోనే కమ్యూనిటీ భవనానికి నిధులు మంజూరైన విషయం తెలుసుకున్న మిగతా గ్రామాల ఎస్సీ కాలనీవాసులు తమ దరఖాస్తులను అధికారులు పక్కనపెట్టారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు జిల్లాలోని అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి కన్పిస్తున్నది.