నల్లగొండ టుటౌన్, న్యూస్‌లైన్: విద్యుత్ ఉద్యోగులు విధుల పట్ల అలసత్వం వహిస్తే ఉపేక్షించేదిలేదనిసీపీడీసీఎల్ సీఎండీ రిజ్వీ స్పష్టం చేశారు. రైతుల సమస్యలపై వెంటనే స్పందించాలని ఆదేశించారు.
బుధవారం హైదరాబాద్ రోడ్డులోని విద్యుత్ ఉద్యోగుల సమావేశ మందిరంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్ని నిధులు అయినా ఇస్తామని రోలింగ్ ట్రాన్స్‌ఫార్మర్లు అందుబాటులో పెట్టుకోవాలన్నారు.వ్యసాయానికి మెరుగైన విద్యుత్ అందించేందుకు సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయని రైతు లు సమాచారం అందిస్తే నిర్లక్ష్యంగా వ్య వహరించే వారిపై చర్యలు తప్పవన్నా రు. ఈ రెండు నెలలు చాలా కీలకమని ప్రతి ఉద్యోగి చిత్తశుద్ధితో పని చేయాలన్నారు.
సంస్థకు సంబంధించిన పూర్తి సమాచారం ఉండాలని సమావేశాలకు అరకొర సమాచారంతో హాజరైతే పరి ణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఉద్యోగులు పని చేసే చోటనే నివాసం ఉండి విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో యుద్ధ ప్రాతిపదికన అమర్చే విధంగా చర్యలు తీసుకోవాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈని ఆదేశించారు. ఆర్థిక సంవత్సరం ముగిసే గడువు దగ్గర పడుతున్నందున అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సమావే శంలో ట్రాన్స్‌కో ఎస్‌ఈ బాలస్వామి, డీఈటీ జైహింద్, అశోక్‌కుమార్ పాల్గొన్నారు.
నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలి
నల్లగొండ టుటౌన్ : వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసి పంటలను కాపాడాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బుధవారం జిల్లా కేంద్రానికి వచ్చిన సీపీడీసీఎల్ సీఎండీ రిజ్వీని కలిసి కోరారు. లోఓల్టేజీ, ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులు, కరెంట్ కోతలను ఆయన సీఎండీ దృష్టికి తీసుకెళ్లారు.
రబీలో ఐదు గంటలు కూడా విద్యుత్ సరఫరా కావడంలేదని తెలిపారు. కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లను సకాలంలో మరమ్మతులు చేసి ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందు లు పడుతున్నారని వివరించారు. వ్యవసాయ రంగానికి రాత్రిపూట 3, పగలు 3 గంటల విద్యుత్‌ను సరఫరా చేస్తామని ఎమ్మెల్యేకు సీపీడీసీఎల్ సీఎండీ హామీ ఇచ్చారు. కాలి పోయిన ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో వెంటనే మరోటి అమర్చే విధంగా చర్య తీసుకుంటానన్నారు.
విధుల పట్ల అలసత్వం వహించొద్దు
Published Thu, Feb 6 2014 3:41 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement