power employes
-
విధుల పట్ల అలసత్వం వహించొద్దు
నల్లగొండ టుటౌన్, న్యూస్‌లైన్: విద్యుత్ ఉద్యోగులు విధుల పట్ల అలసత్వం వహిస్తే ఉపేక్షించేదిలేదనిసీపీడీసీఎల్ సీఎండీ రిజ్వీ స్పష్టం చేశారు. రైతుల సమస్యలపై వెంటనే స్పందించాలని ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ రోడ్డులోని విద్యుత్ ఉద్యోగుల సమావేశ మందిరంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్ని నిధులు అయినా ఇస్తామని రోలింగ్ ట్రాన్స్ఫార్మర్లు అందుబాటులో పెట్టుకోవాలన్నారు.వ్యసాయానికి మెరుగైన విద్యుత్ అందించేందుకు సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయని రైతు లు సమాచారం అందిస్తే నిర్లక్ష్యంగా వ్య వహరించే వారిపై చర్యలు తప్పవన్నా రు. ఈ రెండు నెలలు చాలా కీలకమని ప్రతి ఉద్యోగి చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. సంస్థకు సంబంధించిన పూర్తి సమాచారం ఉండాలని సమావేశాలకు అరకొర సమాచారంతో హాజరైతే పరి ణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఉద్యోగులు పని చేసే చోటనే నివాసం ఉండి విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో యుద్ధ ప్రాతిపదికన అమర్చే విధంగా చర్యలు తీసుకోవాలని ట్రాన్స్‌కో ఎస్ఈని ఆదేశించారు. ఆర్థిక సంవత్సరం ముగిసే గడువు దగ్గర పడుతున్నందున అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సమావే శంలో ట్రాన్స్‌కో ఎస్ఈ బాలస్వామి, డీఈటీ జైహింద్, అశోక్‌కుమార్ పాల్గొన్నారు. నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలి నల్లగొండ టుటౌన్ : వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసి పంటలను కాపాడాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బుధవారం జిల్లా కేంద్రానికి వచ్చిన సీపీడీసీఎల్ సీఎండీ రిజ్వీని కలిసి కోరారు. లోఓల్టేజీ, ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు, కరెంట్ కోతలను ఆయన సీఎండీ దృష్టికి తీసుకెళ్లారు. రబీలో ఐదు గంటలు కూడా విద్యుత్ సరఫరా కావడంలేదని తెలిపారు. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లను సకాలంలో మరమ్మతులు చేసి ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందు లు పడుతున్నారని వివరించారు. వ్యవసాయ రంగానికి రాత్రిపూట 3, పగలు 3 గంటల విద్యుత్‌ను సరఫరా చేస్తామని ఎమ్మెల్యేకు సీపీడీసీఎల్ సీఎండీ హామీ ఇచ్చారు. కాలి పోయిన ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో వెంటనే మరోటి అమర్చే విధంగా చర్య తీసుకుంటానన్నారు. -
అలుపెరుగని పోరు
సాక్షి, అనంతపురం : జిల్లా వ్యాప్తంగా సమైక్య నినాదాలు మోర్మోగుతున్నాయి. అనంతపురం నగరంలో జాక్టో ఆధ్వర్యంలో మంగళవారం రిలే దీక్షలు కొనసాగించిన ఉపాధ్యాయులు... కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించారు. సప్తగిరి సర్కిల్లో మానవహారం నిర్మించి... దిష్టిబొమ్మలను దహనం చేశారు. ‘మొద్దునిద్రలో ఉన్న మంత్రులను గునపాలతో గుచ్చి లేపుతున్నట్లు’గా ఉపాధ్యాయులు స్థానిక టవర్‌క్లాక్ సర్కిల్లో వినూత్న ప్రదర్శన చేపట్టారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులు, ప్రైవేటు ఆస్పత్రుల సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లు నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. విద్యుత్ ఉద్యోగులు ఎస్ఈ కార్యాలయం ఎదుట మహాధర్నా చేపట్టారు. సాయినగర్ మల్లాలమ్మ ఆలయం వద్ద విద్యార్థులు సామూహిక ప్రార్థనలు చేశారు. ఎమ్మార్పీఎస్ నాయకులు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారు. నీటిపారుదల, పీఏసీఎస్, పంచాయతీ రాజ్, పశుసంవర్ధక, రెవెన్యూ, వాణిజ్య పన్నుల శాఖ జేఏసీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాల జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. సేతు, విన్సెంట్ డీపాల్, రాధా స్కూల్ ఆఫ్ లెర్నింగ్ పాఠశాలల విద్యార్థులు ఎస్కేయూ వద్దకు ర్యాలీగా వెళ్లి... అక్కడ జాతీయ రహదారిపై రెండు గంటల పాటు బైఠాయించారు. రోడ్డుపైనే ఖోఖో, వాలీబాల్, క్రికెట్, స్కిప్పింగ్ తదితర ఆటలు ఆడారు. ఎస్కేయూ విద్యార్థి, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు విద్యా సంస్థల విద్యార్థులకు రోడ్లపైనే ఆటల పోటీలు నిర్వహించారు. ధర్మవరం, బత్తలపల్లి, ముదిగుబ్బ, గుంతకల్లులో జేఏసీ నాయకుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మట్టికుండలతో ప్రదర్శన నిర్వహించారు. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు జాతీయ నాయకుల వేష ధారణలో జాతి సమైక్యతను చాటారు. వైద్య ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. చిలమత్తూరులో సమైక్యవాదులు నిరసన తెలిపారు. కదిరిలో విద్యార్థి నాయకుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. జేఏసీ నాయకులు రోడ్లను శుభ్రపరిచి నిరసన తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్లు ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ ఉద్యోగులు బైక్ ర్యాలీ చేపట్టారు. తలుపులలో భవన నిర్మాణ కార్మికులు రిలే దీక్షలు చేపట్టారు. నల్లచెరువులో డాక్టర్లు ర్యాలీ చేశారు. కళ్యాణదుర్గంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. నాయీ బ్రాహ్మణులు భారీ ర్యాలీ నిర్వహించారు. మడకశిరలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల సిబ్బంది ర్యాలీ చేపట్టడమే కాకుండా... రోడ్డుపైనే రోగులకు చికిత్స చేశారు. జేఏసీ నాయకులు ఆటో రిక్షాలతో ర్యాలీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలను మూసేయించారు. అమరాపురంలో జేఏసీ నాయకులు కేసీఆర్ మాస్కులు ధరించి ర్యాలీ చేశారు. పుట్టపర్తి, ఓడీ చెరువులలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. బుక్కపట్నం డైట్ కళాశాల విద్యార్థులు ర్యాలీ, జేఏసీ నాయకులు చెక్కభజనతో నిరసన తెలిపారు. పుట్టపర్తిలో జేఏసీ నాయకులు శరీరానికి మట్టి పూసుకుని నిరసన తెలిపారు. పెనుకొండలో టింబర్ డిపోల అసోసియేషన్ సభ్యులు, రొద్దం, యల్లనూరులో విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. సోమందేపల్లిలో వెలితడకల గ్రామస్తులు జాతీయ రహదారిపై బైఠాయించారు. రాయదుర్గంలో మేదర్లు రోడ్లపైనే బుట్టలు అల్లుతూ నిరసన తెలిపారు. ఇదే పట్టణంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. కణేకల్లులో దళితులు చేపట్టిన బంద్ విజయవంతమైంది. రాప్తాడులో ఉపాధ్యాయులు హోమం, శింగనమలలో సమైక్యవాదులు భిక్షాటన చేశారు. గార్లదిన్నెలో ఎనుములకు కేసీఆర్ దిష్టిబొమ్మను కట్టి ర్యాలీ నిర్వహించారు. బుక్కరాయసముద్రంలో ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల సిబ్బంది ఆందోళన చేపట్టారు. తాడిపత్రిలో వైద్య, ఆరోగ్య జేఏసీ, సర్‌సీవీ రామన్ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. మహిళా జేఏసీ ఆధ్వర్యంలో కళ్లు, ముక్కు, చెవులు మూసుకుని వినూత్న నిరసన తెలిపారు. ఉపాధ్యాయులు భిక్షాటన చేశారు. గుంతకల్లులో వైఎస్ఆర్సీపీ నేతల రిలే దీక్షలు కొనసాగాయి. యాడికిలో నాయీ బ్రాహ్మణులు వినూత్న నిరసన తెలిపారు. సమైక్యవాదులు రోడ్లపైనే శిరోముండనం చేయించుకున్నారు. ఉరవకొండలో వైఎస్సార్సీపీ నాయకులు మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. వైఎస్సార్సీపీ రిలేదీక్షలు రెండో రోజూ కొనసాగాయి. వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. బెళుగుప్పలో నిరసనలు హోరెత్తాయి. వజ్రకరూరులో సమైక్యవాదులు జనగర్జన నిర్వహించారు. -
సమ్మె షాక్
కడప అగ్రికల్చర్,న్యూస్‌లైన్ : విద్యుత్ ఉద్యోగులు ఐకాస ఆధ్వర్యంలో 72 గంటల సమ్మెలోకి వెళ్లడంతో జిల్లాలోని పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. శుక్రవారం సీమాంధ్ర జేఏసీ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద విద్యుత్ ఐకాస నాయకులు, ఉద్యోగులు, సిబ్బంది నిరసన తెలిపారు. శంకరాపురం పవర్‌హౌస్‌లో విభజనను నిరసిస్తూ నినాదాలు చేశారు. విద్యుత్ ఉద్యోగుల సమ్మె కారణంగా ఆసుపత్రులకు, నీటి సరఫరాకు చాలా ప్రాంతాల్లో అవాంతరాలు సంభవించాయి. కడప నగరంలోని శంకరాపురంలో ఉన్న పవర్ స్టేషన్ ట్రిప్ అయింది. దీంతో విద్యుత్ సరఫరా దాదాపు కొన్ని గంటల పాటు పునరుద్ధరణకు నోచుకోలేదు. ప్రొద్దుటూరులోని ఆటోనగర్ విద్యుత్ వైర్లు తెగిపోవడంతో ఆ ప్రాంత పరిధిలో ఆంధకారం నెలకొన్నట్లు కాంట్రాక్టు ఉద్యోగులు తెలిపారు. అలాగే సంబేపల్లె మండలంలో వర్షానికి విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో దాదాపు 10 గ్రామాల్లో అంధకారం నెలకొంది. చిట్వేలి మండలంలోని మూడు సబ్స్టేషన్లలోని ట్రాన్స్మీటర్లు మొరాయించడంతో 15 గ్రామాలు అంధకారంలో ఉండిపోయాయి. ట్రిపుల్ ఐటీఐ పరిధిలోని సబ్స్టేషన్ట్రిప్ కావడంతో ఆ పరిధిలోని 3 గ్రామాలు చీకట్లో ఉండిపోయాయి. గోపవరం మండలంలోని 20 గ్రామాల్లో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. రెగ్యులర్ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లడంతో కాంట్రాక్టు ఉద్యోగులు సమస్యలు ఉత్పన్నమవుతున్న ప్రాంతాలను గుర్తించలేక పోతున్నారు. రూ.. 2.30 కోట్ల బిల్లు వసూళ్లకు గండి విద్యుత్ ఉద్యోగులు 72 గంటల సమ్మెకు వెళ్లడంతో జిల్లాలో విద్యుత్ బిల్లుల వసూళ్లు ఆగిపోయాయి. జిల్లా వ్యాప్తంగా బిల్లుల వసూలు కేంద్రాలు 22 ఉన్నాయి. ప్రతి రోజు రూ.1.15 కోట్ల బిల్లులు వసూళ్ల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. విద్యుత్ బిల్లు వసూళ్ల సిబ్బంది రెండు రోజులుగా సమ్మెలోకి పోవడంతో రూ.2.30 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి గండి పడినట్లయింది. జిల్లా పరిశీలనకు వచ్చిన తిరుపతి సర్కిల్ సీఈ రాంసింగ్ విద్యుత్ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లడంతో పాటు సంస్థ ఇచ్చిన సిమ్ కార్డులను ఎస్ఈకి అప్పగించారు. జిల్లాలో పరిస్థితులు ఎలా ఉన్నాయో పరిశీలించేందుకు తిరుపతి డిస్కం సర్కిల్ చీఫ్ ఇంజనీర్ రాంసింగ్ రెండు రోజులుగా పరిశీలన చేస్తున్నారు. అన్ని సబ్స్టేషన్లను పరిశీలిస్తూ ఏయే ప్రాంతాలలో విద్యుత్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో కాంట్రాక్టు ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. చిన్నచిన్న అంతరాయాలకు ఎలాగోలా మరమ్మత్తులు చేస్తామని, పెద్ద సమస్యలు పరిష్కరించడం తమవల్ల కాదని పలు ప్రాంతాల కాంట్రాక్టు ఉద్యోగులు సీఈకి వివరించినట్లు సమాచారం. -
అదే హోరు
సాక్షి, కడప : జిల్లాలో సమైక్య ఉద్యమం రోజులు గడుస్తున్న కొద్దీ మరింత ఉగ్రరూపం దాల్చుతోంది. ఉపాధ్యాయులు, ఎన్జీఓలు, ఆర్టీసీ కార్మికులు, అన్ని వర్గాల ఉద్యోగులు ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. వీరికి విద్యుత్ ఉద్యోగులు తోడవడంతో ఉద్యమం మరింత ఉధృతమైంది. సమైక్య రాష్ట్రం కోసం ఎన్ని కష్టాలనైనా భరిస్తామని మారుమూల గ్రామాలకు చెందిన ప్రజలు సైతం ఉద్యమానికి దన్నుగా నిలుస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, పలుచోట్ల బ్యాంకులను దిగ్బంధనంచేసి ఉద్యోగులను బయటికి పంపి మూసి వేయించారు. కడప నగరంలో ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో వందలాది మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ప్రైవేటు వృత్తి కళాశాలల అధ్యాపకులు, సిబ్బంది రిలే దీక్షలు చేస్తున్నారు. నాన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్, ఏజేసీ సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో సమావేశమై ఉద్యమ కార్యచరణను రూపొందించారు. శనివారం రింగ్‌రోడ్డులో చేపట్టాల్సిన మానవహారాన్ని వర్షాల నేపధ్యంలో ఈనెల 18వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మున్సిపల్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు, సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమితి, విద్యుత్, ప్రొఫెషనల్ కళాశాలల యాజమాన్యాల ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. కడపలో ఆకాశవాణి. పీఎఫ్, టెలికాం ఎక్స్ఛేంజ్, పోస్టాఫీసును సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉద్యోగులు దిగ్బంధనం చేసి మూసి వేయించారు. జమ్మలమడుగులో సమైక్యాంధ్రకు మద్దతుగా వైద్య సిబ్బంది బైక్ ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది వెయ్యి మీటర్ల జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. వీరికి స్థానిక ఎమ్మెల్యే ఆది ఎమ్మెల్సీ దేవగుడి సంఘీభావం తెలిపారు. జమ్మలమడుగు మండలంలోని గడికోట, బొమ్మేపల్లెలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఆర్టీపీపీ ఉద్యోగులు గేటు బయట బైఠాయించి నిరసన తెలియజేశారు. వంటా వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. సీఈతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. పులివెందులలో విద్యుత్ సిబ్బంది, ఉపాధ్యాయులు భారీర్యాలీ నిర్వహించారు. ఇడుపులపాయలో గురువారం రాత్రి విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో విద్యార్థులు ఇబ్బందుల పాలయ్యారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. బద్వేలులో గౌతమి విద్యా సంస్థల ఆధ్వర్యంలో సిబ్బంది, విద్యార్థులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నాలుగురోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. గోపవరం మండలంలోని 20 గ్రామాల్లో విద్యుత్‌సరఫరా ఆగిపోయింది. పోరుమామిళ్లలో వైఎస్సార్ సీపీ నేతలు చిత్తా ప్రతాప్‌రెడ్డి, ఒ.ప్రభాకర్‌రెడ్డి, కరెంటు రమణారెడ్డి నేతృత్వంలో చల్లగిరిగెల గ్రామానికి చెందిన కొండా వెంకట రమణారెడ్డి, రమణారెడ్డిలతోపాటు 15 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు.రాజంపేటలో వైఎస్సార్ సీపీ నేతలు మలిశెట్టి శ్రీనివాసులుగౌడ్, శవనం వెంకటేశ్వరనాయుడు ఆధ్వర్యంలో శవనగారిపల్లె, కొల్లావారిపల్లెకు చెందిన 50 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆకేపాటి సంఘీభావం తెలిపారు. శనివారం లక్ష మందితో రాజంపేట ప్రభుత్వ క్రీడా మైదానంలో సమైక్య రణభేరి సభను నిర్వహిస్తున్నారు. రాయచోటి పట్టణంలో ట్రాన్స్‌కో ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు వెనక్కి నడుస్తూ తమ నిరసనను తెలిపారు. పెడమడ గ్రామస్తులు, న్యాయవాదులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. రైల్వేకోడూరు పట్టణంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మోకాళ్లపై నడుస్తూ నిరసన తెలియజేశారు. ర్యాలీ నిర్వహిస్తూ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూసి వేయించారు. మైదుకూరులో వస్త్ర దుకాణాల వ్యాపారులు ర్యాలీ నిర్వహించారు. వంద మీటర్ల జాతీయ జెండాతో ప్రదర్శన చేపట్టారు. వీరికి ఉపాధ్యాయులు, విద్యార్థులు సంఘీభావం తెలిపారు. న్యాయవాదుల దీక్షలు కొనసాగాయి. ప్రొద్దుటూరు పట్టణంలో వైఎస్సార్ సీపీ నేతృత్వంలో 29వ వార్డుకు చెందిన మహిళలు బోగా లక్ష్మినారాయణమ్మ ఆధ్వర్యంలో పలువురు రిలే దీక్షలు చేపట్టారు.