తాడేపల్లి(గుంటూరు): ఆధ్యాత్మికత, పవిత్రత అనే విషయాలను మరిచి భక్తుల మనోభావాలను దెబ్బతీశాడు ఓ ఆలయ పూజారి. దీంతో అతడు సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వివరాలివీ...గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వీరాంజనేయ స్వామి ఆలయాన్ని విజయవాడ దుర్గగుడి దత్తత తీసుకుంది. ఈ ఆలయంలో హనుమ జయంతి నాడు పలు కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి కాశీ విశ్వనాథశాస్త్రి అసభ్యకరంగా ప్రవర్తించాడు.
మద్యం మత్తులో నృత్యాలు చేశాడు. గంజాయి తాగి, బూతు పాటలు పాడాడు. వీటన్నిటిపై భక్తుల నుంచి ఫిర్యాదులు అందుకున్న దుర్గగుడి ఈవో నర్సింహారావు సదరు పూజారిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.