‘రియల్’.. బెంబేల్ | Real estate prices surge in Vijayawada-Guntur | Sakshi
Sakshi News home page

‘రియల్’.. బెంబేల్

Published Sun, Jul 6 2014 3:22 AM | Last Updated on Sat, Sep 2 2017 9:51 AM

‘రియల్’.. బెంబేల్

‘రియల్’.. బెంబేల్

 రాజధాని ఏర్పాటు, భూముల విలువల నియంత్రణ సాకుతో రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా ఆస్తుల క్రయ, విక్రయాల్ని బంద్ చేయాలని భావిస్తుందనే సమాచారంతో జిల్లాలోని రియల్‌ఎస్టేట్ రంగంలో అలజడి చెలరేగింది. ప్రభుత్వ ప్రతిపాదన వల్ల నెల రోజులుగా జిల్లాలో  జోరుగా సాగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపార లావాదేవీలపై పిడుగులు పడ్డాయి. గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని ప్రకటించగానే రియల్టర్లు జాతీయ రహదారి పక్కన భూముల కొనుగోలుకు కోట్ల రూపాయలు గుమ్మరించారు. ప్రభుత్వ నిర్ణయంతో భారీగా నష్టపోక తప్పదని ఆవే దన వ్యక్తం చేస్తున్నారు.  విజయవాడ సిటీ : గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని ఏర్పాటు సమాచారంతో జిల్లాలో నెలరోజులుగా రియల్ వ్యాపారం జోరందుకొంది. రియల్టర్లు కోట్ల రూపాయాలతో భూములు కొనుగోలు చేసి అగ్రిమెంట్లు రాసుకున్నారు.  రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేస్తారనే సమాచారంతో వారిలో కలవరం రేగుతోంది. బహిరంగ మార్కెట్లో భూముల విలువలు అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతున్న జిల్లాలోని 8 మండలాల్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అక్కడ రిజిస్ట్రేషన్లు జరగకుండా నాలుగైదు రోజుల్లో ప్రత్యేక ఆర్డినెన్స్‌ను జారీ చేయబోతోంది.
 
 రెండు వేల కోట్లకు పైగా లావాదేవీలు
  గత కొద్దిరోజులుగా జిల్లాలో రెండు వేల కోట్ల రూపాలయలకు పైగా అధికారికంగా, అనధికారికంగా ఆస్తుల క్రయ, విక్రయాలు జరిగినట్లు సమాచారం. జిల్లా మొత్తంమీద ఇబ్రహీంపట్నం, కంకిపాడు, గన్నవరం, నూజివీడు, ఉయ్యూరు, గుడివాడ, జగ్గయ్యపేట, నున్న ప్రాంతాలలో రిజిస్ట్రేషన్లు అత్యధికంగా జరిగాయి. జిల్లాలోనే కంకిపాడు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికంగా రూ. 170 కోట్ల విలువ గల ఆస్తుల లావాదేవీలు జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా అన్ని  సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జూన్ నెలలో 16,457డాక్యుమెంట్లు ద్వారా సుమారు రూ. 600 నుంచి రూ.700 కోట్ల విలువగల ఆస్తుల క్రయ, విక్రయాలు జరిగాయి. అనధికారికంగా అగ్రిమెంట్లుపై  60 రోజుల షరుతలతో  చేతులు మార్చుకుని రొటేషన్ లావాదేవీల ద్వారా మరో రూ. 1400 కోట్ల అమ్మకాలు, కొనుగోళ్లు జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా గన్నవరం,కంకిపాడు, నున్న, ఆగిరపల్లి, ఇబ్రహీంపట్నం నూజివీడు ఉయ్యూరు, గుడివాడ పట్టణాలలో స్థలాల రేట్లు అనూహ్యంగా పెరిగాయి.
 
 పల్లెల్లోనూ రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరు
 పల్లెల్లో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది. భూముల క్రయ విక్రయాలు జరిగితే రెండుశాతం కమిషనపై వందల సంఖ్యలో బ్రోకర్లు పనిచేస్తున్నారు. కొందరు యువకులు సిండికేట్లుగా ఏర్పడి కమిషన్‌పై భూములు, స్థలాలు కొనుగోళ్లు, అమ్మకాలు చేయిస్తున్నారు.  
 
 ఆత్మహత్యలే శరణ్యం
 జిల్లాలో భూముల రిజిస్ట్రేషన్లు బంద్ చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేస్తే కొందరు రియల్టర్లు పేర్కొంటున్నారు. కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టిన తాము ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయి నానా ఇబ్బందులు పడాల్సిందేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధిక రేట్లు వస్తాయని పొలాల్ని అగ్రిమెంట్లపై స్వాధీనం చేసిన భూమి యజమానుల్లో కూడా భయాందోళన నెలకొంది. జిల్లాలో గత నెల రోజుల్లో అత్యధికంగా వ్యాపారం జరిగిన మండలాల్లో ఈ ఆందోళన ఎక్కువగా కన్పిస్తోంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో మునుగుతామా? అనే మీమాంసలో రియల్టర్లు బెంబేలెత్తుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల్లో కూడా ప్రభుత్వం నిర్ణయంపై నిరసన వ్యక్తం అవుతోంది.  తమ ఆస్తులకు మంచి రేట్లు వచ్చి లావాదేవీలు జరిగే సమయంలో ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేయాలను కోవటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement