గ్రామీణ రోడ్ల అభివృద్ధికి రూ 3.66 కోట్లు
Published Thu, Nov 7 2013 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 12:20 AM
తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్ సెంటర్), న్యూస్‌లైన్ :గ్రామీణ రోడ్లు అభివృద్ధికి నియోజకవర్గానికి రూ 3.66 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే ఈలి నాని తెలిపారు. బుధవారం ఆయన గృహంలో విలేకరులతో మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరానికిగాను పంచాయతీరాజ్ గ్రాంటుగా ఈ నిధులు విడుదలయ్యాయని చెప్పారు. వీటిలో బీటీ రోడ్ల కోసం తాడేపల్లిగూడెం మండలానికి రూ 1.78 కోట్లు, పెంటపాడు మండలానికి రూ 1.42 కోట్లు మొత్తం రూ.3.20 కోట్లు విడుదయ్యాని తెలిపారు.
ఎల్ అగ్రహారం నుంచి కుంచనపల్లికి, ఆరుగొలను నుంచి ఆరుగొలను శివారుకు, ఎల్.అగ్రహారం నుంచి అదే పంచాయతీ పరిధిలోని రాజీవ్ గృహకల్ప కాలనీ వరకు, కుంచనపల్లి నుంచి తాడేపల్లిగూడెంలో జువ్వలపాలెం వరకు, జాతీయ రహదారి నుంచి పెదతాడేపల్లి వరకు బీటీ రోడ్లను ఈ నిధులతో వేస్తామన్నారు. పెంటపాడు మండలంలోని ఎన్‌ఏ రోడ్డు నుంచి కె.పెంటపాడు అరుంధతిపేట వరకు, ఉప్పరగూడెం నుంచి వెస్టు విప్పర్రులోని సుఖాల దిబ్బవరకు, జట్లపాలెం-మౌంజీపాడు రోడ్డు నుంచి ఉమామహేశ్వరం వరకు, దర్శిపర్రు నుంచి తాడేపల్లిగూడెం మునిసిపల్ ఏరియా వరకు రోడ్లు నిర్మాణం త్వరలో ప్రారంభిస్తామన్నారు.
సీడీపీ మినిస్టర్ గ్రాంటు నుంచి తాడేపల్లిగూడెం మండలానికి రూ 23.25 లక్షలు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. బంగారుగూడెం, నీలాద్రిపురం, మారంపల్లి, దండగర్ర ఇందిరమ్మ కాలనీ, కుంచనపల్లిలో సీసీ రోడ్లు, నీలాద్రిపురంలో కమ్యూనిటీ హాలు, నందమూరు అంబేద్కర్ విగ్రహం వీధిలో సీసీ డ్రెయిన్ నిర్మాణం కోసం ఈ నిధులు వినియోగించనున్నట్లు చెప్పారు. ఇదే గ్రాంటు నుంచి పెంటపాడు మండలానికి రూ.23 లక్షలు మంజూరయ్యాయన్నారు. పెంటపాడులో సీసీ రోడ్లు, డ్రెయిన్లు , బి.కొందేపాడులో మెటల్ రోడ్డు, పెంటపాడు జూనియర్ కళాశాలకు బీటీ రోడ్డు, రావిపాడులో గ్రావెల్ రోడ్లు, ప్రత్తిపాడు రామాల యం వద్ద సీసీ రోడ్డు నిర్మాణానికి ఈ నిధులు వినియోగిస్తామన్నారు. పం చాయతీరాజ్ డీఈ ఎంవీ రమణమూర్తి, ఏఈలు శ్రీనివాసు, అప్పారావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement