సోనియా అయిష్టంగానే తెలంగాణకు ఓకే చెప్పారు: జైపాల్ రెడ్డి
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అయిష్టంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించారని కేంద్ర మంత్రి ఎస్.జైపాల్ రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనకు ఆమోదం తెలిపాక వ్యతిరేకత వస్తున్నా నిర్ణయంలో ఎలాంటి మార్పూ ఉండబోదని స్పష్టం చేశారు. హైదరాబాద్లో శనివారం జరిగిన రాజీవ్ సద్భావన సదస్సులో ఆయన మాట్లాడారు.
మతోన్మాదులు శ్రీరామచంద్రుని పేరును కూడా దుర్వినియోగం చేశారని ఆయన విమర్శించారు. కొన్ని పార్టీలకు ఎన్నికలు వస్తేనే రామమందిరం గుర్తుకు వస్తుందంటూ పరోక్షంగా బీజేపీని ఉద్దేశిస్తూ విమర్శించారు. మతం పేరిట మోసం చేస్తూ విభజించి పాలించాలని చూస్తున్నారని జైపాల్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ను నిర్మించినవారే ఏమీ తీసుకువెళ్లలేదని, సీమాంధ్రులు ఏమి చేస్తారని వ్యాఖ్యానించారు. తెలంగాణ, సీమాంధ్ర మధ్య సద్భావన పెంచాలని మంత్రి అన్నారు.