రాజమహేంద్రవరం రూరల్: నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వుతున్న రెండు జేసీబీలను అధికారులు సీజ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని కాతేరు ఇసుక ర్యాంపుపై శనివారం ఉదయం సబ్‌కలెక్టర్ విజయ్‌కృష్ణన్, రెవెన్యూ అధికారులతో కలసి దాడులు చేశారు. ఈ సందర్భంగా రెండు జేసీబీలతో పాటు 14 లారీలను, రెండు ట్రాక్టర్లను సీజ్ చేశారు. సంబంధీకులపై కేసులు నమోదుకు పోలీసులను ఆదేశించారు. ర్యాంపులో కార్మికులతో మాత్రమే ఇసుక తవ్వాలని, యంత్రాలను వినియోగించరాదనే నిబంధనలున్నాయని అధికారులు తెలిపారు.
ఇసుక ర్యాంపుపై సబ్‌కలెక్టర్ దాడి
Published Sat, Apr 30 2016 10:26 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement
Advertisement