మిల్లుగుల్లాలు! | Terms letter to the Commissioner | Sakshi
Sakshi News home page

మిల్లుగుల్లాలు!

Published Fri, Nov 27 2015 2:33 AM | Last Updated on Sun, Sep 3 2017 1:04 PM

Terms  letter to the Commissioner

నిబంధనలు ఒప్పుకోవంటున్న  అధికారులు కమిషనర్‌కు లేఖ
  నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న మిల్లర్లు ఈ ఏడాది ఆడవలసిన ధాన్యం
 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం విలువ: రూ.350 కోట్లు
 మిల్లులకు చెల్లింవలసిన చార్జీలు రూ.37.50కోట్లు
 ఒక్కొక్క మిల్లునుంచి కోరుతున్న గ్యారంటీ మొత్తం : సామర్థ్యం ప్రకారం నిర్ణయం
 మిల్లింగ్‌కు క్వింటాకు చెల్లిస్తున్నది : రూ 15 మిల్లర్లు  ఇస్తామంటున్న గ్యారంటీ
 ఏక మొత్తంగా : రూ. 5 కోట్లు
 మిల్లింగ్ చార్జీలు  : రూ 37.50 కోట్లు
 మొత్తం గ్యారంటీవిలువ రూ.42.50 కోట్ల లోపు
 విజయనగరం కంటోన్మెంట్:
గత ఏడాది ధాన్యం కొనుగోలు, మిల్లింగ్ విషయం లో నడచిన అక్రమాల పర్వం దాటుకుని ఈ ఏడాది పారదర్శకంగా కొనుగోళ్లు చేపడతామంటున్న అధికార యంత్రాం గానికి ఆదిలోనే మిల్లర్ల నుంచి కొంత వ్యతిరేకత వస్తోంది. పౌరసరఫరాల శాఖ ఈ ఏడాది కొత్తగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం మిల్లర్లు బ్యాంకు
 
 గ్యారంటీలు ఇవ్వాల్సి ఉంది. ఎంత ధాన్యం మిల్లింగ్ చేస్తే అంతే విలువ గల మొత్తాన్ని బ్యాంకు గ్యారంటీగా ఇవ్వాలి.  అంటే దాదాపు ధాన్యం కొనుగోలు చేసి మళ్లీ మిల్లింగ్ చేసినట్టు లెక్క.  అక్రమాలకు ఊతమివ్వకుండా శాఖా పరంగా ఈ చర్యలు తీసుకున్నారు. అయితే మిల్లర్లు మాత్రం అలా డిపాజిట్ చేసేందుకు ఇబ్బందులున్నాయని ఏకమొత్తంగా రూ. 5కోట్లు ఇస్తామని చెబుతున్నారు. ఈ ఏడాది దాదాపు 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ చేసే అవకాశం ఉందని అంచనా.  మిల్లర్లకు ఇచ్చే ధాన్యం విలువ రూ. 350 కోట్లు పైనే ఉంటుంది.
 
 ప్రస్తుతం క్వింటా ధాన్యం ఆడేందుకు ప్రభుత్వం రూ.15 చెల్లిస్తోంది. ఆ లెక్కన మిల్లర్లకు 2.50 లక్షల మెట్రిక్ టన్నులు ఆడేందుకు రూ. 37.50 కోట్లు చెల్లించాలి.  ఈ  కమీషన్ కూడా అట్టేపెట్టుకుని ఆఖర్లో లెక్కలు తేలాక ఇవ్వండనీ చెబుతున్నారు. దీనిపై నిర్ణయం తీసుకోలేని జాయింట్ కలెక్టర్ బి రామారావు పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు మిల్లర్ల అభ్యర్థనను పంపించారు. గత ఏడాది 2.80లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన అధికారులు రూ. 450 కోట్ల వరకూ వెచ్చించారు.
 ఈ ఏడాది కూడా అంతే మొత్తాన్ని వెచ్చించనున్నారు. పౌరసరఫరాల శాఖ నిబంధనల ప్రకారం ధాన్యం ధరకు నూరు శాతం  బ్యాంకు  గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది.
 
  కానీ ఇప్పుడు మిల్లర్ల అసోసియేషన్ మాత్రం రూ 5 కోట్ల డిపాజిట్‌తో పాటు మిల్లింగ్ చార్జీలను మినహాయించుకోవాలని కోరుతోంది. దీనిని బట్టి చూస్తే మొత్తం 45 కోట్ల లోపు గ్యారంటీ కింద ఉంటుంది.   అయితే  రూ.360 కోట్ల విలువైన ధాన్యానికి రూ.42.5కోట్ల   డిపాజిట్‌గా ఎలా స్వీకరిస్తామని అధికారులు అంటున్నారు. ఈనెలలోనే ధాన్యం సేకరించాల్సి ఉండగా వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో రైతులు ధాన్యం తూర్పారబట్టడం లేదు. వాతావరణం అనుకూలిస్తే వెంటనే ధాన్యం విక్రయాలకు రైతులు సిద్ధపడతారు. ఈ నేపథ్యంలో బ్యాంకు గ్యారంటీలు, అగ్రిమెంట్లు అనేవి ఇంకా ఓ కొలిక్కి రాలేదు. దీనిపై మిల్లర్లు మల్లగుల్లాలు పడుతుండడంతో ధాన్యం సేకరణ సకాలంలో ప్రారంభమవుతుందో ?లేదో ? అన్న అనుమానాలను రైతులు వ్యక్తం చేస్తున్నారు.  
 
 ఏకమొత్తం కాదు వ్యక్తిగతంగా బ్యాంకు గ్యారంటీలు ఇవ్వాల్సిందే!
 జిల్లాలో ఖరీఫ్‌లో సేకరించే ధాన్యాన్ని మిల్లింగ్ చేసేందుకు మిల్లర్లు వ్యక్తిగత బ్యాంకు గ్యారంటీలు ఇవ్వాల్సిందే. అసోసియేషన్ తరఫున ఏకమొత్తంగా గ్యారంటీలు ఇస్తే పనికి రాదు. ప్రభుత్వ కొత్త నిబంధనల ప్రకారం నూరు శాతం బ్యాంకు గ్యారంటీలను చెల్లించాల్సిందే. దీంతో పాటు ఎంఓయూ అగ్రిమెంట్లు కూడా మిల్లర్లు విడిగానే ఇవ్వాల్సి ఉంది.
                                                                - ఎం గణపతిరావు, జిల్లా మేనేజర్, పౌరసరఫరాల సంస్థ, విజయనగరం.
 
 మిల్లింగ్ చార్జీలతో పాటు రూ.5కోట్లు ఇస్తాం
 ఈ ఏడాది మిల్లింగ్‌కు వ్యక్తిగత బ్యాంకు గ్యారంటీలకు సంబంధించి అన్ని మిల్లులకూ కలిపి రూ.5కోట్లు ఇస్తామని జేసీ ద్వారా కమిషనర్‌కు విన్నవించాం. దీంతో పాటు మిల్లింగ్ చార్జీల కింద మిల్లింగ్ పూర్తయ్యేనాటికి దాదాపు రూ.37 కోట్లు వచ్చే అవకాశముంది. ఈ మొత్తాన్ని కూడా డిపాజిట్ కింద ప్రభుత్వాన్ని ఉంచుకోమన్నాం. గత ఏడాది ఏడాది చేసిన 2.80లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం  మిల్లింగ్ చార్జీలు రూ.25 కోట్లను మాత్రం ఇచ్చేయాలని కోరాం.  బ్యాంకుల అప్పులతో మిల్లర్లు చాలా వెనుకబడి ఉన్నారు. ఏ మిల్లరు తప్పు చేసినా సంబంధిత ధాన్యం మరో మిల్లుకు తరలిస్తామని చెప్పాం. తమ విజ్ఞప్తిని పరిశీలనలోకి తీసుకోవాలని   జేసీకి విన్నవించాం. ఇంకా ధాన్యం సేకరణకు సమయమున్నందున కమిషనర్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం.
                                                                                                 - శివ, ైరె స్‌మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement