అనకాపల్లి టౌన్, న్యూస్‌లైన్: భారతీయ స్టేట్ బ్యాంకు జోనల్ స్థాయి సాంస్కృతిక, క్రీడల సమ్మేళనం ఆది వారం రాత్రితో ముగిసింది. లైట్ మ్యూజిక్ పోటీల్లో విన్నర్‌గా విశాఖపట్నానికి (అడ్మినిస్ట్రేషన్) చెందిన కె.స్రవంతి, రన్నర్‌గా అనకాపల్లి (మెయిన్ బ్రాంచి)కి చెందిన ఎం.వి.ఎన్.అప్పారావులు నిలిచారు. మోనో యాక్షన్ పోటీల్లో పి.మోహన్‌దాస్ (పాతపట్నం) విన్నర్‌గాను, ఎస్.రవికుమార్ రన్నర్‌గాను నిలిచారు. ఫ్యాన్సీ డ్రెస్ విభాగంలో విజయనగరం బ్రాంచికి చెందిన ఎ.శ్రీనివాసరావు విన్నర్‌గా ను, విశాఖపట్నం పోర్టు బ్రాంచికి చెం దిన డి.రమణబాబు యాదవ్ రన్నర్‌గాను గెలుపొందారు.
ఎలుక్యూషన్ (తెలుగు ) విన్నర్‌గా (పార్వతీ పురం-ఏడీబీ) జి.సిహెచ్. బా బు, రన్నర్‌గా విశాఖపట్నం పో ర్టు బ్రాంచి ఎ.వి.ఎన్.నూకరాజులు విజయం సాధించారు. ఇంగ్లిష్ ఎలుక్యూషన్‌లో కె.ఎ.ఆర్.వర్ధని (నర్సీపట్నం-ఏడీబీ) విన్నర్‌గాను, కె. ఉమామహేశ్వరరావు (అనకాపల్లి మె యిన్ బ్రాంచి) రన్నర్‌గాను గెలిచారు. క్విజ్‌లో గోపాలపట్నం బ్రాంచ్ ఎం. వి.ఎన్.శర్మ, ఎం.ప్రదీప్‌కుమార్, కె. వి.వి.ఎస్. సతీష్ విన్నర్‌లుగాను, వి శాఖపట్నం పోర్టు బ్రాంచ్ ఎ.వి.ఎన్.నూకరాజు, డి.రమణబాబు, డి.భరద్వాజ్ రన్నర్‌లుగా నిలిచారు.
పితృవనం నాటికలో బెస్ట్ ప్రొడక్షన్, డెరైక్షన్‌గా విశాఖపట్నం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీ స్, బెస్ట్ ప్రొడక్షన్‌గా ద్వితీయ స్థానం లో రేపేంది నాటికలో శ్రీకాకుళం మొ యిన్ బ్రాంచ్, ఉత్తమ నటులుగా సు ధాకర్, అనీషా, బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్‌గా వేప తిమ్మయ్య, ఉత్తమ హాస్యనటుడిగా పి.మోహన్‌దాస్ (శ్రీకాకుళం)ను న్యాయనిర్ణేతలు ఎంపిక చేశా రు. ఎస్‌బీఐ అనకాపల్లి చీఫ్ మేనేజర్ ఎం.సి.వి. శేషకుమార్, డిజిఎస్ జె.పి.శర్మ, ఎస్‌బీఐ స్టాఫ్ యూనియన్ ైెహ దరాబాద్ సర్కిల్ వైస్ ప్రెసిడెంట్ వి. శ్రీనివాస్, ఏజీఎస్‌లు ఎన్. సాంబశివరావు, నరేంద్రకుమార్ చేతుల మీదు గా బహుమతులు అందజేశారు.
ముగిసిన స్టేట్ బ్యాంక్ క్రీడా సమ్మేళనం
Published Tue, Dec 31 2013 2:02 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 AM
Advertisement
Advertisement