సాగునీటిని చేపల చెరువులకు వాడడం నేరం : కలెక్టర్
తోటపల్లిగూడూరు, న్యూస్‌లైన్: వరి పంటకు సరఫరా అయ్యే సాగునీటిని చేపల చెరువులకు వాడడం నేరమని కలెక్టర్ శ్రీకాంత్ తెలిపారు. కోడూరు కాలువ ఆయకట్టు పరిధిలోని కోడూ రు, ఈదూరు, మాచర్లవారిపాళెం, సౌ త్‌ఆములూరు గ్రామాల రైతులు తమ కు నీటి పారుదలలో ఎదురవుతున్న ఇబ్బందులను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కలెక్టర్ మంగళవారం సౌత్‌ఆములూరులో కోడూరు కాలువను పరిశీలించారు.
రైతులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. కోడూ రు కాలువలో గుర్రెపుడెక్క, పిచ్చి మొ క్కలు, పాచి వంటి వాటితో సాగునీరు సక్రమంగా పారడంలేదని సమస్యను పరిష్కరించాలంటూ రైతులు కలెక్టర్‌ను కోరారు. పైభాగంలో ఉన్న చేపల సాగు రైతులు మోటార్లు పెట్టి నీటిని తోడేస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్ వ్యవసాయానికి అందించే సాగునీటిని చేపల చెరువులకు మళ్లించడం తగదన్నారు. అలాం టి రైతులపై తగిన చర్యలు తప్పవన్నా రు. నిధులు అందుబాటులో లేని కారణంగా వెంటనే పంట కాలువల్లో పూడికతీత పనులు చేపట్టడం సాధ్యం కాదని కలెక్టర్ స్పష్టం చేశారు. వ్యవసాయ సీజ న్ ముంచుకొస్తున్న నేపథ్యంలో రైతులే పంట కాలువల్లో పూడికతీత పనులను చేపట్టాలన్నారు. రైతులను చైతన్యపరిచేందుకు గ్రామసభలను నిర్వహించాలని ఇరిగేషన్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆయన వెంట ఇరిగేషన్ ఎస్‌ఈ కోటేశ్వరరావు, ఈఈ శ్యాంసుం దరరావు, డీఈ వెంకటసుబ్బయ్య, ఏఈ విజయభాస్కర్‌రెడ్డి, తహశీల్దార్ మేరీకుమారి,ఆర్‌ఐ రాజేష్, వీఆర్‌ఓ రమణయ్య ఉన్నారు.
కాలువలను పరిశీలించిన కలెక్టర్
నెల్లూరురూరల్: మండలంలోని అల్లీపురం, నారాయణరెడ్డిపేట వద్ద ఉన్న ఇరిగేషన్ కాలువలను మంగళవారం కలెక్టర్ శ్రీకాంత్ పరిశీలించారు. కాలువల్లో గుర్రపుడెక్క ఉండడంతో రైతులు గతంలో పలుమార్లు ఇరిగేషన్ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ నేపథ్యంలో కాలువల్లో గుర్రపుడెక్క తొలగింపునకు నిధులు కేటాయించాల్సిందిగా ఇరిగేషన్‌శాఖ అధికారులు కలెక్టర్‌కు నివేదికలు పంపడంతో స్పం దించిన ఆయన కాలువలను పరి శీలించారు.
అల్లీపురంలోని కోడూరుకాలువ, నారాయణరెడ్డిపేట వద్ద జాఫర్‌సాహె బ్ కాలువలను కలెక్టర్ పరిశీలించారు. ప్రస్తుత రబీ సీజన్‌కు సోమశిల నీటిని ఈ కాలువలకు వదులుతున్న దృష్ట్యా నీటి పారుదలపై ఇరిగేషన్‌శాఖ అధికారులతో కలెక్టర్ చర్చించారు. గుర్రపుడెక్క తొలగింపునకు నిధుల కేటాయిం పు లేదని రైతులే కమిటీలుగా ఏర్పడి స్వచ్ఛందంగా తొలగించుకోవాలని రైతులకు సూచించారు. ఇరిగేషన్ ఎస్‌ఈ కోటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కేశవరావు, ఏఈ విజయభాస్కర్‌రెడ్డి ఉన్నారు.
సదరన్ చానల్‌ను
పరిశీలించిన కలెక్టర్
బుచ్చిరెడ్డిపాళెం(రూరల్): రెండో పంట కు సాగునీరు సక్రమంగా అందడం లేదంటూ రైతులు చేసిన ఫిర్యాదు మేరకు కలెక్టరు శ్రీకాంత్ మంగళవారం పెనుబల్లి సమీపంలోని సదరన్ చానల్‌ను పరిశీలించారు. కాలువలో పాచి, గుర్రపు డెక్క అధికం కావడం వల్ల నీరు సక్రమంగా పారడం లేదని రైతులు కలెక్టరుకు వివరించారు. దీనికి తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టరు అధికారులను, రైతులను ప్రశ్నించారు.
ప్రతి ఏటా నీరు విడుదలకు ముందు కాలువల్లో పాచి, గుర్రపుడెక్క తొలగించేవారని, రెం డేళ్లుగా తొలగించలేదని తెలిపారు. నీటిపారుదల శాఖ, రైతులతో సంబంధం లేకుండా లోపభూయిష్టంగా ఉపాధి హామీ పనులు చేపట్టారని వాటి వల్ల ఉపయోగం లేకుండా పోతుందని రైతులు వివరించారు. ఉపాధి పనులు చేసే కూలీలు తమకు కూలి గిట్టుబాటు కోసం తీసిన పాచి, గుర్రపు డెక్కను సమీపంలోనే వేయడం వల్ల అది మొ త్తం తిరిగి కాలువల్లోకి చేరుతుందని రైతు సంఘం నాయకుడు ముత్యాల గురునాథం కలెక్టరుకు వివరించారు.
కలెక్టరు స్పందిస్తూ కాలువలు మరమ్మతులు విషయమై ప్రభుత్వానికి నివేదికలు పంపామని, మూడేళ్ల నుంచి రైతులు శిస్తు కట్టడంలేదని ప్రతిపాదనలను వెనక్కు పంపారని చెప్పడంతో రైతులు అవాక్కయ్యారు. రైతులే మా ట్లాడుకుని పనులు చేసుకోవాలని కలెక్టరు సూచించారు. సదరన్ చానల్ కా లువ గట్లపై ఉన్న పూరిళ్లలోని వారిని మీకు స్థలం లేదా, కాలువ గట్టుపై ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారంటూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. నీటిపారుదల శాఖ ఎస్‌ఈ కోటేశ్వర రావు, ఈఈ కేశవ రావు, డీఈ శివప్రసాదు, ఏఈ ఆలి అహ్మద్, తహశీల్దారు వెంకటేశ్వర్లు, ఎస్సై శ్రీనివాసులు పాల్గొన్నారు.