సాక్షి, విశాఖపట్నం: స్థానిక బీచ్ రోడ్‌లో ఏర్పాటు చేసిన దాసరి నారాయణరావు, నందమూరి హరికృష్ణల విగ్రహాలను గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ వారు తొలిగించటం అన్యాయమనీ ఉత్తరాంధ్ర సినీ దర్శకుల సంఘం నిరసన చేపట్టింది. ఒకవేళ అనుమతులు లేకపోతే విగ్రహాలు నెలకొల్పి సుమారు ఆరు నెలల కావొస్తోంది జివిఎమ్‌సి వారు ఇన్నాళ్లు ఏం చేస్తున్నారనీ, ఉత్తరాంధ్ర సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు , దర్శకుడు యాదకుమార్ ప్రశ్నించారు.
సినీ రంగానికి వన్నె తెచ్చిన దర్శకుడు దాసరి గారి విగ్రహం తొలగించడం అంటే తెలుగు కళా రంగాన్ని అవమానించడమే అని సంఘ కార్యదర్శి, దర్శకుడు కారెం వినయ్ ప్రకాష్ అన్నారు. నాటక రంగ ప్రముఖుడు, రంగసాయి, నాటక సంఘం అధ్యక్షుడు ‘బాదంగీర్’ సాయి మాట్లాడుతూ...‘అత్యంత చిన్న స్థాయి నుండి ఎంతో ఉన్నత స్థాయికి వచ్చి, తెలుగు సినీ రంగంలో ఎంతో ఉన్నతమైన చిత్రాలు దర్శకత్వం వహించిన దాసరి గారి విగ్రహాన్ని ఉత్తరాంధ్ర సినీ దర్శకుల సంఘం ఆధ్వర్యంలో అన్ని అనుమతులతో త్వరలో నెలకొల్పుతామని’ తెలిపారు. ఉత్తరాంధ్ర దర్శకులు రమేష్, శివశ్రీ, గీతాలయ ప్రసాద్, రాకేష్ రెడ్డి, లోలుగు రాజశేఖర్ లతో పాటు ఉత్తరాంధ్రకు చెందిన సినీ, టీవీ నటీనటులు, దర్శకులు ధర్నాలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment