విజయనగరం క్రైం, న్యూస్‌లైన్ : జిల్లా పోలీసు శాఖలో ప్రక్షాళనకు రంగం సిద్ధమైంది. అపాయింట్‌డే తర్వాత తెలంగాణ కేడర్ ఆయా ప్రాంతాలకు వెళ్లనుండడంతో జిల్లాలో కీలకమైన పోస్టులు ఖాళీ కానున్నారుు. దీంతోపాటు పదేళ్లుగా షాడో నేత అడుగులకు మడుగులు ఒత్తిన వారి జాబితానూ గోప్యంగా సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి అనుకూలంగా పనిచేసిన వారందరి గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఎలాగోలా తప్పించుకోవాలన్న ఉద్దేశంతో ప్రాధాన్యం లేని పోస్టులకు వెళ్లిపోవడానికి వారు ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు భోగట్టా. మరోవైపు ఇటీవల జరిగిన పంచాయతీ, ఎంపీటీసీ, అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన పోలీసు అధికారులను సైతం ప్రాధాన్యం లేని పోస్టుల్లో వేసేందుకు చర్యలు ప్రారంభమైనట్లు విశ్వసనీయయ సమాచారం.
‘షాడో’ వెంటాడుతోంది...
గత పదేళ్లూ జిల్లా పోలీసు శాఖలోని కొందరు అధికారులు షాడో నేత చెప్పిందే వేదంగా పని చేశారు. షాడోనేతకు అధికారం లేకపోయినా... జిల్లా పోలీసు యంత్రాంగంపై ఆయన పెత్తనం ఎంత ఉండేదన్న విషయం బహిరంగ రహస్యమే. జిల్లాలోని ఏ పోలీసు అధికారి అయినా ఉద్యోగంలో చేరేముందు తప్పనిసరిగా షాడో నేత ఇంటికి వెళ్లి కలవాల్సిందే. లేదంటే ఉద్యోగం చేయడం కష్టమే. షాడోనేత మాటకు తలొగ్గని అధికారులను ఇబ్బందులకు గురి చేసేవారు. ఇందుకు గతంలో ఇక్కడ ఎస్పీగా పని చేసిన నవీన్‌గులాఠీ ఉదంతమే ఉదాహరణ. నవీన్‌గులాఠీ సమయంలో జిల్లాలో హోంగార్డు నియామకాలు చేపట్టారు.
అరుుతే తాను చెప్పిన వారికి ఉద్యోగాలు ఇవ్వలేదన్న నెపంతో షాడోనేత తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి గులాఠీని నల్గొండకు బదిలీ చేరుుంచారన్న విమర్శలు అప్పట్లో గుప్పుమన్నారుు. అదే విధంగా జామి ఎస్సైగా పని చేసిన ఎస్.శ్రీనివాస్.. పాతభీమసింగి సమీపంలో రోడ్డు వెడల్పులో భాగంగా కొన్ని బడ్డీలను తొలగించారు. ఇందులో భాగంగా షాడోనేత అనుచరుడికి చెందిన బడ్డీని కూడా తొలగించారు. అరుుతే ఈ విషయంలోనూ షాడోనేత జోక్యం చేసుకున్నారు. తాను చెప్పినా వినిపించుకోకుండా బడ్డీ తొలగించారన్న అక్కసుతో ఒక పోలీస్ అధికారిపైనే.. ఉన్నతాధికారులను ఉసిగొల్పి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు బనారుుంచారు. అంతటితో ఆగకుండా ఎస్సై శ్రీనివాస్‌ను వేరే ప్రాంతానికి బదిలీ చేయించారు. అధికార పార్టీ నాయకులు ఆగడాలు.. ముఖ్యంగా షాడోనేత అరాచకాల వల్ల జిల్లాలో పని చేయూలంటేనే అధికారులకు వణుకుపుట్టేది.
ముఖ్యంగా జిల్లా కేంద్రంతోపాటు, చీపురుపల్లి నియోజకవర్గంలో పని చేయూలంటేనే పోలీసు అధికారులు భయపడేవారు. చేసేదిలేక అప్పట్లో చాలామంది షాడోనేత ఆదేశాలకు తలొగ్గి, అందుకనుగుణంగా పని చేశారు. అధికార పార్టీ నాయకులు చెప్పిన వారందరిపైనా అక్రమ కేసులు బనారుుంచారు. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులే టార్గెట్‌గా పని చేశారు. అరుుతే ఇప్పుడు ప్రభుత్వం మారడంతో.. అప్పట్లో షాడోనేతకు అనుగుణంగా పని చేసిన పోలీసు అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. వారందరి నీ ప్రాధాన్యం లేని పోస్టుల్లోకి పంపించేందుకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
పోలీస్ శాఖలో ప్రక్షాళన!
Published Fri, May 23 2014 2:43 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement