'జేసీ దివాకర్‌రెడ్డికి త్వరలో షోకాజ్ నోటీసు' | We Will Serve Show Cause Notice to JC Diwakar Reddy, says Digvijay Singh | Sakshi
Sakshi News home page

'జేసీ దివాకర్‌రెడ్డికి త్వరలో షోకాజ్ నోటీసు'

Published Fri, Dec 13 2013 7:20 PM | Last Updated on Sat, Sep 15 2018 2:28 PM

'జేసీ దివాకర్‌రెడ్డికి త్వరలో షోకాజ్ నోటీసు' - Sakshi

'జేసీ దివాకర్‌రెడ్డికి త్వరలో షోకాజ్ నోటీసు'

హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే తమ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తానని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఇచ్చిన మాటను నిలుపుకోవాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ కోరారు. తెలంగాణ ఏర్పాటయితే తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తానని కేసీఆర్ అన్న మాటలను ఆయన గుర్తు చేశారు.

తెలంగాణ కాంగ్రెస్ నేతలతో కలిసి శుక్రవారం సాయంత్రం గాంధీభవన్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబుపై అడిగిన ప్రశ్నకు దిగ్విజయ్ వ్యంగ్య ధోరణిలో స్పందించారు. చంద్రబాబు అంటే తనకెంతో గౌరవం ఉందంటూనే, విభజన విషయంలో ఆయనేం మాట్లాడుతున్నారో తనకు అర్థం కావడం లేదని చమత్కరించారు.   

తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డికి త్వరలో షోకాజ్ నోటీసు ఇవ్వనున్నట్టు  దిగ్విజయ్ సింగ్ తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన పదవికి రాజీనామా చేసి, మరొకరికి అవకాశం కల్పిస్తే మంచిదని జేసీ దివాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement