హైదరాబాద్: ఓ యువకుడు రాజ్భవన్ ఎదుటే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శుక్రవారం మధ్యాహ్నం సంభవించింది. తనపై తరచు వేధింపులకు దిగుతున్న సీఐపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ నరసింహన్ కు విజ్ఞప్తి చేయటానికి వెళ్లిన ఆ యువకుడ్ని పోలీసులు అడ్డుకోవడంతో ఈ దారుణం చోటు చేసుకుంది. గత కొంతకాలంగా సీఐ తనను వేధిస్తున్నాడంటూ కడపకు చెందిన పవన్ కుమార్ గవర్నర్ కలిసేందుకు యత్నించాడు. ఈ క్రమంలోనే అతన్ని పోలీసులు అడ్డుకున్నారు.
తనకు న్యాయం చేయాల్సిదింగా గవర్నర్ ను కలవడానికి వస్తే పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించాడు. దీనిలో భాగంగానే అతని వెంట తెచ్చుకున్న విషాన్ని తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం ఆ యువకుని పరిస్థితి విషమంగా ఉంది. అతన్నివేధింపులకు గురి చేసిన సీఐకు సంబంధించిన తదితర వివరాలు తెలియాల్సి ఉంది.