3 రోజులపాటు జగన్‌ లండన్‌ పర్యటన | Ys Jagan london tours for 3 days | Sakshi
Sakshi News home page

3 రోజులపాటు జగన్‌ లండన్‌ పర్యటన

Published Sat, Oct 28 2017 2:49 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

Ys Jagan london tours for 3 days - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రోజుల పర్యటనకోసం శనివారం ఉదయం లండన్‌ వెళ్లనున్నారు. నవంబర్‌ ఆరోతేదీనుంచి ప్రారంభం కానున్న ‘ప్రజా సంకల్పం’ పాదయాత్ర దాదాపు ఎనిమిది నెలల పాటు కొనసాగనున్న విషయం తెలిసిందే. జగన్‌ పెద్ద కుమారై వైఎస్‌ హర్ష ప్రతిష్టాత్మక లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో విద్యాభ్యాసం చేస్తున్న విషయం విదితమే. పాదయాత్ర మొదలయ్యాక లండన్‌ వెళ్లేందుకు వీలుపడదు కాబట్టి జగన్‌ శనివారం బయలుదేరి కుమార్తె వద్దకు వెళ్లనున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement