ల్యాండ్ బ్యాంక్‌తో రూ.500 కోట్లు: బీఎస్‌ఎన్‌ఎల్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని మొబైల్ సర్వీసులందజేసే బీఎస్‌ఎన్‌ఎల్ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.500 కోట్ల ఆదాయం ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఉన్న 82 స్థలాల ద్వారా ఈ స్థాయి ఆదాయం సాధించాలని బీఎస్‌ఎన్‌ఎల్ యోచిస్తోంది. అంతేకాకుండా మొబైల్ సర్వీసులందజేసే ఇతర కంపెనీలతో ఇంట్రా-సర్కిల్ రోమింగ్ ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా 75వేలకు పైగా ఉన్న మొబైల్ టవర్ల ద్వారా కూడా ఆదాయం ఆర్జించాలని భావిస్తోంది. దీంతో పాటు శిక్షణా కేంద్రాలు, ఏడు టెలికాం ఫ్యాక్టరీల ద్వారా ఆదాయం సాధించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
సంస్థ టర్న్ అరౌండ్ ప్రణాళికలను బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు... ఇటీవల టెలికం మంత్రి రవి శంకర ప్రసాద్‌కు ఇచ్చిన ప్రజంటేషన్‌లో వివరించారు.