సిస్టమాటిక్ విత్డ్రాయల్స్పై పన్నులుంటాయా? | dheeraj kumar special colum | Sakshi
Sakshi News home page

సిస్టమాటిక్ విత్డ్రాయల్స్పై పన్నులుంటాయా?

Published Mon, Aug 1 2016 1:37 AM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM

సిస్టమాటిక్ విత్డ్రాయల్స్పై పన్నులుంటాయా?

సిస్టమాటిక్ విత్డ్రాయల్స్పై పన్నులుంటాయా?

నేను ఎల్‌ఐసీ మనీబ్యాక్ ప్లాన్(న్యూ బీమా గోల్డ్)ను రూ.10 లక్షలకు తీసుకున్నాను. ఏడాదికి రూ.34,464 చొప్పున ఐదేళ్ల పాటు ప్రీమియమ్‌లు చెల్లించాను. గత ఏడాది రూ. లక్ష రూపాయిల తొలి మనీ బ్యాక్ తీసుకున్నాను. ఈ ప్లాన్ నుంచి వైదొలగాలనుకుంటున్నాను. దీనికి బదులుగా రూ. కోటి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను, రూ.15 లక్షలకు ఫ్యామిలీ ఫ్లోటర్ మెడికల్ ఇన్సూరెన్స్‌ను  తీసుకోవాలనుకుంటున్నాను. ఈ ప్లాన్‌కు ఏడాదికి ప్రీమియమ్ రూ.12,000-13,000 రేంజ్‌లో(పొగ తాగే వ్యక్తికి-నాకు పొగ తాగే అలవాటు ఉంది) ఉంటుందని అంచనా. నేను పనిచేసే కంపెనీ అందించే వైద్య బీమా మినహా ఇతర మెడికల్ ఇన్సూరెన్స్ నాకు లేదు. ఎల్‌ఐసీ మనీ బ్యాక్ పాలసీని సరెండర్ చేయాలని నేను తీసుకున్న నిర్ణయం సరైనదేనా ? తగిన సూచనలివ్వండి.
- భవానీ శంకర్, తిరుపతి

 మీరు మంచి నిర్ణయమే తీసుకున్నారు. ఎల్‌ఐసీ న్యూ బీమా గోల్డ్ అనేది బీమా, పెట్టుబడి కలగలసిన పాలసీ. మనీ బ్యాక్ పాలసీలు ఎండోమెంట్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ల్లాంటివే. పాలసీ అమల్లో ఉన్న కాలంలో ఇవి పాక్షికంగానే సర్వైవల్ బెనిఫిట్స్‌ను ఇస్తాయి. ఇవి ఖరీదైన పాలసీలు. తగినంత బీమాను, సరైన రాబడులను ఈ పాలసీలు అందించలేవు. ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే మీరు ఈ పాలసీ నుంచి వైదొలగడం సరైన నిర్ణయమే. పాలసీ టర్మ్, మీరు చెల్లించిన ప్రీమియమ్‌లను బట్టి ఈ పాలసీ సరెండర్ విలువ ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం సదరు బీమా సంస్థను సంప్రదించి వివరాలు తెలుసుకోండి. ఇక టర్మ్ ఇన్సూరెన్స్ కోసం. మ్యాక్స్ ఆన్‌లైన్ టర్మ్ ప్లాన్, ఏజియన్ రెలిగేర్ ఐటెర్మ్ ప్లాన్‌లను పరిశీలించవచ్చు.

ఈ రెండు కంపెనీలకు మంచి క్లెయిమ్ సెటిల్మెంట్ చరిత్ర ఉంది. వీటి ప్రీమియమ్‌లు కూడా తక్కువే. మీ వయస్సుకు ఎంత ప్రీమియమ్‌లు చెల్లించాల్సి ఉంటుందో తెలుసుకొని, మీ బడ్జెట్‌కు అనుగుణంగా ఉన్నదానిని ఎంచుకోండి. మీ ఆరోగ్యానికి సంబంధించిన సమస్త వివరాలను అందజేయండి. క్లెయిమ్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉంటాయి. ఇక ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ కోసం ఐసీఐసీఐ లొంబార్డ్ ఐహెల్త్, రెలిగేర్ హెల్త్‌కేర్ ప్లాన్‌లను పరిశీలించవచ్చు. ఈ మనీబ్యాక్ ప్లాన్‌ను సరెండర్ చేయడం వల్ల మీకు నష్టాలు వస్తాయి.  మీరు చెల్లించిన ప్రీమియమ్‌ల కన్నా, మీరు పొందే సరెండర్ విలువ తక్కువగా ఉన్నప్పటికీ,  ఈ ప్లాన్ నుంచి వైదొలగడమే ఉత్తమం. ఇలాంటి మంచి రాబడులు రాని ఇన్వెస్ట్‌మెంట్ నుంచి బయటకు రావాలని నిర్ణయం తీసుకోవడం సరైనదే.

 నేను రూ.20 లక్షల వరకూ ఇన్వెస్ట్ చేయగలను.  ఈ సొమ్ములు నాకు మరో ఐదేళ్లపాటు అవసరం లేదు. ఐదేళ్ల తర్వాత నెలకు రూ.20,000 లేదా మూడు నెలలకు రూ.60వేల చొప్పున విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉండాలి. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమని మిత్రులు సలహా ఇస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి ఐదేళ్ల తర్వాత సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్(ఎస్‌డబ్ల్యూపీ) ద్వారా సొమ్ములు ఉపసంహరించుకోవాలనేది వారి సలహా.  ఇలా ఎస్‌డబ్ల్యూపీల ద్వారా విత్‌డ్రా చేసుకునే వాటిపై నేను ఏమైనా పన్ను చెల్లించాల్సి ఉంటుందా ? వివరంగా తెలియజేయండి.   - లీలాజగన్, విజయవాడ

 మీరు ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ ఏ కేటగిరీకి చెందినవి అన్న విషయాన్ని బట్టి పన్ను విధింపు ఆధారపడి ఉంటుంది. డెట్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్‌పై పన్నులు భిన్నంగా ఉంటాయి. సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్స్(ఎస్‌డబ్ల్యూపీ)కు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్(ఎఫ్‌ఐఎఫ్‌ఓ-ఫిఫో) పద్థతిని అనుసరిస్తారు. అంటే మొదటగా ఇన్వెస్ట్ చేసిన దానిని మొదటగా ఉపసంహరించుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి పన్ను సంబంధిత అంశాలకు ఫిఫో పద్ధతినే పరిగణనలోకి తీసుకుంటారు. ఇక మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశారనుకుందాం. ఏడాది తర్వాత ఈ యూనిట్లను విక్రయిస్తే వాటిపై వచ్చే లాభాలను దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు.

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌పై ప్రస్తుతానికి ఎలాంటి దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను లేదు. ఒక వేళ మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను కొనుగోలు చేసిన ఏడాదిలోపే విక్రయిస్తే వాటిపై వచ్చే రాబడులను స్వల్పకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. ఇది 15శాతంగా ఉంది. ఇక డెట్ మ్యూచువల్ ఫండ్స్ విషయానికొస్తే, మూడేళ్ల తర్వాత ఈ ఫండ్ యూనిట్లను విక్రయిస్తే, వాటిపై వచ్చే లాభాలను దీర్ఘకాలిక మూలధన లాభాలుగా వ్యవహరిస్తారు. 20 శాతం పన్ను(ఇండెక్సేషన్ ప్రయోజనంతో) చెల్లించాల్సి ఉంటుంది. మూడేళ్లలోపే డెట్ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను విక్రయిస్తే, వీటిపై వచ్చే రాబడులను స్వల్పకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. ఈ లాభాలను మీ ఆదాయానికి కలిపి మీ ఆదాయపు పన్ను శ్లాబ్‌ననుసరించి పన్ను విధిస్తారు. ఈ నిబంధనలు ఆధారంగా  మీ సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్స్‌పై పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను దృష్టిలో పెట్టుకొని మీ ఎస్‌డబ్ల్యూపీలను ప్లాన్ చేసుకోండి.

 నేను తీసుకున్న ఎల్‌ఐసీ జీవన్ సురక్ష వన్ ప్లాన్ వచ్చే ఏడాది జూన్‌లో మెచ్యూర్ అవుతోంది. ఈ పాలసీకి గాను ఏడాదికి రూ.20,000 చొప్పున ప్రీమియమ్‌లు చెల్లించాను. ఈ ప్లాన్‌ను నేను 2017, మేలో సరెండర్ చేస్తే. నేను ఏమైనా పన్ను చెల్లించాల్సి ఉంటుందా?
- ఆషఫ్,్ర సికింద్రాబాద్

ఎల్‌ఐసీ జీవన్ సురక్ష వన్ అనేది పెన్షన్ ప్లాన్. ఈ పెన్షన్ ప్లాన్‌లను సరెండర్ చేస్తే మీరు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పాలసీ వచ్చే ఏడాది జూన్‌లో మెచ్యూర్ అవుతోందంటున్నారు కదా. మెచ్యూర్ అయ్యే ఒక నెల ముందు ఈ పాలసీని సరెండర్ చేయడం సరైన నిర్ణయం కాదు. ఇలా చేస్తే మీకు భారీగా నష్టాలు వస్తాయి. సరెండర్ చేస్తే, మొత్తం కార్పస్‌లో మూడవ వంతుకు మాత్రమే పన్ను పోటు ఉండదు. మిగిలిన దానిని యాన్యుటీ కొనుగోలు కోసం వెచ్చించాలి. యాన్యుటీలు స్వీకరించినప్పుడు స్వీకరించిన వ్యక్తి పన్ను చెల్లించక తప్పదు. ఈ తరహా ప్లాన్‌ల్లో కచ్చితంగా వచ్చే సరెండర్ విలువ మీరు చెల్లించిన ప్రీమియమ్‌ల్లో 90 శాతానికి సమానంగా ఉంటుంది. తొలి ఏడాది చెల్లించిన ప్రీమియమ్‌ను మినహాయిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement