పతనం తాత్కాలికమే: జైట్లీ
మార్కెట్ల ధోరణిపై ప్రధాని మోదీతో సమాలోచన
న్యూఢిల్లీ: అంతర్జాతీయ పరిణామాలే సోమవారం నాటి దేశీ మార్కెట్ల భారీ పతనానికి కారణమని, ఇది క్షణికం, తాత్కాలికమైనదేనని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. భారత్ ఫండమెంటల్స్ పటిష్టంగానే ఉన్నాయన్నారు. ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నామని కస్టమ్స్, సెంృటల్ ఎక్సయిజ్, సర్వీస్ ట్యాక్స్ ఉన్నతాధికారుల సదస్సులో పాల్గొన్న సందర్భంగా జైట్లీ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రధాని నరేంద్రమోదీతో అరుణ్ జైట్లీ సమావేశమై స్టాక్ మార్కెట్ భారీ పతనంపై చర్చించారు.