సాక్షి, ముంబై: టీకాల తయారీలో (వ్యాక్సిన్లు) ప్రపంచ ప్రసిద్ధి పొందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత సైరస్ పూనవాలా సంపద కరోనా రాకతో వేగంగా పరుగులు పెట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మే చివరి నాటికి దిగ్గజ వ్యాపారవేత్తల సంపదపై కరోనా ప్రభావం ఏ మేరకు ఉందన్న వివరాలతో హరూన్ రీసెర్చ్ సంస్థ ఓ నివేదిక విడుదల చేసింది. ఈ నాలుగు నెలల కాలంలో సంపద అత్యంత వేగంగా వృద్ధి చెందిన భారత బిలియనీర్‌గా సైరస్ పూనవాలా మొదటి స్థానంలో ఉన్నారు.
అమెజాన్ జెఫ్ బెజోస్ తన సంపదను కరోనా కాలంలో రూ. 1.5 లక్షల కోట్ల మేర పెంచుకుని (14 శాతం వృద్ధి) ప్రపంచంలో నంబర్ 1 స్థానంలో ఉంటే.. ఈ విషయంలో సైరస్ పూనవాలా ప్రపంచంలో ఐదో స్థానంలో ఉన్నట్టు హరూన్ రీసెర్చ్ నివేదిక వివరించింది. టీకాల కంపెనీగా సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌కు ఉన్న బలమైన వ్యాపార సామర్థ్యాలే పూనవాలా సంపద పెరిగేందుకు దోహదపడుతున్నట్టు తెలిపింది. ఈ ఏడాది మే చివరికి సైరస్ పూనవాలా రూ. 1.12 లక్షల కోట్ల సంపదతో ప్రపంచంలో 86వ స్థానానికి చేరుకున్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. ఏకంగా 57 స్థానాలు ముందుకు వచ్చేశారు. నాలుగు నెలల్లోనే ఆయన సంపద విలువ 25 శాతం పెరగడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment