vaccine industry
-
తెలంగాణలో బయోఫార్మా దిగ్గజం భారీ పెట్టుబడులు..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బయోఫార్మా దిగ్గజం భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ (బీఎస్వీ) తాజాగా హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక ఇంజెక్టబుల్, టీకాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రూ. 200 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి కేటీ రామారావుతో మంగళవారం సమావేశమైన సందర్భంగా బీఎస్వీ ఎండీ సంజీవ్ నావన్‌గుల్ ఈ విషయాలు వెల్లడించారు. ఈ కేంద్రంలో మహిళల ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు, రేబిస్ టీకాలు, హార్మోన్లు మొదలైనవి ఉత్పత్తి చేయనున్నట్లు సంజీవ్ వివరించారు. ప్రపంచ టీకాల రాజధానిగా తెలంగాణ పేరొందిన నేపథ్యంలో.. జీనోమ్ వ్యాలీలో భారత్ సీరమ్స్ రాకను స్వాగతిస్తున్నట్లుగా ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగం పటిష్టతకు ఇది నిదర్శనమని, సంస్థకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన తెలిపారు. -
కోవిడ్ టీకాలకు.. రూ.750 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 టీకాలు, తత్సంబంధ ఉత్పత్తుల తయారీకి సంబంధించి దేశీ సంస్థలకు దాదాపు 100 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 750 కోట్లు) మేర రుణాలు సమకూరుస్తున్నట్లు ఎక్స్పోర్ట్–ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎగ్జిమ్ బ్యాంక్) డిప్యుటీ ఎండీ ఎన్ రమేష్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు ఆరు సంస్థలకు వీటిని అందిస్తున్నట్లు శుక్రవారమిక్కడ విలేకరుల సమావేశంలో ఆయన వివరించారు. హబ్‌గా హైదరాబాద్ నూతన ఆవిష్కరణలకు హైదరాబాద్ హబ్‌గా ఎదిగిందని రమేష్ ప్రశంసించారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి దశలో ఉన్న కొన్ని సంస్థలను గుర్తించి, నిర్దిష్ట పథకం కింద వాటికి కావాల్సిన తోడ్పాటు అందిస్తున్నామని ఆయన వివరించారు. ఇప్పటికే మూడు సంస్థలకు సుమారు రూ. 70–100 కోట్ల దాకా సమకూరుస్తున్నట్లు రమేష్ పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి సంస్థలు మరో పదింటిని పరిశీలిస్తున్నట్లు ఆయన వివరించారు. ఉభర్తే సితారే పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం మీద దేశవ్యాప్తంగా 30 సంస్థలకు, వచ్చే ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి సుమారు 100 కంపెనీలకు తోడ్పాటు అందించనున్నట్లు రమేష్ చెప్పారు. ప్రస్తుతం ఎగ్జిమ్ బ్యాంక్ రుణ పోర్ట్‌ఫోలియో దాదాపు రూ. 1.1 లక్ష కోట్లుగా (ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి) ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు 10 శాతం వృద్ధి నమోదు కాగలదని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి అందిన నిధుల ఊతంతో వచ్చే అయిదేళ్లలో దాదాపు 7 బిలియన్ డాలర్ల విలువ చేసే ఎగు మతి ప్రాజెక్టులకు నిధులు సమకూర్చాలని నిర్దేశించుకున్నట్లు రమేష్ వివరించారు. -
ఈ ఏడాది చివరికల్లా సాధారణ స్థితి
వాషింగ్టన్: లక్షలాది మంది అమెరికన్లకు కోవిడ్ వ్యాక్సిన్‌ని అందించడంలో అమెరికా తీవ్రంగా కృషి చేస్తుండడంతో ఈ యేడాది చివరికల్లా పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. మిచిగావ్, కలాంజూలోని ఫైజర్ వ్యాక్సిన్ తయారీ కేంద్రంలో ఆయన పర్యటించారు. కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచేందుకు కృషి చేయాలన్న బైడెన్, తమ ప్రభుత్వం వ్యాక్సిన్ సరఫరా పెంచేందుకూ, పంపిణీని క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. ఈ క్రిస్మస్ గత ఏడాది క్రిస్మస్కన్నా భిన్నంగా ఉండబోతోందన్న ఆశాభావాన్ని బైడెన్ వ్యక్తం చేశారు. వైరస్‌లో చాలా రకాలున్నాయని, పరిస్థితులు మారవచ్చునని బైడెన్ అన్నారు. వ్యాక్సిన్ రావడానికీ, దాన్ని అందరూ తీసుకోవడానికీ తేడా ఉందన్నారు. అది అందరికీ చేరే వరకు కృషి చేయాలని చెప్పారు. జూలై చివరి నాటికి 600 మిలియన్ మోతాదులకు మించి పంపిణీ చేస్తాం అన్నారు. అయితే ఇది మారవచ్చునని బైడెన్ అన్నారు. ప్రస్తుతం తీవ్రమైన శీతల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వ్యాక్సిన్ పంపిణీ ఆలస్యం అవుతోందని, అలాగే ఏం జరుగుతుందో వేచి చూడాలని ఆయన అన్నారు. మంచు తుపాన్లు, అతిశీతల వాతావరణ పరిస్థితుల వల్ల ఇప్పటి వరకు 60 లక్షల వ్యాక్సిన్ డోసుల పంపిణీ ఆలస్యం అయ్యిందన్నారు. ‘ఎప్పటికి ఈ సంక్షోభం ముగుస్తుందో నేను తేదీలు ప్రకటించలేను కానీ, సాధ్యమైనంత త్వరలో ఆరోజుని చూసేందుకు ప్రయత్నిస్తున్నాం’అని బైడెన్ చెప్పారు. ప్రజల ప్రాణాలను రక్షించేందుకు, ప్రజల జీవితాలను మెరుగు పరిచేందుకు ఈ ప్రభుత్వం సైన్స్‌ను అనుసరిస్తుందని బైడెన్ అన్నారు. -
అత్యంత వేగంగా టీకా పరిశోధనలు...
అహ్మదాబాద్, హైదరాబాద్, పుణే: కరోనా మహమ్మారిని అరికట్టే వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్న వేళ టీకా పురోగతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా సమీక్షించారు. శనివారం వరసగా మూడు నగరాల్లో టీకా తయారీ కేంద్రాలను సందర్శించారు. అహ్మదాబాద్‌లోని జైడస్ బయోటెక్ పార్క్, హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్, పుణే లోని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలకు వెళ్లా రు. అక్కడ శాస్త్రవేత్తలను కలుసుకొని మాట్లాడారు. వ్యాక్సిన్ ప్రయోగాలు, డోసుల ఉత్పత్తి, టీకా పంపిణీలో సవాళ్లను అధిగమించేలా జరుగుతున్న ఏర్పాట్లపై నేరుగా సమాచారాన్ని తెలుసుకోవడం కోసమే ప్రధాని మోదీ ఈ పర్యటన చేపట్టారని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. భారత్ దేశీయంగా రూపొందిస్తున్న జైకోవ్–డీ, కొవాగ్జిన్ టీకాలపై పరిశోధనలు అత్యంత వేగంగా సాగుతూ ఉండడం దేశానికే గర్వ కారణమని ప్రధాని పేర్కొన్నారు. వ్యాక్సిన్ ప్రజలందరికీ చేరేలా మెరుగ్గా పంపిణీ చేయడానికి పలు సూచనల్ని కూడా శాస్త్రవేత్తలను అడిగి ప్రధాని తెలుసుకున్నారు. ప్రధాని రాకతో శాస్త్రవేత్తల్లో ఉత్సాహం జైడస్ బయోటెక్ పార్కుకి ప్రధాని రాక అక్కడ శాస్త్రవేత్తల్లో నైతిక స్థైర్యాన్ని పెంచింది. కోవిడ్ వ్యాక్సిన్‌ను ప్రజలకి అందుబాటులోకి తేవాలన్న తమ లక్ష్యానికి ప్రధాని రాక ఎంతో స్ఫూర్తినిచ్చిందని ఆ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం జైకోవ్–డీ రెండో దశ ప్రయోగాల్లో ఉంది. వచ్చే ఏడాది మార్చి నాటికి ప్రయోగాలు పూర్తి చేసి ఏడాదికి 10 కోట్ల డోసుల్ని ఉత్పత్తి చేస్తామని జైడస్ క్యాడిలా చైర్మన్ పంకజ్ పటేల్ ఇప్పటికే ప్రకటించారు. సీరమ్ ఇన్స్టిట్యూట్లో అందరిలోనూ ఆశలు పెంచుతున్న ఆస్ట్రాజెనికా–ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిపి సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) కొవిషీల్డ్ ప్రయోగాలు చేస్తోంది. ఈ వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి అత్యవసర లైసెన్స్ మంజూరు కోసం అవసరమయ్యే ప్రక్రియ కొనసాగుతోందని ఆ సంస్థ సీఈఓ ఆదార్ పూనావాలా వెల్లడించారు. హైదరాబాద్ సందర్శన పూర్తయ్యాక మధ్యాహ్నం 3.20కి మోదీ పుణేకి బయల్దేరారు. సాయంత్రం గం.4.30కి పుణే విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడ్నుంచి 17 కి.మీ. దూరంలో సీరమ్ ఇన్స్టిట్యూట్కి హెలికాప్తర్లో వెళ్లారు. ఈ సంస్థ తయారు చేస్తున్న కొవిషీల్డ్ ప్రయోగాలను సమీక్షించారు. వ్యాక్సిన్ అభివృద్ధి, నిల్వ చేయడం వంటి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. సీరమ్ చైర్మన్ డాక్టర్ సైరస్ పూనావాలా, ఆయన కుమారుడు సంస్థ సీఈఓ అదార్ పూనావాలాలు ప్రధానికి వ్యాక్సిన్ పురోగతికి సంబంధించిన వివరాలు తెలిపారు. అక్కడ శాస్త్రవేత్తలు, ఇతర సిబ్బందితో కూడా ప్రధాని మాట్లాడారు. ‘‘సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో శాస్త్రవేత్తలతో చర్చలు బాగా జరిగాయి. వ్యాక్సిన్ పురోగతి, రాబోయే రోజుల్లో జరిగే పనుల గురించి వారు వివరించారు. టీకా తయారీ కేంద్రాన్ని కూడా పరిశీలించాను’’అని మోదీ ట్వీట్ చేశారు. సాయంత్రం 6 గంటల వరకు సీరమ్లోనే గడిపిన మోదీ 6.30కి ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. పీపీఈ కిట్‌లో ప్రధాని గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కి 20 కి.మీ. దూరంలో ఉన్న జైడస్ క్యాడిలా రీసెర్చ్ సెంటర్‌కు ప్రధాని పీపీఈ కిట్‌లో వెళ్లారు. శాస్త్రవేత్తలతో గంట సేపు సమావేశమయ్యారు. ‘‘జైడస్ బయోటెక్ పార్క్‌ని సందర్శించాను. దేశీయంగా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ ప్రయోగాల గురించి మరింత లోతైన సమాచారం కోసం స్వయంగా వెళ్లాను. అక్కడ శాస్త్రవేత్తల సమష్టి కృషి అభినందనీయం. కేంద్ర ప్రభుత్వం వారికి అన్ని విధాలా సహకరిస్తుంది’’అని మోదీ అహ్మదాబాద్ పర్యటన అనంతరం ట్వీట్ చేశారు. అక్కడ్నుంచి 11.40 గంటలకి హైదరాబాద్‌కి బయల్దేరారు. హకీమ్‌పేట వైమానిక స్థావరానికి చెందిన విమానాశ్రయంలో మధ్యాహ్నం ఒంటిగంటకు దిగిన ప్రధాని అక్కడ్నుంచి జినోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ సంస్థను సందర్శించారు. భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ సంయుక్తంగా రూపొందిస్తున్న కొవాగ్జిన్ టీకా పురోగతిపై సమీక్ష జరిపారు. వేసవి నాటికి పది వ్యాక్సిన్లు! జెనీవా: వచ్చే ఏడాది వేసవి ముగిసేవరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 కరోనా వ్యాక్సిన్లు రెడీగా ఉంటాయని ఐఎఫ్‌పీఎంఏ డైరెక్టర్ జనరల్ ధామస్ క్యూని అంచనా వేశారు. అయితే టీకాల ఆవిష్కర్తలకు పేటెంట్ రక్షణ దొరకాలన్నారు. ప్రస్తుతానికి ఫైజర్, మోడెర్నా, ఆస్ట్రాజెనికా టీకాలు క్లినికల్ట్రయిల్స్లో మంచి ఫలితాలు చూపుతున్నాయి. జాన్సన్ అండ్ జాన్సన్, నోవాక్స్, సనోఫి, జీఎస్కే, మెర్క్ లాంటి కంపెనీల టీకాలు సైతం క్రమంగా రేసులోకి వస్తాయని అంతర్జాతీయ ఫార్మా ఉత్పత్తిదారులు, సమాఖ్యల ఫెడరేషన్ అధినేత అంచనా వేశారు. పలు ఫార్మా, బయోటెక్ కంపెనీలు కరోనా టీకా అభివృద్ధి, తయారీపై చాలా మొత్తాలు వెచ్చించాయని తామస్ చెప్పారు. అందువల్ల కంపల్సరీ లైసెన్సింగ్ కోసం పేటెంట్ రక్షణ ఎత్తివేస్తే తప్పిదం చేసినట్లేనన్నారు. పేటెంట్ భద్రత లేకపోతే సరైన నిపుణత లేకుండా టీకాలు తయారు చేసే ప్రమాదం ఉందన్నారు. వ్యాక్సిన్లకు కంపల్సరీ లైసెన్సింగ్ తీసుకురావాలని డబ్లు్యటీవోలో భారత్, దక్షిణాఫ్రికా ఇటీవల ప్రతిపాదించాయి. కానీ ఈ ప్రతిపాదనను యూఎస్ సహా ధనిక దేశాలు తిరస్కరించాయి. బ్రిటన్‌లో టీకా పంపిణీకి మంత్రి లండన్: కరోనా టీకా పంపిణీ పర్యవేక్షణకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఒక మంత్రిని ప్రత్యేకంగా నియమించారు. ప్రస్తుతం వ్యాపార, పారిశ్రామిక, శక్తివనరుల మంత్రిగా ఉన్న నదీమ్ జహవిని ఆరోగ్యమంత్రిగా నియమించారు. దీంతో పాటు ఆయనకు కోవిడ్ వ్యాక్సిన్ బాధ్యతలను అప్పగించారు. వచ్చే వేసవి వరకు నదీమ్ ఈ పదవిలో ఉంటారని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. పది రోజుల్లో టీకా అందుబాటులోకి వస్తుందన్న వార్తల నేపథ్యంలో జాన్సన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. టీకా పంపిణీ పెద్ద బాధ్యతని అధికారులు హెచ్చరిస్తుండడంతో ఇందుకోసం ఏకంగా మంత్రినే నియమించారు. ముందుగా ఎన్హెచ్ఎస్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇచ్చే అవకాశాలున్నాయని సమాచారం. డిసెంబర్లో ఫైజర్ టీకా అందుబాటులోకి రానుంది. ఈ టీకాను అల్ప ఉష్ణోగ్రతల వద్ద దాచిఉంచాలి. అలాగే సరిపడా డోసులు అందుబాటులోకి తేవాల్సిఉంటుంది. ఇవన్నీ సక్రమంగా జరిగితేనే టీకా పంపిణీ విజయవంతం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. నదీమ్ నియామకానికి రాణి ఆమోదం తెలిపారు. అమెరికాలో బరిలోకి వైమానిక సేవలు వాషింగ్టన్: ఫైజర్ రూపొందిస్తున్న కోవిడ్ వ్యాక్సిన్‌ను దేశమంతా పంచేందుకు అమెరికా ఎయిర్‌లైన్స్ శుక్రవారం చార్టర్ విమానాలను రంగంలోకి దించింది. యూఎస్ఎఫ్డీఏ అనుమతి లభించిన తక్షణం టీకాను సరఫరా చేసేందుకు వీలుగా అమెరికా ఎయిర్‌లైన్స్ ఏర్పాట్లు చేస్తోంది. అనుమతులు లభిస్తే డిసెంబర్ రెండో వారం అనంతరం మాస్ ఇనాక్యులేషన్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. టీకాను సురక్షితంగా ఉంచేందుకు డ్రైఐస్ కావాల్సి ఉంటుంది. కానీ దీన్ని విమానాల్లో అనుమతించరు. టీకా కోసం నిబంధనల సవరణకు అనుమతుల కోసం ఎయిర్‌లైన్స్ చేసుకున్న దరఖాస్తును వైమానిక అ«థార్టీ ఎఫ్ఏఏ ఆమోదించింది. ఫైజర్ వ్యాక్సిన్‌ను –70 డిగ్రీల వద్ద స్టోర్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఫైజర్ డ్రైఐస్ కూర్చిన సూట్కేసుసైజు బాక్సులను సిద్ధం చేసింది. అలాగే, కంపెనీ అసెంబ్లీ కేంద్రాలవద్ద రిఫ్రిజిరేటెడ్ స్టోరేజ్ సైట్లను ఏర్పాటు చేస్తోందని వాల్‌స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. బ్రసెల్స్ నుంచి చికాగోకు టీకా రవాణా చేసేందుకు యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానాలను సిద్ధం చేసింది. అనుమతులు వచ్చిన తొలివారంలో 64 లక్షల డోసుల టీకాను పంపిణీ చేయాలని యూఎస్ఏ భావిస్తోంది. డిసెంబర్ 10న టీకాకు అనుమతులివ్వడంపై చర్చించేందుకు యూఎస్ఎఫ్డీఏ సమావేశం కానుంది. టీకా అత్యవసర వాడకానికి త్వరలో దరఖాస్తు ఎస్ఐఐ సీఈఓ ఆదార్ పూనావాలా వెల్లడి న్యూఢిల్లీ: కరోనా వైరస్ నియంత్రణకు ఆస్ట్రాజెనెకా–ఆక్స్ఫర్డ్ వర్సిటీ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ను ఇండియాలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) నిర్వహిస్తోంది. ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికిగాను రానున్న రెండు వారాల్లో డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేయనున్నట్లు ఎస్ఐఐ సీఈఓ ఆదార్ పూనావాలా శనివారం చెప్పారు. ఎమర్జెన్సీ యూజ్ లైసెన్స్ వచ్చిన తర్వాతే వ్యాక్సిన్ పంపిణీ సాధ్యమవుతుందన్నారు. ఇందుకోసం అవసరమైన డేటాను త్వరలో ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. ఆస్ట్రాజెనెకా–ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌ను తొలుత భారత్‌లో, అనంతరం ఆఫ్రికా దేశాల్లో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి మోదీ సీరం సంస్థను సందర్శించడం తమకు గొప్ప రోజు అని పేర్కొన్నారు. కొత్త కేసులు 41,000 న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 41,322 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 93,51,109కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 485 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,36,200కు చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య శనివారానికి 87,59,969కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 93.68 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 4,54,940గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 4.87% ఉన్నాయి. మరణాల శాతం 1.46గా ఉంది. ఈ నెల 27 వరకూ 13.82 కోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. శుక్రవారం 11,57,605 పరీక్షలు జరిపినట్లు తెలిపింది. మరణిస్తున్న వారిలో 70% మంది ఇతర దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారేనని చెప్పింది. టీకా పంపిణీకి ఆరోగ్య విభాగం సన్నద్ధం కోవిడ్–19 టీకా పంపిణీ, నిర్వహణపై కేంద్ర ఆరోగ్య శాఖతో భాగస్వామ్యం కలిగిన నిపుణుల కమిటీ చురుగ్గా ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కె.విజయ్ రాఘవన్ తెలిపారు. జాతీయ స్థాయి ఎన్నికల నిర్వహణ, సార్వత్రిక టీకా పథకం అమలు అనుభవాన్ని ఉపయోగించుకుంటూ ఆరోగ్య సేవల విషయంలో రాజీ పడకుండా టీకాను పంపిణీ చేస్తామన్నారు. -
ఏప్రిల్‌కల్లా ఆక్స్ఫర్డ్ టీకా
న్యూఢిల్లీ : ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ ఆస్ట్రాజెనికా వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి అందుబాటులోకి వస్తుందని వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదార్ పూనావాలా తెలిపారు. ఆరోగ్య రంగ సిబ్బందికి, వృద్ధులకి ఫిబ్రవరి నాటికే వ్యాక్సిన్‌ని ఇచ్చే అవకాశాలున్నాయని చెప్పారు. రెండు వ్యాక్సిన్ డోసుల ఖరీదు వెయ్యి రూపాయల వరకు ఉంటుందన్నారు. హిందూస్తాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్–2020లో పాల్గొన్న పూనావాలా ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ప్రయోగాలు ముగింపు దశకు వచ్చాయని చెప్పారు. 2024కల్లా అందరికీ వ్యాక్సినేషన్ ప్రజలందరికీ వ్యాక్సినేషన్ పూర్తి కావడానికి 2024 అవుతుందని వెల్లడించారు. ‘‘130 కోట్ల జనాభాకి వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలంటే మూడు, నాలుగేళ్లు పడుతుంది. కేవలం వ్యాక్సిన్ డోసుల సరఫరాలో సమస్యలే కాకుండా డోసుల ఉత్పత్తికి సరిపడా బడ్జెట్ ఉండాలి. వాటి పంపిణీకి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలి. వీటన్నింటినీ అధిగమించినా 80–90శాతం జనాభాకే వ్యాక్సిన్ ఇవ్వడం కుదురుతుంది’’అని ఆయన వివరించారు. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ వృద్ధుల్లో కూడా సత్ఫలితాలు ఇవ్వడంతో ఈ వ్యాక్సిన్‌పై అంచనాలు పెరిగిపోయాయని చెప్పారు. భారత్‌లో జరిగే ప్రయోగాల ఫలితాలు మరో నెలన్నరలో వెలువడతాయని పూనావాలా చెప్పారు. 2 నుంచి 8 డిగ్రీల వాతావరణంలో ఈ వ్యాక్సిన్‌ను నిల్వ చేయవచ్చునన్నారు. 2021 ఏప్రిల్ నాటికి 30 నుంచి 40 కోట్ల డోసులు ఉత్పత్తి చేస్తామని చెప్పారు. భారత్‌కి వ్యాక్సిన్ ఇవ్వడమే తొలిప్రాధాన్యమన్నారు. మూడో దశ ప్రయోగాల్లోకి చైనా టీకా చైనాకు చెందిన అన్హుయ్ ఝిఫై లాంగ్‌కామ్ బయోఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ మూడో దశ మానవ ప్రయోగాల్లోకి అడుగుపెట్టింది. అన్హుయ్ కంపెనీ ఈ వ్యాక్సిన్‌ను చైనీస్ అకాడెమీ సైన్సెస్‌కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రో బయాలజీతో కలసి అభివృద్ధి చేస్తోంది. మూడో దశ ప్రయోగాల కోసం ప్రపంచవ్యాప్తంగా 29 వేల మందిని వాలంటీర్లుగా ఎంచుకోనుంది. రెమిడెసివిర్ ఇవ్వొద్దు డబ్ల్యూహెచ్‌వో సిఫారసు కరోనా చికిత్సలో సత్ఫలితాలు ఇస్తోందని ఇన్నాళ్లూ భావిస్తూ వచ్చిన యాంటీ వైరల్ డ్రగ్ రెమిడెసివిర్‌తో కలిగే ప్రయోజనం ఏమీ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. గిలియాడ్ సంస్థకు చెందిన ఈ ఔషధంతో కరోనా రోగులు కోలుకుంటారని, వారి ప్రాణాలు కాపాడగలమనడానికి ఎలాంటి ఆధారాలు లేవని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. రెమిడెసివిర్ ఇచ్చిన 7 వేలకు పైగా కోవిడ్ రోగుల్ని అధ్యయనం చేసిన తర్వాత దాంతో వచ్చే ఉపయోగం లేదని అంతర్జాతీయ ఆరోగ్య నిపుణులతో కూడిన డబ్ల్యూహెచ్‌వో గైడ్లైన్ డెవలప్మెంట్ గ్రూప్ అభిప్రాయపడింది. ఈ వివరాలను బ్రిటన్‌కు చెందిన మెడికల్ ట్రేడ్ జర్నల్ ప్రచురించింది. కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసుపై గిలియాడ్ సంస్థ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కొవాగ్జిన్ వాలంటీర్‌గా హరియాణా మంత్రి భారత్ బయోటెక్ రూపొందిస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ కొవాగ్జిన్ చివరి దశ ప్రయోగాలు హరియాణాలో ప్రారంభమయ్యాయి. ఈ ప్రయోగాల్లో భాగంగా హరియాణా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ వాలంటీర్‌గా టీకా డోసు తీసుకున్నారు. అంబాలాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మంత్రికి కొవాగ్జిన్ డోసు ప్రయోగాత్మకంగా ఇచ్చి చూశారు. వ్యాక్సిన్ ఇవ్వడానికి ముందు ఆయనకు కొన్ని పరీక్షలు చేశారు. ఒక ప్రజాప్రతినిధి వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావడం భారత్‌లో ఇదే తొలిసారి. టీకా ఇవ్వడంతో ఆయనలో వచ్చే ఆరోగ్యపరమైన మార్పుల్ని నిరంతరం వైద్యులు పరీక్షిస్తారు. నాలుగు వారాల తర్వాత మంత్రికి రెండో డోసు ఇస్తారు. -
కోవిడ్-19: మోడర్నా వ్యాక్సిన్ డేటా రెడీ!
న్యూయార్క్: కోవిడ్-19 కట్టడికి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ తుది దశ క్లినికల్ పరీక్షల డేటాను విడుదల చేసేందుకు అమెరికన్ ఫార్మా దిగ్గజం మోడర్నా ఇంక్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చివరి దశ క్లినికల్ పరీక్షలలో తమ వ్యాక్సిన్ 90 శాతంపైగా సత్ఫలితాలు ఇచ్చినట్లు యూఎస్ దిగ్గజం ఫైజర్ ఇంక్ పేర్కొంది. ఇక స్ఫుత్నిక్ పేరుతో విడుదల చేసిన వ్యాక్సిన్ అత్యంత సమర్ధవంతంగా పనిచేస్తున్నట్లు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(ఆర్డీఐఎఫ్) తెలియజేసింది. ఈ బాటలో తాజాగా మోడర్నా సైతం తుది దశ పరీక్షల డేటాను ప్రకటించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దేశీయంగా.. ఫైజర్ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ మైనస్ 70 డిగ్రీల సెల్షియస్‌లో నిల్వ ఉంచవలసి ఉన్నట్లు వెలువడిన వార్తలతో ఫార్మా రంగ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. దేశీయంగా ఈ వ్యాక్సిన్ నిల్వ, రవాణా, పంపిణీ వంటివి సమస్యాత్మకంగా నిలవనున్నట్లు పేర్కొంటున్నారు. దీంతో మోడర్నా రూపొందిస్తున్న వ్యాక్సిన్‌కు ప్రాధాన్యత ఏర్పడినట్లు తెలియజేశారు. చివరి దశ పరీక్షలకు సంబంధించిన తొలి మధ్యంతర విశ్లేషణ తమ వద్ద ఉన్నట్లు మోడర్నా చెబుతోంది. ఈ డేటా ద్వారా వ్యాక్సిన్ ఎంత సురక్షితమన్న అంశాన్ని తెలుసుకునే వీలున్నట్లు తెలియజేసింది. విశ్లేషణకు వీలుగా ఈ డేటాను స్వతంత్ర పర్యవేక్షక బోర్డుకి నివేదించనున్నట్లు వెల్లడించింది. తద్వారా వ్యాక్సిన్ పరీక్షల ఫలితాలను విశ్లేషించి సూచనలు చేయనున్నట్లు తెలియజేసింది. నోవావాక్స్.. ఐసీఎంఆర్ సహకారంతో రూపొందిస్తున్న కోవిడ్‌షీల్డ్ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ పరీక్షల కోసం దేశీయంగా ఎన్రోల్మెంట్ పూర్తియినట్లు సీరమ్ ఇన్స్టిట్యూట్ వెల్లడించింది. మరోవైపు నోవావ్యాక్స్, సీరమ్ అభివృద్ధి చేస్తున్న కోవావ్యాక్స్కూ ఐసీఎంఆర్ సేవలు అందిస్తోంది. కాగా.. స్ఫుత్నిక్-వి వ్యాక్సిన్‌పై దేశ, విదేశాలలో ఇటీవల క్లినికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. వీటి మధ్యంతర ఫలితాలు 92 శాతం విజయవంతమైనట్లు ఆర్డీఐఎఫ్ చెబుతోంది. జర్మన్ కంపెనీ బయోఎన్‌టెక్‌తో రూపొందిస్తున్నవ్యాక్సిన్ 90 శాతంపైగా సత్ఫలితాలు ఇచ్చినట్లు ఫైజర్ ప్రకటించిన మరుసటి రోజు రష్యన్ వ్యాక్సిన్ వివరాలు వెల్లడికావడం గమనార్హం! దేశీయంగా వ్యాక్సిన్లను 2-8 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య నిల్వ చేస్తుంటారని ఫార్మా రంగ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ బాటలో అతితక్కువ టెంపరేచర్‌ను తీసుకుంటే.. మైనస్ 25 డిగ్రీలు మాత్రమేనని చెబుతున్నారు. వెరసి ఇందుకు అనువైన వ్యాక్సిన్లు మాత్రమే దేశీయంగా వినియోగించేందుకు వీలుంటుందని అభిప్రాయపడ్డారు. -
కరోనా వాక్సిన్ : సీరం సీఈఓ కీలక వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న వేళ ప్రపంచంలోనే అతిపెద్ద టీకా తయారీ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనవల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచానికి సుదీర్ఘ కాలంపాటు కోవిడ్-19 వాక్సీన్ల అవసరం ఉంటుదని పేర్కొన్నారు. జనాభాలో 100 శాతానికి కరోనా టీకా ప్రక్రియ పూర్తిచేసినప్పటికీ, భవిష్యత్తులోమరో 20 ఏళ్లపాటు ఈ టీకాల అవసరం తప్పక ఉంటుందన్నారు. టీకా ఒక్కటే పరిష్కారం కాదని అదార్ వివరించారు. ఎందుకంటే ప్రపంచంలో పలురకాల టీకాలు అందుబాటులో ఉన్నాయి. కానీ వీటిల్లో ఏ ఒక్క టీకాను నిలిపివేసిన చరిత్ర ఎక్కడా లేదని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు వ్యాక్సిన్ ఖచ్చితమైన శాస్త్రం కాదు. అది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధి తీవ్రతను తగ్గిస్తుంది, కానీ వ్యాధి రాకుండా పూర్తిగా నిరోధించదని పూనావాలా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్నటీకాలు ఎంతకాలం రక్షణ కల్పిస్తాయో ఎవరికీ తెలియదు. ఒకటి, రెండు లేదా మూడు సంవత్సరాలు. అయితే ఫ్లూ విషయానికి వస్తే ప్రతీ ఏడాది, ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ కరోనావైరస్ విషయంలో కనీసం రెండు, మూడు సంవత్సరాలకు ఒకసారి వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పారు. కోవిడ్-9 వ్యాక్సిన్ కరోనాను ప్రపంచ వ్యాప్తంగా నిర్మూలిస్తుంది, వైరల్ సంక్రమణను పూర్తిగా అరికడుతుంది లాంటి ఆశలు ఏమైనా ఉంటే ఈ కఠోర సత్యాన్ని మనం జీర్ణించుకోక తప్పదన్నారు. మీజిల్స్ వ్యాక్సిన్, అత్యంత శక్తివంతమైన టీకా, 95 శాతం వ్యాధి నివారణ సామర్థ్యాన్ని కలిగి ఉంది. కానీ ప్రతీ ఏడాది కొత్తగా పుట్టిన శిశువులకు మీజిల్స్ వ్యాక్సిన్ ఇవ్వాల్సిందే కదా అని ఆయన ఉదాహరించారు. మొత్తం ప్రపంచంలో 100 శాతానికి టీకాలు అందించిన తరువాత కూడా భవిష్యత్తు కోసం కరోనా టీకా అవసరం ఉంటూనే ఉంటుదని పూనావల్లా వాదించారు. ఫ్లూ, న్యుమోనియా, మీజిల్స్, అంత ఎందుకు పోలియో వ్యాక్సిన్ల ఉత్పత్తిలో ఒక్కటి కూడా ఇంతవరకూ నిలిపివేయలేదని తెలిపారు. -
‘కరోనా’తో సైరస్ సంపదకు రెక్కలు!
సాక్షి, ముంబై: టీకాల తయారీలో (వ్యాక్సిన్లు) ప్రపంచ ప్రసిద్ధి పొందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత సైరస్ పూనవాలా సంపద కరోనా రాకతో వేగంగా పరుగులు పెట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మే చివరి నాటికి దిగ్గజ వ్యాపారవేత్తల సంపదపై కరోనా ప్రభావం ఏ మేరకు ఉందన్న వివరాలతో హరూన్ రీసెర్చ్ సంస్థ ఓ నివేదిక విడుదల చేసింది. ఈ నాలుగు నెలల కాలంలో సంపద అత్యంత వేగంగా వృద్ధి చెందిన భారత బిలియనీర్‌గా సైరస్ పూనవాలా మొదటి స్థానంలో ఉన్నారు. అమెజాన్ జెఫ్ బెజోస్ తన సంపదను కరోనా కాలంలో రూ. 1.5 లక్షల కోట్ల మేర పెంచుకుని (14 శాతం వృద్ధి) ప్రపంచంలో నంబర్ 1 స్థానంలో ఉంటే.. ఈ విషయంలో సైరస్ పూనవాలా ప్రపంచంలో ఐదో స్థానంలో ఉన్నట్టు హరూన్ రీసెర్చ్ నివేదిక వివరించింది. టీకాల కంపెనీగా సీరమ్ ఇన్స్టిట్యూట్కు ఉన్న బలమైన వ్యాపార సామర్థ్యాలే పూనవాలా సంపద పెరిగేందుకు దోహదపడుతున్నట్టు తెలిపింది. ఈ ఏడాది మే చివరికి సైరస్ పూనవాలా రూ. 1.12 లక్షల కోట్ల సంపదతో ప్రపంచంలో 86వ స్థానానికి చేరుకున్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. ఏకంగా 57 స్థానాలు ముందుకు వచ్చేశారు. నాలుగు నెలల్లోనే ఆయన సంపద విలువ 25 శాతం పెరగడం గమనార్హం. -
ఏపీ సర్కార్ మరో కీలక ఒప్పందం..
సాక్షి, అమరావతి: ప్రపంచస్థాయి వ్యాక్సిన్ తయారీ కేంద్రం దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేసింది. పులివెందుల ఏపీ కార్ల్‌లో వ్యాక్సిన్ తయారీ యూనిట్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఐజీవైతో అవగాహన ఒప్పందం కుదురింది. ఈ మేరకు ఏపీ కార్ల్ సీఈఓ డాక్టర్ ఎం.శ్రీనివాసరావు, ఐజీవై ఇమ్యునోలాజిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్ డాక్టర్ ఆదినారాయణరెడ్డి అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. (టూరిజం కంట్రోల్ రూమ్‌లను ప్రారంభించిన సీఎం జగన్) రాష్ట్ర విభజన తర్వాత పశువులకు అవసరమైన వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రం లేకపోవడంతో ఏపీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మన రాష్ట్రంలో వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని స్థాపించడానికి కొన్నాళ్లుగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. పీపీపీ విధానంలో ఐజీవైతో పులివెందుల ఐజీ కార్ల్‌లో వ్యాక్సిన్ల ఉత్పత్తి కేంద్రం కోసం ఒప్పందం కుదురింది. 2021 నుంచి వ్యాక్సిన్ల తయారీని ప్రారంభించనున్నారు. (ఏపీని అగ్రస్థానంలో నిలిపారు: వైఎస్ విజయమ్మ) పశువులకు కావాల్సిన అన్నిరకాల వ్యాక్సిన్లు తయారీ కానున్నాయి. గొర్రెలకు సహజంగా సోకే చిటెక రోగం, బొబ్బర్ల రోగం, పీపీఆర్, పశువుల్లో వచ్చే గొంతువాపు, జబ్బవాపు, గాలికుంటు వ్యాధి, బ్రూసిల్లా మొదలగు వ్యాధులకు అవసరమైన వ్యాక్సిన్ల తయారీకి ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యాక్సిన్ తయారీ యూనిట్‌కు ఐజీవై దాదాపు రూ.50 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని సదుపాయాలను కల్పించనుంది. దీంతో 100 నిపుణులకు, సిబ్బందికి ఉపాధి కలుగనుంది. మన రాష్ట్రాలు అవసరాలు తీర్చిన తర్వాత ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేసే దిశగా ఏపీ ప్రభుత్వం ఆలోచనలు చేస్తుంది. -
'వ్యాక్సిన్ల పరిశ్రమకు తగిన ప్రోత్సాహం కల్పించండి'
హైదరాబాద్:వ్యాక్సిన్ల పరిశ్రమకు తగిన ప్రోత్సాహం కల్పించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కు శాంతా బయోటిక్ చైర్మన్ వరప్రసాద్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేసీఆర్ తో వరప్రసాద్ రెడ్డి శనివారం సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సిన్ల పరిశ్రమకు ప్రోత్సాహం కల్పించాలని ఆయన విజ్ఞప్తిని కేసీఆర్ సాదరంగా స్వాగతించారు. వ్యాక్సిన్ల ప్రమాణాలు పరీక్షించే ల్యాబ్ లను తెలంగాణలో నెలకొల్పడానికి సహకారం అందిస్తామని వరప్రసాద్ రెడ్డికి కేసీఆర్ తెలిపారు.