ఎల్ఐసీ చైర్మన్ రాయ్ ముందస్తు రాజీనామా
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజ సంస్థ ఎల్‌ఐసీ చైర్మన్ పదవికి ఎస్‌కే రాయ్ రాజీనామా చేశారు. రాయ్‌ని గత యూపీఏ ప్రభుత్వం నియమించింది. ఐదేళ్ల పదవీకాలంలో ఇంకా రెండేళ్ల బాధ్యతలు మిగిలి ఉండగానే రాయ్ రాజీనామా చేయడం గమనార్హం. 1981 నుంచి రాయ్ ఎల్‌ఐసీలో పనిచేస్తున్నారు.
2013 జూన్‌లో చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. అధికార వర్గాల కథకం ప్రకారం, రాయ్ ఇప్పటికే తన రాజీనామా పత్రాన్ని ఆర్థిక మంత్రిత్వశాఖకు పంపారు. దీనిని ఆమోదం నిమిత్తం నియామకాల కేబినెట్ కమిటీకి ఆర్థికమంత్రిత్వశాఖ పంపింది. రాజీనామాకు కారణం తెలియనప్పటికీ, వ్యక్తిగత అంశాలను తన నిర్ణయానికి సిన్హా కారణంగా చూపినట్లు తెలుస్తోంది. కొన్ని నెలల క్రితమే సిన్హా రాజీనామా వినతి చేశారని, అయితే అప్పట్లో పునరాలోచించుకోవాల్సిందిగా ఆర్థికశాఖ కోరిందని తెలుస్తోంది.