న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణ కమిటీ సభ్యుల పేర్లను ప్రకటించింది. ఒక చైర్మన్ సహా ఐదుగురు సభ్యులతో కూడిన ఓవర్ సీయింగ్ కమిటీని ఆర్‌బీఐ గురువారం వెల్లడించింది. ఇద్దరు సభ్యుల కమిటీని ఐదుగురు సభ్యులకు విస్తరించింది.
ఈ కమిటీకి మాజీ విజిలెన్స్ ముఖ్య అధికారి ప్రదీప్ కుమార్‌ను ఛైర్మన్‌గా నియమించింది. జానకి వల్లభ్, ఎంబీఎన్ రావు, ఎస్ రామన్, వైఎం డియోహేలేలేను కమిటీ సభ్యులుగా ఎంపిక చేసింది.
ఎఎస్‌బీఐ ఛైర్మన్ జానకి వల్లభ్, మాజీ కెనరా బ్యాంక్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎం బి ఎన్ రావు, ఎల్ అండ్ టి ఫైనాన్స్ వైఎం డియోహేలేలే సెబీ, మాజీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎస్.రామన్ ఉన్నారు. సెప్టెంబరు 7, 2017 నుంచి సెబిలో పదవీకాలం పూర్తి చేసిన తరువాత రామన్ ప్యానల్‌లోకి రానున్నారు.
బ్యాంకింగ్ రంగానికి రుణాలు ఇచ్చే సంస్థకు మొత్తం 500 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఉన్న కేసులను ఈ ప్యానల్ పరిశీలిస్తుంది. స్థిరమైన ఆస్తుల స్థిరమైన నిర్మాణానికి (ఎస్ 4 ఏ )సమస్యల పరిష్కారంకోసం పనిచేయనుంది. 8 లక్షల కోట్ల రూపాయలకు పైగా బ్యాడ్‌లోన్ల సమస్య పరిష్కారం కోసం బ్యాంకింగ్ ఆర్డినెన్స్ ద్వారా ఆర్‌బీఐ తన ఆధ్వర్యంలో ఓసీని తిరిగి ఏర్పాటు చేయనున్నట్లు మే 22 న ప్రకటించిన సంగతి తెలిసిందే.