‘ఇంకా 2జీ సేవలనే వినియోగిస్తున్నారు ’ | Reliance Jio Plays A Key Role In 5G Technology | Sakshi
Sakshi News home page

‘ఇంకా 2జీ సేవలనే వినియోగిస్తున్నారు ’

Published Wed, Jun 24 2020 8:27 PM | Last Updated on Wed, Jun 24 2020 8:44 PM

Reliance Jio Plays A Key Role In 5G Technology - Sakshi

ముంబై: మొబైల్‌, ఇంటర్నెట్‌ వినియోగదారులకు రిలయన్స్జియో శుభవార్త తెలిపింది. త్వరలోనే దేశ ప్రజలకు 5జీ ఎకోసిస్టమ్‌ టెక్నాలజీని అందుబాటులో ఉంచనున్నట్లు రిలయన్స్‌ జియో వార్షిక నివేదికలో ప్రకటించింది.  ఈ విషయమై షేర్‌ హోల్డర్‌ల సమావేశంలో రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌‌ అంబానీ స్పందిస్తూ.. వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు జియో ఎప్పుడు కృషి చేస్తుందని, కానీ ఇప్పటికి లక్షలా మంది వినియోగదారులు 2జీ సేవలనే వినియోగిస్తున్నారని తెలిపారు. కాగా 2జీ సేవల వినియోగదారులను 4జీ సేవలను ఉపయోగించే విధంగా రిలయన్స్ సంస్థ కృషి చేసిందన్నారు. అయితే గత రెండు సంవత్సరాలలో 10కోట్ల మందిని 2జీ నుంచి 4జీ సేవలవైపు ఆకర్శించడంలో జియో కీలక పాత్ర పోషిందని పేర్కొన్నారు

మరోవైపు రిలయన్స్ అద్భుత విజయాలతో ప్రపంచ దిగ్గజ కంపెనీ(ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్‌)లు తమ సంస్థలో పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. కాగా, ప్రస్తుతం దేశంలో 385.7(38కోట్ల)మంది మిలియన్ల వినియోగదారులు జియో సేవలు పొందుతున్నారని ముఖేశ్‌‌ అంబానీ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా స్పెక్ట్రమ్‌ కేటాయింపులు త్వరలో నిర్వహించబోతున్నట్లు ఇటీవల వెల్లడించింది. రిలయన్స్ ఇటీవలి కాలంలో 11 మెగా డీల్స్ సాధించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో చేసుకున్న ఒప్పందాల ద్వారా రిలయన్స్ రుణ రహిత సంస్థగా అవతరించిన విషయం విదితమే. (చదవండి:కొత్త ఉపాధి అవకాశాలు, కొత్త వ్యాపారాలు: అంబానీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement