ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 266 పాయింట్లు క్షీణించి 32,258 వద్ద, నిఫ్టీ 83 పాయింట్ల పతనమై 9754 వద్ద ముగిశాయి. దీంతో నిఫ్టీ 9800 స్థాయి కిందికి , బ్యాంక్ నిఫ్టీకూడా 25వేల స్థాయి కిందిగి దిగజారింది. అన్నిరంగాలూ బలహీనపడగా.. ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్స్, ఐటీ, ఆటో, రియల్టీ రంగాలు నష్టపోయాయి. ముఖ్యంగా ఫార్మా, ఐటీ, బ్యాంక్ సెక్టార్లలో భారీ అమ్మకాల ఒత్తిడి మార్కెట్లను పతనం దిశగా లాక్కెళ్లింది. కీలక సాంకేతిక స్థాయిల వద్ద విఫలం కావడంతో రెండు వారాల కనిష్టాన్ని నమోదు చేశాయి. ఎనలిస్టులు మరింత నెగిటివ్ ధోరణిని అంచనా వేశారు. దలాల్ స్ట్రీట్‌లో మరింత పెయిన్ తప్పదని భావిస్తున్నారు.
ఇన్ఫోసిస్(5.62 శాతం ) బీఓబీ, ఐవోసీ, అదానీ టాప్ లూజర్స్‌గా నిలవగా, సిప్లా, ఆర్‌ఐఎల్, గ్లెన్‌మార్క్, ఎస్‌బ్యాంక్ తదితర షేర్లు నష్టపోయాయి.యాక్సిస్‌బ్యాంక్, మణప్పురం ఫైనాన్స్ 11 శాతం దూసుకెళ్లగా, సెంచురీ టెక్స్, పీసీ జ్యువెలర్స్, గ్రాసిమ్, టాటా గ్లోబల్, చెన్నై పెట్రో, యాక్సిస్ 3-1 శాతం మధ్య బలపడ్డాయి.
అటు డాలర్‌మారకంలో రూపాయి 0.03 పైసల లాభంతో 64.11 వద్ద ఉండగా, ఎంసీఎక్స్ మార్కెట్ లో పుత్తడి స్వల్పంగా లాభపడి పది గ్రా. రూ. 29,179 వద్ద ఉంది.