రిలయన్స్ జియో బ్రాండ్ అంబాసిడర్ షారూక్! | Shah Rukh Khan may be brand ambassador for Reliance Jio | Sakshi
Sakshi News home page

రిలయన్స్ జియో బ్రాండ్ అంబాసిడర్ షారూక్!

Published Fri, Dec 25 2015 1:55 AM | Last Updated on Sun, Sep 3 2017 2:31 PM

రిలయన్స్ జియో బ్రాండ్ అంబాసిడర్ షారూక్!

రిలయన్స్ జియో బ్రాండ్ అంబాసిడర్ షారూక్!

న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ టెలికం వెంచర్ రిలయన్స్ జియో బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూక్ ఖాన్ వ్యవహరించనున్నారు. రిలయన్స్ జియో తన 4జీ సేవలను (కేవలం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉద్యోగుల కోసం) ఈ నెల 27న ప్రారంభించనున్నది. కమర్షియల్ 4జీ సేవలను వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్ నుంచి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశ ముంది. రిలయన్స్ జియో బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నానని షారూక్ ఖాన్ ఒక టీవీ ఇంటర్వ్యూలో తెలిపారు. డిసెంబర్ 27న జరగనున్న రిలయన్స్ జియో 4జీ  ప్రారంభోత్సవ కార్యక్రమానికి షారూక్ ఖాన్, మ్యూజిక్ డెరైక్టర్ ఏఆర్ రెహమాన్ ముఖ్య అతిధులుగా విచ్చేయనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement