క్యూ4 ఫలితాలు: లుపిన్, సియట్, దావత్, బేనారస్ హోటల్స్, ఫెడరల్ బ్యాంక్, ఐఐఎఫ్‌ఎల్, ముత్తూట్ క్యాపిటల్, రాడికో కైతాన్, రెయిన్ ఇండస్ట్రీస్, టాటా స్టీల్ లాంగ్ ప్రోడక్ట్స్, టీవీఎస్ మోటార్ కంపెనీలు మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాలను గురువారం వెల్లడించనున్నాయి.
కొటక్ మహీంద్రా బ్యాంక్: జీఐసీ, ఒపెన్‌హీమర్, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డు అండ్ క్యాపిటల్ ఇంటర్నేషనల్‌లు కొటక్ క్విప్‌లో (క్యూఐపీ) పాల్గొన్నాయి. ఈ క్విప్ మూడు రెట్లు అధికంగా సబ్‌స్క్రైబ్ అయింది.
ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్: గడిచిన ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికర లాభం 80 శాతం పెరిగి రూ.77.43 కోట్లకు చేరిందని ఈ కంపెనీ వెల్లడించింది.
కెపీఐటీ టెక్నాలజీస్: క్యూ4లో కన్సాలిడేటెడ్ నికర లాభం 23.3 శాతం పెరిగి రూ.38.1 కోట్లకు చేరిందని కేపీఐటీ వెల్లడించింది. కాగా అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.30.9 కోట్లుగా ఉందని రెగ్యులేటరీకి ఇచ్చిన సమాచారంలో పేర్కొంది.
ఇండోస్టార్ క్యాపిటల్: బ్రూక్‌ఫీల్డ్ ద్వారా రూ.1,225 కోట్ల ఈక్విటీ క్యాపిటల్‌ను సమీకరించనున్నట్లు ఇండోస్టార్ తెలిపింది.
యునైటెడ్ స్పిరిట్స్: క్యూ4లో కన్సాలిడేటెడ్ నికర లాభం 57.82 శాతం తగ్గి రూ.49.3 కోట్లకు చేరిందని ఈ కంపెనీ వెల్లడించింది.
అదానీ పవర్: మధ్యప్రదేశ్‌లో 1,320 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు మధ్యప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆమోదం తెలిపినట్లు అదానీ పవర్ వెల్లడించింది.
ఆదిత్యా బిర్లా ఫ్యాషన్: క్యూ4లో కన్సాలిడేటెడ్ నికర నష్టం రూ.146.59 కోట్లుగా నమోదైనట్లు ఆదిత్యా బిర్లా ఫ్యాషన్ వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.202.64 కోట్లుగా ఉంది. కాగా రైట్స్ ఇష్యూ ద్వారా రూ.1,000 కోట్ల నిధులు సమీకరించేందుకు కంపెనీ బోర్డు ఆమోదంతెలిపినట్లు బిర్లాఫ్యాషన్ తెలిపింది.
ఇండియా గ్రిడ్ ట్రస్ట్: క్యూ4లో కన్సాలిడేటెడ్ నికర లాభం రెండు రెట్లు పెరిగి రూ.99.7 కోట్లుగా నమోదైనట్లు ఇండియా గ్రిడ్ వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో నికర లాభం రూ.37.6 కోట్లుగా ఉంది.
ఎన్‌టీపీసీ: అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్(ఏడీఏజీ) లో 51 శాతం వాటా కొనుగోలు చేసి విద్యుత్ పంపిణీ వ్యాపారంలో అడుగుపెట్టాలని ఎన్‌టీపీసీ భావిస్తోంది.
క్యూస్ కార్పొరేషన్: క్యూ4లో ఈ కంపెనీ నికర నష్టం రూ.629.91 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.75.50 కోట్లుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment