stocks and shares
-
బోల్ట్‌కు చేదు అనుభవం.. అకౌంట్ నుంచి 97 కోట్లు మాయం
జమైకా దిగ్గజ అథ్లెట్.. ఒలింపియన్ ఉసెన్ బోల్ట్‌కు చేదు అనుభవం ఎదురైంది. బోల్డ్ అకౌంట్ నుంచి దాదాపు 12 మిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు రూ. 97 కోట్ల 60 లక్షలు) మాయమైనట్లు సమాచారం. అకౌంట్ నుంచి మాయమైన డబ్బంతా బోల్ట్ లైఫ్‌టైమ్ సేవింగ్ డబ్బులని అతని లాయర్ లింటన్ పి. గార్డన్ తెలిపారు. కింగ్స్టన్ అనుబంధ కంపెనీలో స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్‌లో బోల్ట్ పెట్టుబడులు పెట్టినట్లు తెలిసింది. తాజాగా షేర్స్‌లో నష్టాలు రావడంతో బోల్ట్ అనుమతి లేకుండానే అతని అకౌంట్ నుంచి డబ్బు మాయం చేశారని లాయర్ తెలిపారు. ప్రస్తుతం బోల్డ్ అకౌంట్లో కేవలం 12వేల డాలర్లు మాత్రమే మిగిలాయన్నారు. ఈ వ్యవహారంపై తాము కోర్టులో కేసు వేయనున్నట్లు బోల్ట్ తరపు లాయర్ గార్డన్ వెల్లడించారు. ''ఇది వినడానికి షాకింగ్‌గా ఉంది. బోల్ట్ ఇన్వెస్ట్ చేసిన షేర్స్ నష్టాలు రావడంతో అనుమతి లేకుండా అతని అకౌంట్లో డబ్బులు మాయం చేయడం ఏంటని.. ఆ డబ్బులు బోల్ట్ లైఫ్‌టైమ్ సేవింగ్స్ అని.. ప్రైవేటు పెన్షన్ రూపంలో వాటిని పొందాలని బోల్ట్ ఇది వరకే బ్యాంకుతో ఒప్పందం చేసుకున్నాడు. అయితే ముందస్తు సమాచారం లేకుండా అకౌంట్ నుంచి డబ్బుల మాయం చేసిన కింగ్స్టన్ అనుబంధ సంస్థపై కోర్టులో కేసు వేసే అంశాన్ని పరిశీలిస్తున్నాం'' అంటూ లాయర్ గార్డన్ తెలిపారు. 2017లో అథ్లెటిక్స్‌కు గుడ్‌బై చెప్పిన బోల్ట్.. దాదాపు పదేళ్ల పాటు ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ ఈవెంట్స్‌ను శాసించాడు. 100, 200, 400 మీటర్ల విభాగంలో పరుగుల రారాజుగా నిలిచిపోయాడు. వరుసగా ఎనిమిదిసార్లు ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ సాధించి ఉసెన్ బోల్ట్ ఎవరికి సాధ్యం కాని రికార్డు నెలకొల్పి చరిత్ర సృష్టించాడు. చదవండి: Hashim Amla: మచ్చలేని క్రికెటర్.. కోహ్లితో పోటీపడి పరుగులు మాజీ బాయ్‌ఫ్రెండ్ మొహం చూడకూడదని గోడ కట్టించింది -
దివాలా సంస్థల్లో షేర్ హోల్డర్లకు రక్షణగా సెబీ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: దివాలా పరిష్కార ప్రక్రియను ఎదుర్కొంటున్న లిస్టెడ్ కంపెనీల షేర్‌హోల్డర్ల ప్రయోజనాలను కాపాడటంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నిర్దిష్ట ఫ్రేమ్‌వర్క్‌కు సంబంధించిన చర్చాపత్రాన్ని రూపొందించింది. కంపెనీని కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చే రిజల్యూషన్ దరఖాస్తుదారుకు ఇచ్చే అవకాశాలనే మైనారిటీ షేర్హోల్డర్లకు కూడా కల్పించాలని ప్రతిపాదించింది. దీని ప్రకారం కొత్త సంస్థలో కనీస పబ్లిక్ షేర్‌హోల్డింగ్ శాతాన్ని (ప్రస్తుతం 25 శాతం) కొనుగోలు చేసేందుకు ప్రస్తుత పబ్లిక్ ఈక్విటీ షేర్హోల్డర్లకు అవకాశం ఇవ్వాలని పేర్కొంది. రిజల్యూషన్ దరఖాస్తుదారు విషయంలో అంగీకరించిన ధరపరమైన నిబంధనలే వారికీ వర్తింపచేయాలని సూచించింది. దీనితో పాటు ఇతరత్రా పలు ప్రతిపాదనలున్న చర్చాపత్రంపై సంబంధిత వర్గాలు నవంబర్ 24లోగా తమ అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుంది. -
ఇన్వెస్టర్లు పోటీపడుతున్నారు, హాట్ కేకుల్లా ఐపీవో సబ్స్క్రిప్షన్లు
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూలకు (ఐపీవోలు) జోరు కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్లు పోటాపోటీగా బిడ్లు దాఖలు చేస్తున్నారు. బుధవారం నుంచి (ఈ నెల 4న) విండ్లాస్ బయోటెక్, ఎక్సారో టైల్స్, కృష్ణా డయోగ్నస్టిక్స్, దేవయాని ఇంటర్నేషనల్ ఐపీవోలు మొదలయ్యాయి. తొలిరోజే వీటికి పెద్ద ఎత్తున బిడ్లు దాఖలయ్యాయి. గంటల వ్యవధిలోనే ఇన్వెస్టర్ల నుంచి పూర్తి చందాలు (సబ్స్క్రయిబ్) వచ్చాయి. దేవయాని ఇంటర్నేషనల్ కేఎఫ్‌సీ, పిజ్జాహట్, కోస్టాకాఫీ బ్రాండ్ల ఉత్పత్తులను విక్రయించే దేవయాని ఇంటర్నేషనల్ ఇష్యూకు తొలిరోజు 30,26,56,860 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. కంపెనీ ఆఫర్ చేస్తున్న 11,25,69,719 షేర్లతో పోలిస్తే 2.7 రెట్లు అధికంగా బిడ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఐపీవోలో భాగంగా రూపాయి ముఖ విలువ కలిగిన ఒక్కో షేరును రూ.86–90 ధరల శ్రేణితో దేవయాని ఇంటర్నేషనల్ ఆఫర్ చేస్తోంది. 10 శాతం షేర్లను రిటైలర్లకు కేటాయించగా.. వారి నుంచి 11.37 రెట్లు అధికంగా బిడ్లు దాఖలయ్యాయి. ఉద్యోగుల కోట కూడా పూర్తిగా సబ్స్క్రయిబ్ అయింది. కృష్ణా డయోగ్నస్టిక్స్ డయోగ్నస్టిక్స్(వ్యాధి నిర్ధారణ) సేవలు అందించే కృష్ణా డయోగ్నస్టిక్స్ రూ.1,213 కోట్ల సమీకరణకు ఐపీవోను చేపట్టగా.. తొలిరోజే పూర్తి స్థాయి స్పందన అందుకుంది. 71,12,099 షేర్లను కంపెనీ ఆఫర్ చేస్తుండగా.. 1,41,10,650 షేర్లకు బిడ్లు వచ్చాయి. అంటే రెండు రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయింది. ముఖ్యంగా రిటైలర్ల కోటా 9.59 రెట్లు అధికంగా బిడ్లు అందుకుంది. ఈ సంస్థ ఒక్కో షేరు ను రూ.933–954 ధరల శ్రేణిపై ఆఫర్ చేస్తోంది. ఎక్సారోటైల్స్ టైల్స్ తయారీలోని ఎక్సారోటైల్స్ ఐపీవోలో భాగంగా 1,14,50,675 షేర్లను ఆఫర్ చేస్తుంటే.. తొలి రోజే 4.67 రెట్ల అధిక స్పందన అందుకుంది. మొత్తం 5,35,23,750 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. రిటైలర్ల కోటాలో 9.29 రెట్లు అధికంగా బిడ్లు వచ్చాయి. విండ్లాస్ బయోటెక్ ఈ ఔషధ తయారీ సంస్థ ఐపీవోలో భాగంగా 61,10,317 షేర్లను ఆఫర్ చేస్తోంది. మొదటి రోజే మూడు రెట్లు అధికంగా బిడ్లు వచ్చాయి. రిటైలర్ల కోటాలో 6 రెట్లు అధికంగా స్పందన వచ్చింది. -
యునైటెడ్ స్పిరిట్స్,అదానీ పవర్‌పై ఫోకస్
క్యూ4 ఫలితాలు: లుపిన్, సియట్, దావత్, బేనారస్ హోటల్స్, ఫెడరల్ బ్యాంక్, ఐఐఎఫ్ఎల్, ముత్తూట్ క్యాపిటల్, రాడికో కైతాన్, రెయిన్ ఇండస్ట్రీస్, టాటా స్టీల్ లాంగ్ ప్రోడక్ట్స్, టీవీఎస్ మోటార్ కంపెనీలు మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాలను గురువారం వెల్లడించనున్నాయి. కొటక్ మహీంద్రా బ్యాంక్: జీఐసీ, ఒపెన్‌హీమర్, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు అండ్ క్యాపిటల్ ఇంటర్నేషనల్‌లు కొటక్ క్విప్‌లో (క్యూఐపీ) పాల్గొన్నాయి. ఈ క్విప్ మూడు రెట్లు అధికంగా సబ్‌స్క్రైబ్ అయింది. ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్: గడిచిన ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికర లాభం 80 శాతం పెరిగి రూ.77.43 కోట్లకు చేరిందని ఈ కంపెనీ వెల్లడించింది. కెపీఐటీ టెక్నాలజీస్: క్యూ4లో కన్సాలిడేటెడ్ నికర లాభం 23.3 శాతం పెరిగి రూ.38.1 కోట్లకు చేరిందని కేపీఐటీ వెల్లడించింది. కాగా అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.30.9 కోట్లుగా ఉందని రెగ్యులేటరీకి ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. ఇండోస్టార్ క్యాపిటల్: బ్రూక్‌ఫీల్డ్ ద్వారా రూ.1,225 కోట్ల ఈక్విటీ క్యాపిటల్‌ను సమీకరించనున్నట్లు ఇండోస్టార్ తెలిపింది. యునైటెడ్ స్పిరిట్స్: క్యూ4లో కన్సాలిడేటెడ్ నికర లాభం 57.82 శాతం తగ్గి రూ.49.3 కోట్లకు చేరిందని ఈ కంపెనీ వెల్లడించింది. అదానీ పవర్: మధ్యప్రదేశ్‌లో 1,320 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు మధ్యప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆమోదం తెలిపినట్లు అదానీ పవర్ వెల్లడించింది. ఆదిత్యా బిర్లా ఫ్యాషన్: క్యూ4లో కన్సాలిడేటెడ్ నికర నష్టం రూ.146.59 కోట్లుగా నమోదైనట్లు ఆదిత్యా బిర్లా ఫ్యాషన్ వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.202.64 కోట్లుగా ఉంది. కాగా రైట్స్ ఇష్యూ ద్వారా రూ.1,000 కోట్ల నిధులు సమీకరించేందుకు కంపెనీ బోర్డు ఆమోదంతెలిపినట్లు బిర్లాఫ్యాషన్ తెలిపింది. ఇండియా గ్రిడ్ ట్రస్ట్: క్యూ4లో కన్సాలిడేటెడ్ నికర లాభం రెండు రెట్లు పెరిగి రూ.99.7 కోట్లుగా నమోదైనట్లు ఇండియా గ్రిడ్ వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో నికర లాభం రూ.37.6 కోట్లుగా ఉంది. ఎన్టీపీసీ: అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్(ఏడీఏజీ) లో 51 శాతం వాటా కొనుగోలు చేసి విద్యుత్ పంపిణీ వ్యాపారంలో అడుగుపెట్టాలని ఎన్టీపీసీ భావిస్తోంది. క్యూస్ కార్పొరేషన్: క్యూ4లో ఈ కంపెనీ నికర నష్టం రూ.629.91 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.75.50 కోట్లుగా ఉంది. -
మోడీ..... మేజిక్!
ప్రధాని నరేంద్ర మోడీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం, అంతర్జాతీయ మార్కెట్లలో తగ్గిన చమురు ధరలు ఇన్వెస్టర్లకు జోష్‌నిచ్చాయి. వెరసి దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను అందుకున్నాయి. సెన్సెక్స్ 288 పాయింట్లు ఎగసి 26,391కు చేరగా, నిఫ్టీ కూడా 83 పాయింట్లు జంప్‌చేసి 7,874 వద్ద ముగిసింది. ఇవి సరికొత్త రికార్డులుకాగా, ఇంట్రాడేలోనూ కొత్త చరిత్రను సృష్టిస్తూ సెన్సెక్స్ గరిష్టంగా 26,413ను తాకింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 7,880ను అధిగమించింది. మేక్ ఇండియా, మేడిన్ ఇండియా విజన్‌లో భాగంగా దేశాన్ని అంతర్జాతీయ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దుతామన్న మోడీ ప్రణాళికలు మార్కెట్లకు టానిక్‌లా పనిచేశాయి. సుపరిపాలన, అందరికీ అభివృద్ధిలో భాగం, ఇన్ఫ్రా రంగంపై ప్రత్యేక దృష్టి వంటి అంశాలు ఇందుకు అండగా నిలిచాయని విశ్లేషకులు పేర్కొన్నారు. మరోవైపు ముడిచమురు ధరలు మరింత చల్లబడటంతో సెంటిమెంట్ మరింత బలపడిందని తెలిపారు. ఫలితంగా వరుసగా ఐదో రోజు మార్కెట్లు లాభపడ్డాయి. ఐదు రోజుల్లో సెన్సెక్స్ 1,062 పాయింట్లు జమ చేసుకోవడం విశేషం! సెన్సెక్స్ ఇంతక్రితం జూలై 25న 26,300 వద్ద, నిఫ్టీ 7,840 వద్ద ముగిసి కొత్త రికార్డులు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఐటీ, ఎఫ్ఎంసీజీ మినహా బీఎస్ఈలో ఐటీ, ఎఫ్ఎంసీజీ మినహా అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, ఆటో రంగాలు 2.6-1.6 శాతం మధ్య పుంజుకున్నాయి. హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ జోరు ఆయిల్ రంగ షేర్లలో హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఓఎన్జీసీ 6.5-5.5% స్థాయిలో జంప్‌చేయగా, పెట్రోనెట్, ఐవోసీ, ఆయిల్ ఇండియా 4.5-3% మధ్య పెరిగాయి. ఆర్ఐఎల్ సైతం 1% లాభపడింది. యాక్సిస్ బ్యాంక్ దూకుడు బ్యాంకింగ్ షేర్లలో యాక్సిస్, ఫెడరల్, ఐసీఐసీఐ, యస్ బ్యాంక్, ఎస్బీఐ, కెనరా, బీవోఐ 4.5-2% మధ్య పురోగమించాయి. ఇక ఆటో షేర్లలో అపోలో టైర్స్, టాటా మోటార్స్, ఎంఆర్ఎఫ్, కమిన్స్, మారుతీ 4.5-1.5% మధ్య బలపడ్డాయి. ఏఐఏ ఇంజనీరింగ్ 6% అప్ క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్‌లో ఏఐఏ ఇంజనీరింగ్, పిపావవ్, పుంజ్లాయిండ్, సుజ్లాన్, బీహెచ్ఈఎల్, క్రాంప్టన్ గ్రీవ్స్, ఆల్‌స్తోమ్ టీఅండ్‌డీ, ఎల్అండ్టీ 6-2% మధ్య జంప్‌చేశాయి. దిగ్గజాల వెనకడుగు: సెన్సెక్స్ దిగ్గజాలలో సిప్లా 5%, భారతీ 3% చొప్పున లాభపడగా.. ఐటీసీ, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ 1.7-1% మధ్య డీలాపడ్డాయి. చిన్న షేర్లలో లాభపడ్డవే అధికం సెంటిమెంట్‌కు అనుగుణంగా మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 2% స్థాయిలో పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,930 లాభపడగా, 1,003 నష్టపోయాయి. వెలుగులో డీవీఆర్ షేర్లు: బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఇండెక్స్‌లలో డీవీఆర్లకు చోటుకల్పిస్తారన్న వార్తలతో టాటా మోటార్స్ డీవీఆర్ 6% ఎగసింది. ఫ్యూచర్ రిటైల్ 5.4%, గుజరాత్ ఎన్ఆర్ఈ 5%, జైన్ ఇరిగేషన్ డీవీఆర్ 5% చొప్పున పెరిగాయి. క్యూ1లో ప్రోత్సాహక ఫలితాలతో వర్ల్‌పూల్ 10% దూసుకెళ్లింది. ఎఫ్ఐఐల జోరు... గత వారం రూ. 2,144 కోట్లను ఇన్వెస్ట్‌చేసిన ఎఫ్ఐఐలు తాజాగా రూ. 473 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. మరోపక్క దేశీయ ఫండ్స్ కూడా రూ. 490 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. -
రోజుకో కొత్త రికార్డు
రోజుకో కొత్త రికార్డును సృష్టిస్తూ దే శీ స్టాక్ మార్కెట్ల జోరు కొనసాగుతోంది. సెన్సెక్స్ తాజాగా 124 పాయింట్లు లాభపడటం ద్వారా 26,272 వద్ద ముగిసింది. వెరసి వరుసగా 8 రోజుల్లో 1,265 పాయింట్లను తన ఖాతాలో జమ చేసుకుంది. ఈ బాటలో నిఫ్టీ 35 పాయింట్లు పుంజుకుని 7,831 వద్ద నిలిచింది. తద్వారా 8 రోజుల్లో 376 పాయింట్లు పురోగమించింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 26,293కు చేరగా, నిఫ్టీ 7,835 వద్ద గరిష్టాన్ని తాకింది. ఇవన్నీ కొత్త రికార్డులే కావడం విశేషం. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందుతున్న సానుకూల సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, దేశీ ఆర్థిక పురోగమనంపై ఆశలు వంటి అంశాలు సానుకూలంగా ఉన్నాయి. దీంతో 2012 సెప్టెంబర్ తరువాత మార్కెట్లు మళ్లీ వరుస లాభాలు ఆర్జిస్తున్నాయి. ప్రపంచ మార్కెట్లలో ఉత్తమం: ఈ ఏడాది ఇప్పటివరకూ దేశీ మార్కెట్లు 24% ఎగశాయి. తద్వారా ప్రపంచ మార్కెట్లలో ఉత్తమంగా నిలిచాయి. ఈ కాలంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) 12 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేశారు. ఇందుకు ప్రభుత్వ సంస్కరణలు దోహదపడుతున్నట్లు నిపుణులు తెలిపారు. బీమాలో ఎఫ్‌డీఐలకు సంబం ధించి కేంద్ర నిర్ణయం నేపథ్యంలో రిలయన్స్ క్యాపిటల్ షేరు 4% ఎగసింది. ఇక మరోవైపు ప్రభుత్వ బాండ్లలో ఎఫ్ఐఐల పెట్టుబడి పరిమితిని 5 బిలియన్ డాలర ్లమేర పెంచడం ద్వారా మొత్తం పరిమితిని 30 బిలియన్ డాలర్లకు ఆర్బీఐ చేర్చింది. వీటికితోడుగా రైల్వేలు, రక్షణ రంగాలలో సైతం ఎఫ్‌డీఐలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనుంది. ఇక స్టాక్ మార్కెట్లలో గత మూడు రోజుల్లో రూ. 1,225 కోట్లను ఇన్వెస్ట్‌చేసిన ఎఫ్ఐఐలు గురువారం మరో రూ. 282 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. కార్పొరేట్ బ్రీఫ్స్ ఎస్కేఎస్ మైక్రోఫైనాన్స్: ఏప్రిల్-జూన్ క్వార్టర్లో ఎఫ్ఐఐల వాటా 44.61%కు ఎగసింది. ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధికంకాగా, మార్చి ముగిసేసరికి ఈ వాటా 38.36%గా నమోదైంది. ఈ కాలంలో షేరు ధర 35% సైతం ఎగసింది. సెబీ: ఈ ఏడాది ఏప్రిల్-జూన్ కాలంలో 8 కంపెనీలు రూ. 222 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ చేసినట్లు తెలిపింది. వీటిలో ప్రధానంగా మహారాష్ట్ర సీమ్‌లెస్ రూ. 100 కోట్లు, మోతీలాల్ ఓస్వాల్ రూ. 56 కోట్లు చొప్పున ఖర్చు చే శాయి. టాటా స్టీల్: అంతర్జాతీయ మార్కెట్లలో రెండు రకాల బాండ్ల విక్రయం ద్వారా 1.5 బిలయన్ డాలర్లు(రూ. 9,000 కోట్లు) సమీకరించింది. -
ఆశలు ఆవిరయ్యే.. !
రైల్వే బడ్జెట్ నిరాశపరచడం, ఆశావహంగా లేని ఆర్థిక సర్వేలతో నరేంద్ర మోడి ప్రభుత్వపు తొలి బడ్జెట్‌పై ఇన్వెస్టర్ల ఆశలు ఆవిరయ్యాయి. వీటికి అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల బలహీనత జత కావడంతో స్టాక్ మార్కెట్లు బుధవారం క్షీణించాయి. 25,684-25,365 రేంజ్లో కదలాడిన బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ 137 పాయింట్లు(0.54 శాతం) క్షీణించి 25,445 పాయింట్ల వద్ద. నిఫ్టీ 38 పాయింట్లు క్షీణించి 7,585 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు జూన్ 30 తర్వాత ఇదే కనిష్టస్థాయి. నిఫ్టీకి ఇది వారం కనిష్ట స్థాయి. ద్రవ్య పరిస్థితి అంచనా వేసిన దానికంటే అధ్వానంగా ఉందని ఆర్థిక సర్వే వెల్లడించడంతో స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ పడిపోయాయి. ఆర్థిక సర్వే ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నివ్వలేకపోయింది. బడ్జెట్‌కు ముందు విదేశీ, స్వదేశీ ఇన్వెస్టర్లు ఆచి, తూచి వ్యవహరించడంతో స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు గురయ్యాయి. రైల్వే బడ్జెట్ నిరాశపరచడంతో నేటి సాధారణ బడ్జెట్ కూడా అలాగే ఉంటుందన్న అంచనాలు స్టాక్ మార్కెట్లను పడగొట్టాయి. వాహన, విద్యుత్, రియల్టీ, ఫార్మా, క్యాపిటల్ గూడ్స్, ఐటీ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. మరోవైపు రిఫైనరీ, కన్సూమర్ డ్యురబుల్, ఎఫ్ఎంసీజీ కంపెనీల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ట్రేడింగ్ చివరలో చాలా మంది ట్రేడర్లు లాంగ్ పొజిషన్లను తగ్గించుకునే ప్రయత్నాలు చేయడంతో నిఫ్టీ 38 పాయింట్లు పడిపోయింది. చమురు షేర్ల వెలుగులు టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్‌లు 1-2 శాతం నష్టపోయాయి. వర్షాలు సరిగ్గా కురవకపోవడం వాహన షేర్లపై ప్రభావం చూపింది. మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, మారుతీ సుజుకి, టాటా మోటార్స్ 2-4 శాతం రేంజ్లో క్షీణించాయి. ఎన్టీపీసీ, టాటా పవర్ షేర్లు 2-3 శాతం రేంజ్లో పడిపోయాయి. మంగళవారం దూసుకుపోయిన సన్‌ఫార్మా కంపెనీ షేర్లలో లాభాల స్వీకరణ కారణంగా బుధవారం 1.4 శాతం క్షీణించింది. సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్లు 1 శాతం చొప్పున పడిపోయాయి. ఇక ఎల్ అండ్ టీ, కోల్ ఇండియా, భెల్ కంపెనీల షేర్లు 0.5-3.5 శాతం రేంజ్లో పడిపోయాయి. బ్యాంక్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. హెచ్డీఎఫ్సీ ద్వయం, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌షేర్లు తగ్గాయి. రైల్వే సంబంధిత షేర్ల పతనం బుధవారం కూడా కొనసాగింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ, గెయిల్‌లు 0.5-1.6 శాతం పెరిగాయి. సంక్షేమ పథకాలను పునర్వ్యస్థీకరణ జరగాలని ఆర్థిక సర్వే వెల్లడించడంతో ఎఫ్ఎంసీజీ షేర్లు, ఐటీసీ 2 శాతం, హిందూస్తాన్ యునిలివర్ 0.8 శాతం చొప్పున పెరిగాయి.మార్కెట్ బ్రెడ్త్ బలహీనంగా ఉంది. బీఎస్ఈలో 2,086 షేర్లు నష్టపోగా, 893 షేర్లు లాభపడ్డాయి. బీఎస్ఈలో రూ.3,827 కోట్ల టర్నోవర్ నమోదైంది. చైనా ద్రవ్యోల్బణం, యూరప్ పారిశ్రామిక డేటా బలహీనంగా ఉండడం వంటి కారణాల వల్ల అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. వాల్యూయేషన్లు అధికంగా ఉన్నాయన్న అంచనాలతో ఆసియా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగియగా, యూరోప్ సూచీలు ప్రారంభంలో తక్కువ స్థాయి వద్ద ట్రేడవుతున్నాయి.