రోజుకో కొత్త రికార్డు
రోజుకో కొత్త రికార్డును సృష్టిస్తూ దే శీ స్టాక్ మార్కెట్ల జోరు కొనసాగుతోంది. సెన్సెక్స్ తాజాగా 124 పాయింట్లు లాభపడటం ద్వారా 26,272 వద్ద ముగిసింది. వెరసి వరుసగా 8 రోజుల్లో 1,265 పాయింట్లను తన ఖాతాలో జమ చేసుకుంది. ఈ బాటలో నిఫ్టీ 35 పాయింట్లు పుంజుకుని 7,831 వద్ద నిలిచింది. తద్వారా 8 రోజుల్లో 376 పాయింట్లు పురోగమించింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 26,293కు చేరగా, నిఫ్టీ 7,835 వద్ద గరిష్టాన్ని తాకింది. ఇవన్నీ కొత్త రికార్డులే కావడం విశేషం. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందుతున్న సానుకూల సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, దేశీ ఆర్థిక పురోగమనంపై ఆశలు వంటి అంశాలు సానుకూలంగా ఉన్నాయి.
దీంతో 2012 సెప్టెంబర్ తరువాత మార్కెట్లు మళ్లీ వరుస లాభాలు ఆర్జిస్తున్నాయి. ప్రపంచ మార్కెట్లలో ఉత్తమం: ఈ ఏడాది ఇప్పటివరకూ దేశీ మార్కెట్లు 24% ఎగశాయి. తద్వారా ప్రపంచ మార్కెట్లలో ఉత్తమంగా నిలిచాయి. ఈ కాలంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) 12 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేశారు. ఇందుకు ప్రభుత్వ సంస్కరణలు దోహదపడుతున్నట్లు నిపుణులు తెలిపారు. బీమాలో ఎఫ్‌డీఐలకు సంబం ధించి కేంద్ర నిర్ణయం నేపథ్యంలో రిలయన్స్ క్యాపిటల్ షేరు 4% ఎగసింది.
ఇక మరోవైపు ప్రభుత్వ బాండ్లలో ఎఫ్‌ఐఐల పెట్టుబడి పరిమితిని 5 బిలియన్ డాలర ్లమేర పెంచడం ద్వారా మొత్తం పరిమితిని 30 బిలియన్ డాలర్లకు ఆర్‌బీఐ చేర్చింది. వీటికితోడుగా రైల్వేలు, రక్షణ రంగాలలో సైతం ఎఫ్‌డీఐలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనుంది. ఇక స్టాక్ మార్కెట్లలో గత మూడు రోజుల్లో రూ. 1,225 కోట్లను ఇన్వెస్ట్‌చేసిన ఎఫ్‌ఐఐలు గురువారం మరో రూ. 282 కోట్ల విలువైన షేర్లను కొన్నారు.
కార్పొరేట్ బ్రీఫ్స్
ఎస్‌కేఎస్ మైక్రోఫైనాన్స్: ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో ఎఫ్‌ఐఐల వాటా 44.61%కు ఎగసింది. ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధికంకాగా, మార్చి ముగిసేసరికి ఈ వాటా 38.36%గా నమోదైంది. ఈ కాలంలో షేరు ధర 35% సైతం ఎగసింది.
సెబీ: ఈ ఏడాది ఏప్రిల్-జూన్ కాలంలో 8 కంపెనీలు రూ. 222 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ చేసినట్లు తెలిపింది. వీటిలో ప్రధానంగా మహారాష్ట్ర సీమ్‌లెస్ రూ. 100 కోట్లు, మోతీలాల్ ఓస్వాల్ రూ. 56 కోట్లు చొప్పున ఖర్చు చే శాయి.
టాటా స్టీల్: అంతర్జాతీయ మార్కెట్లలో రెండు రకాల బాండ్ల విక్రయం ద్వారా 1.5 బిలయన్ డాలర్లు(రూ. 9,000 కోట్లు) సమీకరించింది.