మాల్యా నిధుల మళ్లింపు వ్యవహారంపై సెబీ దర్యాప్తు | Story image for SEBI inquiry from Livemint Sebi may refer charges of fund diversion against Vijay Mallya to SFIO | Sakshi
Sakshi News home page

మాల్యా నిధుల మళ్లింపు వ్యవహారంపై సెబీ దర్యాప్తు

Published Mon, Jul 11 2016 12:59 AM | Last Updated on Mon, Sep 4 2017 4:33 AM

మాల్యా నిధుల మళ్లింపు వ్యవహారంపై సెబీ దర్యాప్తు

మాల్యా నిధుల మళ్లింపు వ్యవహారంపై సెబీ దర్యాప్తు

న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రుణ భారంలో కూరుకుపోయి, ప్రస్తుతం బ్రిటన్‌లో ఉంటున్న పారిశ్రామిక వేత్త విజయ్‌మాల్యా అక్రమ ఆర్థిక లావాదేవీలపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ దృష్టి సారిస్తోంది. ప్రత్యేకించి ఒకప్పటి లిస్టెడ్ గ్రూప్ కంపెనీ నుంచి ఇతర కంపెనీలకు, అలాగే విదేశాలకు, వివిధ స్పోర్ట్స్ వెంచర్లకు నిధుల మళ్లింపు వ్యవహారంపై సెబీ విచారణ జరపనుంది. అవసరమైతే ఈ విషయంలో విదేశీ విచారణ సంస్థల సహాయాన్నీ సెబీ తీసుకోనున్నట్లు ఒక అత్యున్నత స్థాయి అధికారి తెలిపారు. యునెటైడ్ స్పిరిట్స్‌కు సంబంధించే దాదాపు రూ.2,500 కోట్లకుపైగా నిధుల మళ్లింపు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement