ట్రంప్‌ హోటల్స్‌తో ప్రవాసీ జట్టు | Trump group to team with Delta hoteliers for new chains | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ హోటల్స్‌తో ప్రవాసీ జట్టు

Published Wed, Jun 7 2017 1:30 AM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM

ట్రంప్‌ హోటల్స్‌తో ప్రవాసీ జట్టు - Sakshi

ట్రంప్‌ హోటల్స్‌తో ప్రవాసీ జట్టు

న్యూయార్క్‌: ప్రవాస భారతీయుడికి చెందిన చావ్లా హోటల్స్‌.. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమారుల సారథ్యంలోని ట్రంప్‌ హోటల్స్‌తో చేతులు కలిపింది. ఈ భాగస్వామ్య ఒప్పందం ప్రకారం అమెరికాలోని మిస్సిసిపీలో నాలుగు హోటల్స్‌ను నిర్మించనున్నారు. అమెరికన్‌ ఐడియా పేరిట మూడు, సియోన్‌ బ్రాండ్‌ కింద మరొకటి వీటిలో ఉండనుంది.

పంజాబ్‌కి చెందిన వీకే చావ్లా చాన్నాళ్ల క్రితం అమెరికా వలస వెళ్లారు. అక్కడే చావ్లా హోటల్స్‌ పేరిట 17 హోటల్స్‌ నిర్మించారు. తాజాగా ట్రంప్‌ హోటల్స్‌తో కలిసి రూపొందించే ప్రాజెక్టులో 20 మిలియన్‌ డాలర్లకు పైగా ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు చావ్లా హోటల్స్‌ సీఈవో దినేశ్‌ చావ్లా తెలిపారు. ట్రంప్‌ హోటల్స్‌కి ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడి తనయులు డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్, ఎరిక్‌ సారథ్యం వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement